అక్టోబర్ 2005 నుండి టపాలు
SrI SrI rachanalu – I (జయభేరి)
అక్టోబర్ 9, 2005 · వ్యాఖ్యానించండి
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవ్రుష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!
నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!
ఎండాకాలం మండినప్పుడు
గబ్బిలవలె
క్రాగిపోలేదా!
వానాకాలం ముసిరిరాగా
నిలివు నిలువున
నీరు కాలేదా?
శీతాకాలం కోతపెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేకలేశానే!
నే నొక్కణ్ణే
నిల్చిపోతే-
చండ్ర గాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు
భూమి మీదా
భగ్నమౌతాయి!
నింగినుండీ తొంగిచూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి!
పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీధాలూ విశీర్ణిల్లీ,
మహాప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!
నే నొకణ్ణీ ధాత్రినిండా
నిండిపోయీ-
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహూర్తా లాగమిస్తాయి!
నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను!
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్చనలు పోతాను!
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!
—————మరిన్ని శ్రీ శ్రీ రచనల కోసం చూడండి www.baagundi.com/srisri.jsp
లేక http://www.engr.mun.ca/~adluri/telugu/modern/poetry/abhyudaya/sri_sri/rit/mahaprasthanam.html
మరిన్నిtelugu rachanala kosam www.te.wikipedia.org
వర్గాలు అవర్గీకృతం
శ్రీ శ్రీ రచనలు -II (మరొ ప్రపంచం)
అక్టోబర్ 9, 2005 · వ్యాఖ్యానించండి
mఅరొ ప్రపంచం,
mఅరొ ప్రపంచం,
mంఅరొ ప్రపంచం పిలిచింది!
Pఅదండి ముందుకు,
Pఅదండి త్రొసుకు,
Pఒదాం, పొదాం, పై పైకి!
కదం త్రొక్కుతు,
పదం పాడుతు,
హ్రుదంతరాలం ఘర్జిస్తు-
పదండి పొదాం,
వినబడలెద
మరొ ప్రపంచపు జలపాతం ?
దారిపొడుగునా ఘుండె ణెత్తురులు,
తర్పణ చెస్తు పదండి ముందుకు!
బాతలు నడిచి,
పెటలు గడిచి,
కొటలన్నిటిని దాతండి!
నది నదాలు,
అడవులు ఖొండలు,
ఎడరులా మనకడ్డంకి?
పదండి ముందుకు!
పదండి త్రొసుకు!
పొదాం, పొదాం పై పైకి!
ఎముకులు క్రుళ్ళిన,
వయసు మళ్ళిన,
సొమరులార చావండి!
ణెత్తురుమండె,
శక్తులు నిండె,
శైనుకులార! రరండి!”
హరొం హరొం హర!
హర! హర! హర! హర!
హరొం హర” అనికదలండి!
మరొ ప్రపంచం,
మహా ప్రపంచం,
ధరిత్రినిండ నిండిండి!
పదండి ముందుకు!
పదండి త్రొసుకు!
ప్రభంజనం వలె హొరెత్తింది!
భావవెగుమున ప్రసారించండి!
వర్షకభ్రముల ప్రళయఘొషవలె
ఫెళ ఫెళ ఫెళ ఫెళ విరుచుకు పదండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు!
కనపడలెద మరొ ప్రపంచపు
కనకన మండె త్రెతాగ్ని ?
ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నాయి,
ఎనభై లక్షల మెరువులు!
తిరిగి తిరిగి తిరిగి సముద్రాల,
జలప్రళయ నాట్యం చెస్తున్నాయి!
సల సల క్రాగె చముర కాదిది,
ఉష్న రక్త కాసారం!
సివసముద్రము,
నయగరవలె,
ఉరకండి! ఉరకండి ముందుకు!
పదండి ముందుకు!
పదండి త్రొసుకు!
మరొ ప్రపంచపు కంచు నగారా.
విరామమెరుగుక మ్రొగింది!
ట్రాచులవలెను,
రెచులవలెను,
ధనంజయునిల సాగండి.
కనబడలెద మరొప్రపంచపు
అగ్నికిరీటపు ధగధగలు,
ఎర్రబవుట నిగనిగలు,
హొమజ్వాలల భుగభుగలు ?
———–contributed by suhasini kandapati
copy right registerd
కాపిరైట్ చేయబడినది
వర్గాలు అవర్గీకృతం
SrI SrI rachanalu-III
అక్టోబర్ 9, 2005 · వ్యాఖ్యానించండి
దేశ చరిత్ర
దేశ చరిత్రలు
ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం.
నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం..
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహసిక్తం.
భీభత్సరస ప్రధానం,
పిశాచగణ సమవాకారం!
నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడం
బలవంతులు దుర్బల జాతిని
బానిసలను కావించారు..
నరహంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి
రణరంగం కానిచోటు భూ
స్థలమంతా వెదకిన దొరకదు..
గతమంతా తడిసె రక్తమున,
కాకుంటే కన్నీళులతో
చల్లారిన సంసారాలూ,
మరణించిన జన సందోహం,
అసహాయుల హాహాకారం
చరిత్రలో మూలుగుతున్నవి
వైషమ్యం, స్వార్ధపరత్వం,
కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్ధలు
మాయలతో, మారుపేర్లతో
చరిత్ర గతి నిరూపించినవి
జెంఘిజ్ ఖాన్, తామర్లేనూ
నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ,
సికందరో ఎవడైతేనేం?
ఒక్కొక్కడూ మహాహంతకుడు
వైకింగులు, శ్వేతహూణులూ,
సిధియన్లూ, పారశీకులూ,
పిండారులూ, ధగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన
అగ్నానపు టంధయుగంలో,
ఆకలిలో, ఆవేశంలో-
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడచి మనుష్యులు-
అంతా తమ ప్రయోజకత్వం,
తామే భువి కధినాధులమని,
స్ధాపించిన సామ్రాజ్యాలూ,
నిర్మించిన క్రుత్రిమ చట్టాల్
ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేక మేడలై!
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను
చిరకాలం జరిగిన మోసం,
బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ
ఇంకానా! ఇకపై చెల్లవు
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా? ఇకపై సాగదు
చీనాలో రిక్షావాలా,
చెక్ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ -
హాటెన్ టాట్, జూలూ, నీగ్రో,
ఖండాంతర నానా జాతులు
చారిత్రక యధార్ధతత్వం
చాటిస్తా రొక గొంతుకతో
ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో?
తారీఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్ చరిత్రకర్ధం
ఈ రాణీ ప్రేమపురాణం,
ఆ ముట్టడికైన ఖర్చులూ,
మతలబులూ, కైఫీయతులూ
ఇవి కావోయ్ చరిత్రసారం
ఇతిహాసపు చీకతికోణం
అట్టడుగున పడి కాన్పించని
కధలన్నీ కావాలిప్పుడు!
దాచేస్తే దాగని సత్యం
నైలునదీ నాగరికతలో
సామాన్యుని జీవన మెట్టిది?
తాజమహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,
అది మోసిన బోయీలెవ్వరు?
తక్షశిలా, పాటలీపుత్రం,
మధ్యధరా సముద్రతీరం,
హరప్పా, మొహేంజదారో,
క్రో – మాన్యాన్ గుహముఖాల్లో -
చారిత్రక విభాత సంధ్యల
మానవకధ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించిన దేపరమార్ధం?
ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?
ఏ వెల్గుల కీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?
వర్గాలు అవర్గీకృతం
నా లైఫ్
అక్టోబర్ 7, 2005 · వ్యాఖ్యానించండి
ఇవ్వాల నేను చాలా అప్సెట్ట్ అయ్యాను ,
నాకున్న మంచి ఫ్రెండ్ ఒక్కడి తొ ఇవ్వాలా
గొడవ పడాల్సివచ్చింది,
కాని ఒక్కటి అర్ధం అయ్యింది ఒక మనిషి మీద
నమ్మకం పోతే తిరిగి తెచ్చుకొవడం చాలా కష్టం
నేను నమ్మిన వాల్లు నా నమ్మకాన్ని
పోగొట్టారు, నన్ను నమ్మిన వాల్ల్లకి నామీద
వున్న నమ్మకాన్ని కూడా పొగొట్టారు
.
నా తప్పు లేకుండా నన్ను దొషిని చేసారు ,
నన్ను ఒక నమ్మకూదని మనిషిగా చిత్రికరించారు,
కాని నాకు ఇవ్వాల ఒక మంచి ఫ్రెండ్ దొరికింది
, అది నాకు రిలీఫ్.
వర్గాలు అవర్గీకృతం
బాధ
అక్టోబర్ 7, 2005 · వ్యాఖ్యానించండి
ఇవ్వాల నేను 2 విషయల గురించి బాధ పడ్డాను
ఒక్కటి విజయవాడ శ్రీలక్ష్మి ముర్డర్ కేసులొ, మరొకటి నా పర్సనల్ మాట్టర్
ముందు శ్రీలక్ష్మి ముర్డర్ కేసు గురించి
, ఆ మనొహర్ గాడికి జడ్జి వురి ని నుంచి తప్పించాడు కాని అధె నేనైతే వురి కాదు నడి రోడ్డు మీద
ఇరాకి పద్ధతి లొ వురి తీయ్యమని చెప్పేవాడిని.
అట్లాంటి వాల్లని అలా చేస్తే తప్ప మిగతా వల్లకి బుద్ధిరాదు.
ఇలాంటి తీర్పు వల్ల ఇలాంటి వాల్లకి భయం లేకుండా పోతుంది.
వర్గాలు అవర్గీకృతం
మార్కెటింగ్ యుగం
అక్టోబర్ 5, 2005 · వ్యాఖ్యానించండి
ఇటీవల ఒకాయన మనం పూర్తిగా మార్కెటింగ్ యుగమ్లొ వున్నామనడానికి వుదాహరన
చెప్పాడు .అయుదు లక్షలు కట్నం అడిగిన కుర్రాడి తరఫు వాల్లు
ఏడాది గ్యారంటీ ఇచ్చారట .ఏ కారణంగానేఇన కుర్ర్రా డి పనితీరు
నచ్చకపొతే, కొత్త శల్తిని రీప్లేస్ చేస్తామని పూచి యిచ్చరట.
వర్గాలు అవర్గీకృతం
