FAV WEBSITE
పనిముట్లు ‹ సంభవామి యుగే యుగే — WordPress
ఏప్రియల్ 23, 2009 · వ్యాఖ్యానించండి
→ Leave a Commentవర్గాలు 1
2006 లో వచ్చిన మంచి films
జులై 10, 2007 · వ్యాఖ్యానించండి
టైటిల్ చూసే అర్ధం అయ్యుంటుంది ఈ పాటికి … చాలా రోజుల్నుంచి రాయాలంకుంటున్న పోస్టు … దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగాయాని … ఎప్పుడొ రిలీస్ అయినా వాటి గురించి ఇప్పుడు ఈ నస !! కొన్ని ఈ లిస్ట్ లో లేవు అంటే బాలేవు అని కాదు ….. వాటి గురించి సపరేటు గా పేద్ద పేద్ద పోస్టులు రాసుకొస్తానని అర్ధం
.
Paprika :
ఇదో జపనీస్ animated ఫిలిం (not animes) , ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఎదో కల లా అనిపించింది , ఇది సినిమానే అని నిర్ధారించుకోవడానికి చాలా సార్లు తల ష్రగ్ చేస్తూనే ఉన్నాను … amazing piece of animation. ఈ సినిమా డిరెక్టర్ Satoshi Kon కి ఇలాంటి సినిమాలు తీయడం కొత్తేమీ కాదు , ఇంతకు మునుపు నేను చూసిన ఈయన సినిమా Millennium Actress అది కూడా బ్రిల్లియంట్ సినిమా అనుకోండి. ఇక Paprika కధ కొస్తే … ఇది పూర్తిగా కలలకు (dreams) సంభంధించిన స్టోరీ … ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది , ఎవరైనా మీ కల లోకి చొరబడితే ఎలా ఉంటుంది ?? Paprika సినిమా లా ఉంటుంది.
ఈ మధ్యే ఈ బ్లాగ్ లో రాసిన Waking Life లా ఇది టూ complexive కాక పోయినా దీనిలో ఉండే surreal , stream of conscience, dream symbolism మెధడ్స్ మన మెదళ్ళని కట్టి పడేస్తుంది.
ఇలాంటి సినిమాలు మరికొన్ని : Waking life , Abre los Ojos / Open your eyes
Knocked Up :
బాచిలర్ హూడ్ …. బిందాస్ లైఫ్ …. వన్ నైట్ స్టాండ్ … ప్రెగ్నెంట్ … షాక్ … పేరెంట్ హుడ్ …. ఇది స్థూలంగా కధ …. అట్టర్లీ ఫన్నీ సర్కాసం (sarcasm) … కొంత మంది దీన్ని క్రాప్ అన్నారు … కానీ నాకు మాత్రం భలే నచ్చ్హేసింది … చాలా సింపుల్ స్టొరీ లైన్ …. పెర్ఫార్మెంసెస్ కూడా అవరేజే …. కానీ మస్త్ మూవీ …. హోల్ సం టైం పాస్ గారెంటీడ్ ….
The Fountain :
ఈ సినిమా చూసి నాలుగు నెలలు అవుతున్నా … దీని గురించి ఇంకా నేనో అభిప్రాయానికి రాలేక పోయా … ఇప్పటి వరకు ఓ మూడు సార్లు చూసా … చూసిన ప్రతీ సారీ ఓపీనీయన్ మారి పోతోంది , కొత్త కొత్త doubts పుడుతున్నాయి …. అన్ని సార్లు చూసినా … ఇంకా చాలా qwestions unanswered.
Xtential , philosophy , time travel , parallel stories ఈ genres అన్నిటి నీ పునికి పుచ్చుకున్న కధ ఈ సినిమాది …ఇలాంటి వాటిని interpret చేయడం కొంచం కష్టం …. ఈ రకం సినిమా ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్ధం / అవగాహన చేసుకుంటారు కాబట్టి ఒక్క పద్ధతి లో interpret చేయడం కష్టం …. ఏదేమైనా ఇంకా బాగా అరగాలి సినిమా నాకు …
కధ విషయానికి వస్తే … వేల సం. వ . రాల టైం స్పాన్ లో సాగుతుంది కధ … అటు మాయన్ సామ్రాజ్యం నుంచి ఈ నాటి టైం లైన్ ని టచ్ చేస్తూ … రేపటి భవిష్యత్తు లోనూ సాగే … లవ్ స్టోరీ … ఈ మూడు కధలు పారలల్ గా సాగుతాయి …. సినిమా కొన్ని చోట్ల ‘Vanilla sky ‘ లాగే మన Consciousness loci ని దాటి వెళ్ళి పోతుంది అనిపించింది … అందుకే చాలా మందికి ఇది మొదట చూడ గానే నచ్చక పోయి ఉండొచ్చు.
అసలు ఈ సినిమా 2002 లోనే రావల్సింది … అప్పట్లో బ్రాడ్ పిట్ట్ , కేట్ బ్లాంకెట్ తో కలిసి ఈ సినిమా నిర్మించాల్సి ఉండగా … మధ్య లో నే రద్దై పోయింది , మళ్ళీ ఇన్నాల్టికి Hugh Jackman , Rachel Weisz తో నిర్మించారు.
అన్నిటి కంటే ముఖ్యంగా Darren Aronofsky is back అదే ఆనందంగా ఉంది …. pi , Requiem for a Dream లాంటి సినిమాలు తీసిన దర్షకుడు … ఇన్ని రోజులు గాప్ తీసుకుంటే ఇంకేమైనా ఉందా ….
Little Miss Sunshine :
ఈ సినిమా నాకు విపరీతంగా నచ్చేసింది !! దీని గురించి ఇక్కడ రాసే కంటే , సెపరేట్ పోస్ట్ రాయడం న్యాయం !!
this-film-is-not-abt-winning-itz-just-all-about-being-yourselves-n’-being-together !!
Children Of Men :
ప్రావీణ్ గారనట్టు ఈ సినిమా తో చాలా మందికి లింకు కుదర లేదు …. దీని కోసం కూడా సపరేటు పోస్ట్ రాయాలి.
Departed :
ఒక్కటి చెప్పొచ్చు Martin Scorsese is bak … ఆయన ఎటర్నల్ wait ఫర్ ఆస్కార్ ఈ సినిమా తో ముగిసింది …. కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే డిపార్టెడ్ కంటే దాని మూలం infernal affairs కొన్ని చోట్ల బాగా అనిపించింది !! అయినా Scorsese లాంటి వారి పై వెలెత్తే ధైర్యం ఎవరికుంది ?? ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ రోలింగ్ స్టోన్స్ రాక్ బాండ్ పై తీయ బోయే రాక్యుమెంటరీ (rocumentary= rock + documentary) కోసం వైటింగ్.
Leonardo DiCaprio కి ఈ 2006 బాగా కలిసొచ్చినట్టుంది , దీంతో పాటు బ్లడ్ డైమెండ్ సినిమాలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపాడు , DiCaprio కూడా ఆక్టింగ్ చేయగలడని ఈ రెండు సినిమాలు చూసాకే తెలిసింది
!!
Jack nicholsan ఎప్పటి లాగే అమేజింగ్ … Mark Wahlberg , Matt Damon కి కూడా బాగా చేసారు … వారికి కూడా పోయినేడు ఏడు Invincible , The Good Shepherd లాంటి హిట్స్ కొట్టారు !!
Bobby :
Robert F. Kennedy హత్య నేపధ్యం లో సాగే హిస్టారికల్ డ్రామా … ఆవరేజ్ సినిమా కానీ ఇక్కడ ఎందుకు దీని గురించి రాయాల్సి వచ్చిందంటే దీని కాస్ట్ గురించి …. ఈ సినిమాలో కాస్ట్ చాలా భారీ గా ఉంది మీరే చూడండి Anthony Hopkins , Laurence Fishburne,Ashton Kutcher, Lindsay Lohan,Demi Moore,Martin Sheen, Sharon Stone n’ Elijah Wood.
గదీ లిస్టు … అందరి ఆక్టింగ్స్ సొ సొ నే (xcluding Anthony Hopkins, Marin sheen ) , మొత్తమ్మీద బోరింగ్ సినిమా అయినా ఈ స్టార్ కాస్ట్ కోఅం ఒక సారి చూడొచ్చు !!
The Queen :
2006 లో వచ్చిన మంచి బయోగ్రాఫికల్ సినిమాల్లో ఇది బెస్ట్ !! ప్రిన్సెస్ డైయానా మ్రుతి నేపధ్యం లో సాగుతుంది కధ … తన సాంప్రదాయ , ఉన్నతమైన అంత:పుర కట్టుబాట్లు … ఈ నాటి పాపారాజీ , సెలెబ్రీటీ కల్చర్ గా మారుతున్న క్రమానికి సాక్షిగా నిలిచిన Elizabeth II మాహా రాణి కధే ఇది. ఈ quasi comedy లో Elizabeth II మాహా రాణి గా హెలెన్ మిర్రెన్
(Helen Mirren) మంచి expressive faces తో నటించారు. Tony Blair గా నటించిన Micheal Sheen పెర్ఫార్మెన్స్ సినిమా కి మరో అసెట్. ఓవరాల్ గా 2006 లో వచ్చిన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లొ ఇదోటి.
Black Book (Zwartboek) :
ఇదో నార్వేఇయన్ (norwegian) వార్ సినిమా ….. దీనీ కధ రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యం లో ఉంటుంది. పేరుకే వార్ సినిమా అయినా ఇందులో లవ్ స్టోరీ నే ఎక్కువ.
ఓకే డోకే మూవీ ….. మరీ అంత సూపర్భ్ ఏమీ కాదు Carice van Houten ఆక్టింగ్ బావుంది. Paul Verhoeven (Basic instinct , robo cop fame) దీని డైరెక్టర్ .
The Prestige :
ఈ సినిమా లో నికోలా టెస్లా కి రోల్ ఉంది అని తెలిసనపట్టినుంచి …. దీని రిలీస్ కోసం కళ్ళు కాయాలు కాసే లా వేచి చూశా. ఇద్దరు మెజీషియన్స్ తమ రహస్యాలు కాపాడుకో్వడానికి ఎంత దూరం వెళ్ళారు అనేది కధ ….. అదమ్మా వర్క్ డెడికేషన్ అంటే … ఊరికే తిని తొగుంట్టే సరిపోదు.
Memento చూసినప్పట్టి నుంచి నాకెందుకో Christopher Nolan అంటే కొంత సాప్ట్ కార్నర్ …. సినిమా లో ట్విస్టులే ట్విస్టులే …..
నేను అన్నిటికన్నా ఆనందించే విశయం …. ప్రపంచం మరచి పోయిన అపర మేధావి …. మా దేవుడూ అయినా నికోలా టెస్లా గురించి ఈ సినిమా ద్వారా మరింత మందికి తెలియడం.
టెస్లా రాక్స్ …. ఏడిసన్ సక్స్ …….
మెజీషియన్ కధ నేపధ్యం లో 2006 వచ్చిన మరో సినిమా Edward Norton starrer THE ILLUSIONIST. సినిమా సో సో అయినా ఎడ్వ్రర్డ్ నార్టన్ నటన కోసం కచ్చితంగా చూడాలి.
The Pursuit of Happyness :
ఇది కూడా బయోగ్ర్రాఫికల్ సినిమా నే …. కాక పోతే రాగ్స్ టు రిచెస్ స్టోరీ అన్న మాట …. Will Smith ఇంత బాగా ఆక్ట్ చేస్తాడనుకోలేదు …. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ….
Live Of Others :
ఇదో జర్మన్ సినిమా , absolute stunner ఫారిన్ లాంగ్వేజ్ కాటగిరీ లో ఆస్కార్ విజేత ….. దీని గురించి రెండు ముక్కల్లో చెప్పడం సాధయం కాదు …. ఒక సపరేట్ పోస్ట్ రాసుకొస్తా …
Stranger than fiction :
మీరు జీవిస్తున్న జీవితం మీది కాదు ….. ఎవరో అజ్ణాత రచయిత రాస్తున్న కధలో పాత్ర అని ….. ఆ పాత్ర ని ఆ రచయిత తొందర్లో చంపేసి (అంటే మీరు చచ్చి పోతారని ) మీకు తెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ?? Harold Crick పరిస్థితి లా ఉంటుంది. మంచి కామెడీ సినిమా ఇది …. visuals కూడా చాలా ప్లీసింగా (pleasing)ఉంటాయి. Will Ferrell నటన బావుంది. సినిమా లో Harold Crick కి Ana Pascal కి మధ్య రోమాన్స్ ని ఇగ్నైట్ చేసే పాట చేసే నాకు విపరీతంగా నచ్చేసింది …. ఈ పాట పాడింది రాసింది Wreckless Eric.
సినిమా లో ఈ పాట సీన్ యూట్యూబ్ లో క్లిప్.
http://www.youtube.com/watch?v=aXAKEeYmUus.
Wreckless version :
http://www.youtube.com/watch?v=DSjwl8lHEVE
మీకు గిటార్ వస్తే ఈ పాట ప్లే చేయడం చాలా వీజీ ….. నేను రెండు రోజుల్లో నేర్చేసుకున్నా …..
2006 లో వచ్చిన మరికొన్ని సినిమాలు ,వార్ సినిమాలు , షార్ట్ సినిమాలు , డాక్యూమెంటరీల కోసం మరో పోస్టు ….
→ Leave a Commentవర్గాలు 2006 · డైరెక్టర్లు · సినిమాలు
గ్రహాంతర వాసులు
జులై 2, 2007 · అభిప్రాయములు
మొన్న మా ఫ్రెండ్ తో ఓ చిన్న డిబేట్ మొదలయ్యింది , గ్రహాంతర వాసుల ఉనికి తెలుసుకోవడానికి ఉన్న అడ్డంకుల గురించి … కూసింత డిస్కషన్ … కొసింత డిబేట్ … ఆఖరుకు కొన్ని కంక్ల్యూసన్స్ … మాకు తోచిన కొన్ని థాట్స్ …
జీవం విశ్వం అంతా నిండి ఉంది . ఇన్ని కోటానుకోట్ల నక్షత్రాల లో ఒక్క దాంట్లో కూడా జీవం ఆవిర్భవించి బతికి బట్టకట్టలేదంటే సైన్సే ఒప్పుకోదు , అది కేవలం భూమి కే పరిమితం అయితే మాత్రం అదో పెద్ద మిరాకిలే … కాబట్టి భూమి మీద కాకుండా మరి కొన్ని చోట్ల కూడా జీవం ఉండే అవకాశం లేక పోలేదు . కానీ దాని ఉనికి మనకు చేరడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి …
1) మన పాల పుంత లో నే జీవం ఉందనుకున్నా … అది వేరే కాలానికి చెంది ఉండవచ్చు … eg- Aliens ఒక 4 బిలియన్ సంవత్సారాల కింద ఉండి , ఇతర గ్రాహాంతర వాసుల కోసం అంటే మన కోసం వెతికితే మైక్రోస్కోపిక్ లెవల్లో కూడా మన జాడ వారికి తెలిసే అవకాశం లేదు … కారణం భూమి మీద జీవం పుట్టి కేవలం 3.5 బిలియన్ సంవత్సారాలే అయ్యింది.
2) మన దురద్రుష్టం కొద్దీ మనకు Interstellar space లో చిన్న పాటి దూరాలు ప్రాయాణం చేయడానికి ఉన్న అవకాశాలు కూడా చాలా తక్కువ. ఒక Alien కమ్యూనిటీ మనమున్న టై ఫ్రేం లోనే ఉందనుకున్నా అది కాస్తా 30 వేల కాంతి సం. రాల(light years) దూరం లో ఉంటే మన చేసేది ఏవీ లేదు. అంత దూరం astronomical గా చూస్తే చాలా తక్కువ కానీ మనం చేరడానికి మాత్రం ఆస్కారం లేదు.
3) సరే … ఆ Aliens కాస్తా మన టైం ఫ్రేం లోనే ఉండి , మనం చేరగలిగే దూరం లో ఉన్నా వారిని చేరుకోక పోవడానికి ఇంకో కారణం ఉంది. ఆ Alien కమ్యూనిటీ జీవం మనకు సంబధం లేని మరో form లో ఉండొచ్చు. అంటే వారి జీవం మనలా carbon బేస్డ్ గా కాకుండా silicon ద్వారా నిర్మితమై ఉంటే ఇప్పుడు మనచేసే బయలాజికల్ టెస్ట్స్ ద్వారా వారి ఉనికిని తెలుసుకోలేం … మనం పంపించిన రోవర్స్ వల్ల కానీ మ్రే ఇతల sattileite vehicles ద్వారా కానీ ఇతర గ్రాహాల పై మైక్రోస్కోపిక్ లెవల్లో పరి్శొధనలు చేయడం కూసింత కష్టం.
కాబట్టి ఈ కష్టాలన్నీ గట్టెక్కి ఆ Aliens ని కనుక్కునే సరికి ఇంకా ఎన్ని యుగాలు పడుతుందో …
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పైన చెప్పిందంతా ట్రాష్ … ఇప్పుడు అసలు నిజం చెబుతాను ….
అసలు నే ఈ గ్రాహానికే చెందినవాడిని కాదు … MARS నుంచి వచ్చా …. yeah … i’m a martian.
మా గ్రహం పై జనాభా ఎక్కువై పోవడం తో ఉండడానికి ఇతర గ్రాహాలేవైనా ఉన్నాయో చూడ మని మా మార్స్ ప్రభుత్వం కొంత మంది సైనికుల్ని పంపింది … దాంతో వెత్తుకుంటూ నేను భూమిదకొచ్చి పడ్డా … హ హా …. తొందరలో మా సైన్యం వచ్చేస్తుంది …. భూమి పై గెలిచి , ఆక్రమించేస్తాం …… హి హ హ ……
→ 7 Commentsవర్గాలు aliens · science
Nikolai Gogol
జూన్ 25, 2007 · 1 వ్యాఖ్య
కాఫ్కా(Franz Kafka) రాసిన The Castle లాగే గొగోల్ రాసిన Dead Souls ని కూడా ఒక unfinished masterpiece అంటారు , అది ఎందుకు unfinished గా మిగిలిపోయింది అన్నదానికి బోలెడు కధనాలు కూడా వినిపిస్తాయి , ఆయన దీని సీక్వెల్ రాసేపాటికి అయనలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువయ్యి తన రచన పై ఒక రకమైన dejection తో దాన్ని అలాగే పూర్తి చేయకుండా వదిలేసారు .పైగా రష్యా లో ఉన్న అప్పటి పరిస్థితులు ఆయన పై మరింత ప్రభావం చూపించి ఉండొచ్చు .
ఈ క్రమం లో నే ఆయన రష్యన్ రైతులను తిడుతూ Czar ని దేవుడి దూతగా గా కీర్తిస్తూ ఫేమస్ మరియూ కొంత నోటోరియస్ అయిన “Selected Excerpts from Correspondence with Friends” రాసారు. ఈ క్రమం లో Vissarion Belinsky అనే లిటరరీ క్రిటిక్ Gogol తను ఒక రచయిత అని మరిచిపోయి ఎలా ప్రవర్తిస్తున్నాడో చెబుతూ అతని రచనని తూర్పారబడుతూ ఒక పబ్లిక్ లెటర్ రాసారు. ఈ లెటర్ కి చాలా ఫేమస్ అయ్యింది , దీంతో గోగోల్ పై విమర్షల జడివాన మరింత పెరిగి … ఆయన ఒక రకమైన black melancholy వెళ్ళిపోయాడు …. కానీ ఆయన రాసిన “The Cloak /The Overcoat ” లాంటి నవలలు మాత్రం చాలా ఫేమస్ అయ్యాయి …. జుంఫా లాహిరి రాసిన “Namesake” లో The Cloak బుక్కే కధకి ఆధారం …… Namesake ని అదే పేరు తో మీరా నాయర్ సినిమా గా కూడా తీసారు.
అందులో ప్రోటాగానిస్ట్ పేరు గోగోలే (Gogol).
“పొద్దు ” లో నికొలాయ్ గొగోల్ dead Souls ని తెలుగు లోకి అనువదిస్తున్నారని చూసా …. చాలా మంచి ప్రయత్నం ఆల్ ద వెరీ బెస్ట్ పొద్దు టీం !!
కొన్ని లింకులు :
Letter To Gogol full text —- Letter To Gogol
Project Gutenberg లో Dead Souls —- Dead Souls
The Cloak / The Overcoat —— The Overcoat , full text
→ 1 Commentవర్గాలు Nikolai Gogol · books · క్రిటిక్స్
అగ్నీ
జూన్ 24, 2007 · అభిప్రాయములు
ఇదో ఇండియన్ రాక్ బాండ్ గురించి …. పేరు …. అగ్నీ వీరు ఈ మధ్య రెలీస్ చేసిన “సాధో రే ….” పాట ఇండియన్ రాక్ అరీనా ని ఒక్క సారి గా ఊపేస్తోంది !! డీప్ అండ్ intense లిరిక్స్ మరియూ విసువల్ గా కూడా astounding గా ఉంది వీరి ఆల్బం . “సాధో రే ….” పాట కి కాబీర్ దాస్ రాసిన ఒక పాట మూలం. ఆయన రాసిన దాన్ని ఏ మాత్రం మార్చకుండా కేవలం ట్యూన్ కట్టారు … ఎప్పుడో 400-500 సం వ రాల కింద కాబీర్ దాస్ లోకం గురించి రాసిన పాట అది …. ఇప్పటికీ మన పరిస్థితి అలాగే ఉంది అని ఈ సాంగ్ వల్ల మరో సారి నిరూపించారు అగ్నీ. అల్బం లో అన్ని పాటలూ బాగనే ఉన్నాయి …Arijit , Koko (బేస్ గిటార్ ) , Mohan (వోకల్స్ ) తో కూడిన ఈ బాండ్ … ఇండియన్ రాక్ అరీనా లో మరో ధ్రువ తార అనొచ్చేమో … వీరు చాలా రోజుల్నుంచి ఉన్నా MTV Roadies కి ఇచ్చిన బాక్ గ్రౌండ్ మ్యూసిక్ తో lime light లో కి వచ్చారు. వీరి పాత ఆల్బంస్ ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు http://72hoytstreet.net/music/agni/ (ఇది కాపీ రైట్ ఉల్లంఘణ కాదు , ఎందుకంటే ఈ పాటలు బాండ్ మెంబర్ Koko అనుమతి తో నే net లో పెట్టారు
)
Indian Rock అనేది indus creed అనే బాండ్ తో మొదలైంది అనొచ్చేమో … Rock Machine కూడా కొన్ని రోజులు అలరించినా తరువాత పెద్దగా వినపడలేదు. ఈ మధ్య pentagram , parikrama , agnee , brahma లాంటి బాండ్స్ వస్తున్నా ఏవి నిలబడతాయో చెప్పలేకుండా ఉంది. అలా అని మనం ఏమీ మరీ చెండాలమైన స్థితి లో ఏం లేం Indian Ocean , Vaayu , GnarL లాంటి వారు అప్పుడప్పుడూ ప్రపంచ వ్యాప్తంగా తలుక్కు మంటూ నే ఉన్నారు … ఈ మధ్యే Indian Ocean వారికి లండన్ లో ప్రముఖ edingburgh రాక్ concert లో Dream Theatre, Slayer, Iron Maiden లాంటి వాళ్ళ తో కలిసి షో చేసే అవకాశం కూడా దక్కింది. వీరి పై ఓ చిన్న రాక్యుమెంటరీ (Rocumentary = Rock Documentary) కూడా చేసారు యూ ట్యూబ్ లో ట్రైలర్
వీళ్ళే కాక కొన్ని ప్ర్రమిసింగ్ రాక్ బాండ్స్ కూడా వెలుగు లోకి వస్త్తున్నాయి.
మన హైద్రాబాద్ కూడా Rock లో మరీ వెంకబడేం లేదు మనకీ Sledg,Wreckage,After Death,Kamoflagodz,Stiffneck Syndrome,Microtone,Mask of Sanity.History Makers,Gnarl లాంటి బాండ్స్ ఉన్నాయి , ఈ మధ్యే EXAybuss అనే బాండ్ అనీష్ కురివిల్లా తీసిన “Confessions Of a flim maker ” కి background మ్యూసిక్ కూడా అందించారు.
అగ్నీ బాండ్ యొక్క సాధో రే ….. లిరిక్స్ ఇక్కడ http://www.poemhunter.com/poem/tentacles-of-time/)
… పాట యూట్యూబ్ లో
http://www.youtube.com/watch?v=FBsiFhcTbc4
(ఈ బాండ్ పేరు అగ్ని (Agni) కాదు అగ్నీ (Agnee) కాబట్టి నే తప్పు రాసానని లొల్లి జేయొద్దు )
→ 3 Commentsవర్గాలు music
Animes , Rotoscoping … et al …
జూన్ 15, 2007 · 1 వ్యాఖ్య
Waking Life (వేకింగ్ లైఫ్ ) —- నాకు ఫిలసాఫికల్ / ఫాంటసీ / xtential సినిమాలు చాలా ఇంట్రెస్ట్ ….. ఈ సినిమా కూడా పూర్తిగా వాటి తో నిండినదే …. అందుకే నచ్చేసింది ..
ఇది రోటోస్కోపింగ్ (Rotoscoping) అనే టెక్నిక్ తో తీసారు … ఈ మధ్యే వచ్చిన A Scanner Darkly తీసిన Richard Linklater దీని డైరెక్టర్ కూడా … A Scanner Darkly కి కూడా ఇదే టెక్నిక్ వాడారు.
ఇలాంటి కధ లకు Rotoscoping లాంటి ఆనిమేషన్ టెక్నిక్స్ వాడితే తప్ప తెరకెక్కించలేమనిపిస్తుంది. ఒక డ్రీం (కల ) నుంచి మరో డ్రీం కి మారుతూ … extentialism … Post modernism …. quantum theory …. ఇలా రక రకాల ఫిలాసఫిల లోకి మన మదడు ని దూరిస్తూ … ఒక మైండ్ మాజిక్ క్రియేట్ చేస్తుంది …. దీంతో మన మెదడు లో ఎక్కడో … నిద్రించుకుపోతున్న heterogeneous views ని తట్టి లేపుతుంది. ఈ సినిమా చూస్తే హ్యూమన్ సైకాలజీ , extential science , ఫిలాసఫీ మీద వంద బుక్కులు చదివిన ఫీలింగ్ కలిగింది. ఇలాంటి ఫీలింగే కొంత I Heart Huckabees లాంటివి చూసినప్పుడు కూడా కలిగినా , ఇది కొంత డిఫరెంట్ … ఒక స్టాటిక్ స్పేస్ ( static space) నుంచి డైనమిక్ ప్లేన్స్ (dynamic planes)కి సాగే కధ ఒక రకమైన hallucinatory effect ని కలిగిస్తుంది. ఈ సినిమా కు Philip K. Dick రాసిన ఒక షార్ట్ స్టోరీ మూలం , నాకు Philip K. Dick కధలు పెద్దగా పరిచయం లేవు కానీ ఈ సినిమా ఇచ్చిన కిక్కుకు , ఆయన వర్క్శ్ కచ్చితంగా చదవాలని డిసైడ్ అయ్యా …. వీకెండ్ లో చాలా ప్రశాంతంగా ఉన్నఫ్ఫుడు ఈ సినిమా చూడండి … ఒక ఇంక్రెడిబిల్ ఫీలింగ్ కలుగుతుంది .
Animes —-
నేను Animes … Manga కామిక్స్ / సినిమాలకు పిచ్చా ఫాన్ ని , Animes అంటే అనీమేషనే కానీ … కొంచం డిఫరెంట్ …. Pokemon , Animax చూసే వారికి ఇప్పటికి అర్ధం అయ్యుంటుంది …. ఎన్నో కల్ట్ (cult ) films కి Animes కామిక్స్ నుంచే ఇంస్పిరేషన్ … అదర గొట్టే ఫైట్స్ తో జనాలని ఉదరగొట్టేసిని Matrix triology లో ఫైట్స్ కి , కొంత వరకూ కధ కి కి Ghost in the shell అనే Animes inspiration. Full metal alchemist , naruto , shaman king Animes / Manga సీరీస్ / కామిక్స్ ని ఫాలో అవుతుంటే కలిగే ఆనందమే వేరు …. ఇప్పుడీ నసంతా ఎందుకంటే …. మా కేబుల్ వాడు వారం నుంచి Animax … చానెల్ ఆపేసాడు …. ఇవ్వారా బాబూ అంటే ఎంతకీ నా మొర ఆలకించడే …
Random notes …
బాల చందర్ సినిమా ఇది కధ కాదు —- ఈ సినిమా ఎప్పుడూ పూర్తిగా చూడలేక పోయాను అది కొంచం బాధ పడే వాడిని … నిన్న ఈ – టీవి వల్ల అది కాస్త తగ్గింది.
నిన్న ఈ – టీవి వాడు ఈ సినిమా మిని మూవీ పేరు తో వేసారు , అంటే 2 1/2 గంటల సినిమా ని అక్కడక్కడ కట్ చేసి 1 గంట లో చూపించేసాడు.
సినిమా లో స్టోరీ భలే ట్విస్టులు తిరిగింది …. అంత మంచి డిరెక్టర్ కాబట్టి … అన్ని ట్విస్టులు ఉన్నా కధ లో పట్టు ఉంచ గలిగారు బాల …. పాత్రల కారెక్టరిజేషన్ కూడా బావుంది.
ముఖ్యంగా …. సినిమా మొత్తం మనసు ఊగిసలాడుతూ సాగే జయ సుధ పాత్ర బావుంది , శరత్ బాబు అంత పంచీ గా అనిపించక పోయినా … కమల్ హాసన్ …. చిరంజీవి … సూపర్ …
మళ్ళీ చెప్పాలంటే … చిరంజీవి సూపరో సూపర్ …… ఈ సినిమా కూడా అంతు లేని కధ లాగే దేని నుంచి అయినా ఇంస్పిరేషనో కాదో తెలియదు.
→ 1 Commentవర్గాలు Animes · డైరెక్టర్లు · సినిమాలు
Fermat’s Last Theorem a Documentary
జూన్ 12, 2007 · అభిప్రాయములు
చిన్నప్పుడు నువ్వు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు రా అంటే … అందరు పిల్లల్లాగే డాక్టర్ అన్నా …
అప్పుడే మా నాన్న చెప్పారు unique గా అలోచించరా అని ….చించా …. కానీ ఏం లాభం … పెద్ద పెరిగితే పెద బావ కోతి అయినట్టు ….
కాస్త పెద్దయాక తెలిసీ తెలియని వయసులో ట్రక్ డ్రైవర్ కావాలనకున్నా … దేశం అంతా తిరగొచ్చు గా …
ఇంకొంచం తెలివొచ్చాక …. స్పోర్ట్స్ స్టార్ …. లేక రాక్ స్టార్ ….
అవన్నీ నా రేంజి కి తక్కువని తెలిసాక అందరి లాగే పోలో మంటూ ఇంజనీరింగ్ లో పడ్డా … (ఏం చేస్తాం డిగ్రీ లో సీట్ రాలేదు మరి ….)
మల్లీ ఇప్పుడు MBA కోసం వెంపర్లాట … తరువాత ఏమౌతానో ఎవరికి తెలుసు ….
నా కరీర్ పై నాకే సందేహం …. అంటే నా పై నాకే సందేహం …. ఇలా నేనే కాదు …. నాలా ఎంతో మందికి ఈ identity crisis.
ఈ డాక్యూమెంటరీ చూసాక అది ఇంకా పెరిగి పోయింది …. నా మీద నాకు చిన్న చూపు కాదు అసలు చూపే లేకుండా పోయింది !!
మరి 10 ఏళ్ళప్పుడు విన్న తింగర Mathematics equation solution కోసం 35 ఏళ్ళ జీవితం పణంగా పెట్టడం అంటే మాటలా ??
అది కూడా 357 సంవత్సరాలనుంచి ఎవరికీ చిక్కని equation ని సాల్వ్ చేస్తా నని పట్టు పట్టడ్డానికి ఎంత పట్టుదల కావాలి ??
అది నిజం చేసి చూపించారు Andrew Wiles the great.
ఇంతా చేసి 7 సం వా ల పాటు సీక్రెట్ గా పరిశొధన చేసి … యురేకా అంటూ అంటూ ప్రపంచం ముందుకు వచ్చి ప్రూఫ్ చేయ బోయి అందులో తనకే తప్పు కనిపించినప్పుడు …. నిరాశ చెందక … మళ్ళీ 2 సం వా ల కఠోర శ్రమ తో దానిని సాల్వ్ చేసిన Andrew Wiles గారికి ఎన్ని వేల మంగినీలు సరిపోతాయి …. పొగడ్డానికి ??
అఖరికి ఆ థీరం పేరే …. మార్చేసారు “Fermat-Wiles theorem” అని ఇంతకన్నా ఏం కావాలి ??
అసలీ సోదంతా ఎందుకు ఈ వీడియో చూసి …. కింద లింక్స్ చూసి మీకేనిమిపించిందో చెప్పండి …..
డాక్యూమెంటరీ director Simon Singh web page: http://www.simonsingh.net/The_TV_Film.html
Wikipedia లో Fermat’s last theorem : Fermat’s last theorem
Wiki లో Andrew Wiles : Sir Andrew John Wiles
Google Video link : Fermat’s Last Theorem (1996)
Video :
→ 5 Commentsవర్గాలు డాక్యుమెంటరీ · సినిమాలు
Ritwik ghatak ,Andrei Tarkovsky సినిమాలు
జూన్ 10, 2007 · అభిప్రాయములు
మొత్తానికి ఎలా అయితే నే … రిత్విక్ ఘటక్ సినిమా చూసేసా. ఈయన గురించి ఎన్నో రోజులనుంచి వినడం, చదవడమే కానే సినిమా ఏదీ చూళ్ళేదు అప్పుడప్పుడు … యూ ట్యూబ్ గూగుల్ వీడియోస్ లో కిన్ని క్లిప్స్ తప్ప.
ఆయన సినిమాలు చూడాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నాను …. ఎక్కడా దొరికి చావలేదు … నా కష్టాలు ఆ దేవుడికి సినిమా స్కోప్ లో కనిపించాయేమో మొత్తానికి చూపించేసాడు …..
మొన్న మా కజిన్ తో కలిసి తో కలిసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం , మాటల్లో తెలిసింది ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య బెంగాళి సినిమాల ఫాన్ అని దాంతో తో ప్ర్రణం లేచొచ్చినట్టయ్యింది … వెంటనే రిత్విక్ ఘటక్ సినిమాలేవయినా ఉన్నాయా అనడిగా. YUP అని రూం లో కి వెళ్ళొచ్చి “Meghe Dhaka Tara” , “Nagarik” సినిమాలు తెచ్చి నా వొళ్ళో పడేసింది ……
Meghe Dhaka Tara గురించి చాలా విన్నాను చదివాను రిత్విక్ ఘటక్ సినిమాల్లోకెల్లా ఇది బెస్ట్ అని చాలా చోట్ల విన్నాను.
ముఖ్యంగా ఆయన సినిమాలన్నీ బెంగాల్ పార్టీషన్ , దాని తర్వాత పరిస్థితుల బేస్డ్ గానే సాగుతాయి. Meghe Dhaka Tara , Nagarik రెండిటిలోనూ ఇది కనిపిస్తుంది, పాత్రల్లో కూడా ముఖ్యంగా ప్రోటోగానిస్ట్స్ పై ఆ సీక్వెంసెస్ ప్రభావం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ రెండు సినిమాలూ చూసాకా రిత్విక్ కధా, కధనాల శైలి ఆయన ఎంచుకున్న దీంస్ జపనీస్ డైరెక్టర్ Yasujiro Ozu (Tokyo Story ) వర్క్స్ కి చాలా దగ్గరి పోలికలు కనిపించాయి , నాకెందుకో ఇద్దరూ గొప్ప మినిమల్ ఆర్టిస్ట్స్ అనిపిస్తుంది.
Meghe Dhaka Tara —
ఒక శరణు శిబిరం నేపధ్యం గా సాగే నీతూ అనే అమ్మాయి కధ. తన కుటుంబం కోసం కష్టపడుతూ తను కర్పూరం లా కరిగి పోయినా ఫర్లేదు తన వాళ్ళు మాత్రం బాగుండాలి అనేది నీతూ.
ఇలాంటి కధలు మనకు కొత్త కాక పోయినా దీన్ని రిత్విక్ తీసిన తీరు కి అయనకి కుడోస్. బయట నుంచే కాక ఇంట్లోనుంచి కూడా తనకు ఏమోషనల్ సపోర్ట్ లేక పోవడం తో నీతూ కారెక్టర్ పడే సైకలాజికల్ స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. తను కుటుంబం కోసం అంత కష్ట పడ్దా వాల్లు మాత్రం సెటిల్లయ్యాక ఒక్కొక్కరు గా తనను వదిలేస్తారు.
బాల చందర్ సినిమా ” అంతు లేని కధ ” కు ఈ సినిమా నే మూలం కావొచ్చు. ఇందులో ని చాలా సీన్స్ అంతు లేని కధ లో మక్కికి మక్కి దించినట్టు అనిపించింది.
మొత్తానికి హార్ట్ బ్రేకింగ్ మెలో డ్రమాటిక్ సినిమా … రిత్విక్ ఘటక్ కి ఎందుకంత పేరో సినిమా చూసాక అర్ధం అయ్యింది. prime సీన్ నరేషన్ లో ఉండగానే subime గా మరో సెకండరీ ప్లాట్ ని నడిపిస్తూ తరువత దాన్నే ప్రైమరీ నరేషన్ లో కి తెచ్చే ishtyle భలే గా ఉంది.
Nagarik —-
రాము అనే నిరుద్యోగి జీవితం లో అతనికి అతని కుటుంబానికి ఎదురయ్యే కష్టాల కడలి ఈ సినిమా. పూర్తి గా రిత్విక్ స్టైల్ మెలో డ్రామా , హ్యుమానిటీ , xplotiataion తో నిండిన కధ.
తమ కుటుబం గడవడానికి కష్టంగా ఉండడం తో ఆధారం కోసం రాము కుటుంబం సాగర్ ని అద్దెకు ఉండమంటారు , ఇతనిది అంటాగానిస్ట్ కారెక్టెర్ , వాళ్ళ కష్టలు తీర్చక పోగా మరిన్న వచ్చి పడతాయి ఇతని వల్ల … ఆఖరికి తను కూడా దిక్కు లేని వాడు అవుతాడు. కానీ రామూ అతన్ని ఒక మంచి పౌరుడిగా అతన్ని త్రిగి చేరదీయడqm తో సినిమా ముగుస్తుంది.
మొత్తానికి రిత్విక్ ఘటక్ సినిమాలు రెండు చూసానోచ్ !!
Andrei Rublev —-
ఈ మధ్య చూసిన మరో సినిమా Andrei Tarkovsky తీసిన Andrei Rublev. ఆయన సినిమా ఇంతకు ముంపు రెండు చూసాను The Sacrifice , Solyaris చూసి ఉన్నా కాబట్టి ఆయన సినిమా ల పై కూసింత అవగాహన ఉంది. కానీ Andrei Rublev పూర్తిగా డిఫరెంట్ టేకింగ్ అనిపించింది. సింక్ కావడానికి కొంత టైం పట్టింది, ఇంకా పూర్తిగా interpret చేయలేక పోయాననే చెప్పాలి.
కానీ సినిమా ఎందుకో అంత మైండ్ బ్లోయింగ్ అనిపించలేదు . మే బీ అర్ధం చేసుకొని అవగాహన పెంచుకోవడానికి ఇంకో సారి చూడాలేమో…. కానీ దాన్ని ఇంకో సారి చూడ్డానికి ఎందుకో మంసొప్పుకోవట్లేదు. విసూవల్ గా మాత్రం సినిమా మంచి ట్రీట్ అని చెప్పొచ్చు.
→ 3 Commentsవర్గాలు డైరెక్టర్లు · బెంగాళీ సినిమా · సినిమాలు
Zidane: A 21st Century Portrait
జూన్ 1, 2007 · వ్యాఖ్యానించండి
Zidane: A 21st Century Portrait
ఈ సినిమా గురించి పోయిన సం. వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరిగినప్పటి నుంచి వింటున్నా …. ఇప్పటికి దొరికింది !!
లాస్ట్ వీకే చూసా …. హ్యూజ్ రెలీఫ్ …. నేనేమీ హార్డ్ కోర్ ఫుట్ బాల్ ఫాన్ ని కాదు కానీ ఎందుకో జిదాన్ లాంటి వారు ఆడుతుంటే మాత్రం అత్తుక్కుపోవల్సిందే ….
దీన్ని xperimental సినిమా / డాక్యుమెంటరీ అనొచ్చేమో … అసలు దీని సంగతేంటంటే … 17 హై డెఫినెషన్ కెమరాలతో ఒక real ఫుట్ బాల్ మాచ్ లో కేవలం జిదాన్ ని live గా ట్రాక్ చెయ్యడం !!
అవును 90 నిమిషాల సినిమా మొత్తం కేవలం జిదానే జిదాన్. మాచ్ లో అతని హావ భావలు , కదలికలను …. కెమరాలతో బంధించిన తీరు అద్భుతం !! … అసలు నిజంగా అమేజింగ్ ఎడిటింగ్ వర్క్ అని చెప్పొచ్చు … దీనికి సినిమాటోగ్రఫీ అదించింది ఫేమస్ సినిమాటోగ్రాఫర్ Darius Khondji.
ఈయన David Fincher సినిమాలు (se7en , panic room) చూసిన వారికి కొంత పరిచయమే … వాటికి ఈయనే సినిమాటోగ్రాఫర్ !! అసలు ఈ సినిమా లో Darius ఉపయోగించిన deep focus షాట్స్ తీరు నిజంగా అమేజింగ్ … బాల్ ని తన కాళ్ళ తొ నాట్యం చేయిస్తూ … తన క్లాసిక్ డ్రిబిల్ తో జిదాన్ బాల్ పాస్ చేయగానే … వెనకే అతన్ని ఆరాధించే కేరింతలు కొడుతున్న వేలాది జనాన్ని fore ground లోకి తెచ్చి జిదాన్ ని గ్లేర్ గా చూపించే కెమెరా వర్క్ నిజంగా మాస్టర్ ఫుల్ల్ !!
ఇక బాల్ ని దొరక పుచ్చుకునేందుకు రొప్పుతూ కదిలే జిదాన్ ఊపిరి శబ్దాన్ని….. జనాల కేరింతలని కలగలిపి తమ మ్యూజిక్ తో Mogwai రాక్ బాండ్ అందించిన బాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది !!
సినిమా సాగుతున్నంత సేపూ ఒక ఆటగాడి ఆలోచనలూ అతని భావాలు … opposite team పై చేయి సాధి్స్తుంటే ఆ క్షణం లో అతను పడే ఆవేదననూ … అతనికి గేం పై ఉన్న concentration ను మన కళ్ళకు కడుతుంది !!
అసలు ఈ సినిమా కాంసెప్ట్ చాలా ఎక్క్ష్పరిమెంటల్ … దీని దర్షకుల లో ఒకరైన Douglas Gordon కి ఇలాంటి experiments కొత్తేమీ కాదు … ఇతను ఇంతకు మునుపు Alfred Hitchcock సినిమా pyscho ని
కేవలం 2 ఫ్రేం రేట్స్ పర్ సెకండ్ (2 frames per second actual frame rate for a film is 24 frames per second) తో స్క్రీన్ చేసాడు …. అలా చెయ్యడం ఆ సినిమా కాస్తా తో ఏకంగా 24 గంటల సేపు సాగింది !!
అందుకే తన ప్రాజెక్ట్ కి 24 hours psycho అని పేరు పెట్టుకున్నాడు !! ఒక రకంగా అది వీడియో లా కాకుండా … బొమ్మలు గా చూసినట్టే .
ఆ psycho వర్క ని కాస్త పక్కన పెట్టి మన జిదాన్ విషయానికి వద్దాం …. మొత్తానికి నే చెప్పేదేంటంటే … ఇది నిజంగా సూపర్ xperimenట్ .
మీరు ఫుట్ బాల్ ఫాన్ కాక పోయినా అసలు మూవీ Editing , camera works కోసమైనా కచ్చితంగా చూడొచ్చు !! సినిమా లో అక్క్డక్కడా ronaldo , beckham కూడా తలుక్కు మంటారు ….
అసలు నన్ను కూడా బాస్కెట్ బాల్ మాచ్ లో ఇలాగే హై డెఫినెషన్ కెమరా ల తో ట్రాక్ చేసి చూడండి నేను ఎంత గొప్ప ప్లేయరో తెలుస్తుంది
!!
కొసమెరుపు : రెగులర్ సినిమాల్లో ట్విస్టు లాగానే … ఈ మాచ్ లో నిజంగా నే జిదాన్ కు ఆఖరి నిమిషం లో రెడ్ కార్డ్ ఇచ్చారు !!
ఈ సినిమా అఫీషియల్ వెబ్ సైట్
యూ ట్యూబ్ (నువ్వొక గొట్టం ) లో ఒక క్లిప్
→ Leave a Commentవర్గాలు డాక్యుమెంటరీ · డైరెక్టర్లు · సినిమాలు
The Seventh Seal / ద సెవంత్ సీల్ /Sjunde inseglet, Det (1957)
మే 18, 2007 · అభిప్రాయములు
The Seventh Seal / ద సెవంత్ సీల్ /Sjunde inseglet, Det (1957)
ఇది నాకు తెలిసి one of the most complex and ofcourse the greatest ever made .
దీని డైరెక్టర్ Ingmar Bergman గురించి ఎంత చెప్పినా తక్కువే …. ఇది ఒక స్వీడిష్ ఫిలిం
visuals , photgraphy ఆర్ట్ వాల్యూస్ పరంగా ఇది మే బీ ద గ్రేటెస్ట్ ఇన్ సినిమా హిస్టరీ .
స్థూలంగా కధ చెప్పాలంటే …
ఇది మెడీవల్ పీరియడ్ టైం లైన్ లో సాగుతుంది !!
Antonius Block అనే సైనికుడు , Crusades లో పాల్గొని … విరక్తి చెంది తన అనుచరుడి తో కలిసి తన దేశానికి చేరుకుంటాడు.
కానీ అప్పటికే ఆ దేశం భయంకర వ్యాధులతో అల్లకల్లోలంగా ఉంటుంది …. పైగా ఇతని కోసం డెత్ (మ్రుత్యువు మనిషి రూపం లో / human personification ) అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది …
ఈ క్రమం లో అతను తన జీవీతాన్ని పొడిగించడానికి మ్రుత్యువు తో చెస్ పందెం కాస్తాడు … తను ఓడిపోతానని తెలిసినా … పందెం నెపం తో తన కుటుంబాన్ని ఆఖరి సారి చూసుకోవచ్చని ఈ ఎత్తు వేస్తాడు ….
మ్రుత్యువు తో పోరాడుతున్న సైనికుడు (చెస్ ) లో అసలు ఊహించుకుంటేనే …. అదో రకమైన భయం కమ్మేస్తుంది … సినిమా లో కూడా అలాగే తీసారు Ingmar Bergman.
సినిమా హిస్టరీ లో 10 గ్రేటెస్ట్ సీన్లు ఎవైనా ఉంటే …. అందులో దీనికి స్థానం పదిలం .
అసలు ఈ సినిమా ని interpret చెయడానికి నాకు చాలా సమయం పట్టింది ….ఇంకా అర్ధం కానివి బోల్డు విశయాలు ఉన్నాయనుకోండి దీంట్లో… ముఖ్యంగా క్లైమాక్స్ …
Ingmar Bergman సినిమాలు అన్ని అలాగే ఉంటాయట , ఆయన సినిమాల్లో ఇదే నా మొదటిది !!
ఈ సినిమా ఇచ్చిన కిక్కు నుంచి తేరుకోవడానికి నాకు 4 రోజులు పట్టింది … కల లో కూడా వెంటాడింది ….
సినిమా లో కొన్ని సీన్లు చాలా intense గా ఉంటాయి … I wouldn’t recommend this flick for amatuer film buffs who haven’t got to watch many extential filims.
(personal experince తో చెబుతున్నా
) ముఖ్యంగా పిల్లల ల తో కలిసి అస్సలు చూడొద్ధు … కానీ మీరు ఆర్ట్ లవర్ అయ్యి , దేవుడు … జీవితం …. ఆత్మ …. అలోచనలు …
లాంటి వాటి గురించి శొధించాలనుకునే వారైతే మాత్రం మీకు ఇది Must Watch.
→ 3 Commentsవర్గాలు డిరెక్టర్లు · సినిమాలు · స్వీడిష్ సినిమా









