సంభవామి యుగే యుగే

డిసెంబరు 2005 నుండి టపాలు

ఒక కవిత

డిసెంబరు 30, 2005 · అభిప్రాయములు

తెలుగు, హింది, తమిలం, కన్నడ
బాష ఏదేతెనేం ఈంగ్లిష్ ముందు మూగబొవడానికి

తొకూడు బిల్ల, కొతి కొమ్మచి,కర్ర బిల్ల
ఆట ఏదేతెనేం క్రికెట్ ముందు ఒడిపోవడనికి

కొబ్బరి నీరు, నిమ్మ రసం ,సరి జావ
పానీయం ఏదేతెనేం కూల్ డ్రింక్ లొ మునిగిపొవడనికి

గోంగూర, తొటకూర, ఆవకాయ
తిండి ఏదైతేనేం పిజ్జా ముందు పాచిపట్టడానికి

నువ్వు నేను వాడు వీడు
ఎవడైతేనేం మనకేం తెలియనట్లు
మిన్నుకుండడానికి

వర్గాలు అవర్గీకృతం