సంభవామి యుగే యుగే

నవంబరు 2006 నుండి టపాలు

అమెరికా !!!

నవంబరు 28, 2006 · అభిప్రాయములు

ఈ రోజు పొద్దునే మా కజిన్ వచ్చాడు ….
వచ్చీ వస్తునే అమెరికా మీద తిట్ల పురాణం మొదెలెట్టాడు !!

రీగన్ నుంచి బుష్ దాక !!

రాక్ఫెల్లర్ దగ్గరనుంచి బిల్ల్ గేట్స్ దాక !!

ఎవ్వరినీ వదల్లేదు !!

సునామి నుంచి డబ్బింగ్ సినిమాల బాన్ వరకు !!

వరల్డ్ వార్ నుంచి ఇరాక్ వార్ వరకు ప్రతీ దానికి వళ్లే కారణం అన్నాడు !!

వల్లసలా మనుషులే కదన్నడు !! వాల్లకి టాలెంట్ విలువే తెలీదన్నాడు !!!

ఎంటబ్బా !! ఎప్పుడూ అమెరికా అంటే ఎగిరి గంతేసే ఈయన ఇలా మాట్లాడుతున్నాడేమిటా అనుకున్నాను !!

చివరకు అస్సలు కారణం చెప్పాడు !!

మళ్ళీ వీసా రిజక్ట్ అయ్యిందని !!!

వీడి దుంప తెంచా ఇందుకా గంట నుంచి బ్రైన్ వాష్ చేసెది అనుకున్న !!

ఒక గంట చావ గొట్టినా వెళ్తూ వెళ్తూ ఒక మంచి జోక్ చెప్పెళ్లాడు !!

U N వారు ప్రపంచ వ్యాప్తంగ ఒక సర్వే చేసారట , కాని అది పెద్ద ఫ్లాప్ అయ్యి కూర్చుందట కారణం , ప్రశ్న లొనే ఉంది , ఇంతకీ ప్రశ్న ఏమిటంటే …
మిగతా ప్రపంచం లోని ఆహార లోటు , సమస్య కి పరిష్కారం గురించి మీ అభిప్రాయన్ని నిజాయితిగా చెప్పండి ” అని !!

కాని ఈ ప్రశ్న అడిగిన దేశాల్లో వల్లకి ప్రశ్న అర్ధమే కాలేదట కారణం !!

ఆఫ్రికా లో ఆహారం అంటే తెలీదు !!

యురప్ లో లోటు అంటే తెలీదు !!

చైనా లో అభిప్రాయం అటే తెలీదు !!

మధ్య ఆసియా లో పరిష్కారం అంటే తెలీదు !!

ఇండియా లో నిజాయతీ అంటే తెలీదు !!

ఇక అమెరికా వల్లకి మిగతా ప్రపంచం అంటే తెలీదు !!

కాని నాకు ఇప్పట్లో అమెరిక మీద కోపం అస్సలు రాదు !!

కారణమా !! నేనూ త్వరలోనే వీసా కి వెల్లలి మరి !! ;) i{content: normal !important}

వర్గాలు జోకులు-హైకులు

ఏటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్స్ మైండ్ (2004)

నవంబరు 26, 2006 · వ్యాఖ్యానించండి

ఏటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్స్ మైండ్ (2004)

ఇప్పట్టి వరకు నేను చూసిన అన్నీ లవ్ స్టొరిల లోనూ ఇది ద బెస్ట్ …..
ద క్యూట్ …ద మోస్ట్ బ్రిలియంట్ …. అండ్ ద స్వీటెస్ట్ స్టోరీ …..

నాన్ లీనీయర్ సినిమల లో కూడా దీనికి ప్రత్యేక స్థానం ….

ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది , కవ్విస్తుంది …. ఏడిపిస్తుంది ….
…..ఇప్పటి వరకు ఒక పది సార్లు చొసి ఉంటాను ….
…….. ఎన్ని సార్లు చూసినా ఫ్రెష్ గా లవ్లీ గా … ఉంటుంది ….

నిజమైన ప్రేమికులు ఎప్పటికీ విడిపోలేరు … మీ కోసం పుట్టిన వాల్ల
దగ్గరనుంచి మీరు ఏంత దూరం పారిపొగలరు ….
వాల్లని మర్చి పొయ్యేంత దూరం వెల్లగలరా ??
వెల్ల లేరు …… వాల్లని మర్చి పోగలరా ….. ?? ….
లేదు … ఎప్పటికీ లేదు …ఎల మరుస్తారు …. వాళ్లు ……మీ జ్ఞాపకం కాదు …. మీ జీవితం … !!
మీరు ఎంత గా మీ ప్రేమ ను ద్వేషిస్తారో .. అంతకన్న ఎక్కువగా వారితో ప్రేమ లో పడతారు ….

కాదంటారా ?? ఈ సినిమా చూసి ఆ మాట మళ్ళీ అనండి చూద్దాం !!

జిం కారీ నటన ఈ సినిమా లొ బ్రిలియంట్ …. అతన్ని అందరూ ఫన్నీ మాన్ గా కొట్టి పారేస్తారు …
కాని ఈ సినిమా చూస్తే ఆ మాట అనే ధైర్యం కూడా చెయ్య లేరు ,
చెప్పాను గా అతను హాలివుడ్ లో మోస్ట్ అండర్ రేటెడ్ ఆక్టర్ !!

కాఫ్ మన్ కధ లొనే ఉంది అందమంతా !!!
కంఫెస్సన్సన్స్ ఆఫ్ ఏ డెంజరస్ మైండ్ తరువాత అతని
కలం నుంచి జాలు వారిని ప్రేమ కధ ఇది !!!

ఈ సినిమా కి ఇన్స్పిరేషన్ అలెక్జాండర్ పోప్ రాసిన ఈ కవిత

How happy is the blameless vestal’s lot! The world forgetting, by the world forgot. Eternal sunshine of the spotless mind! Each pray’r accepted, and each wish resign’d; Labour and rest, that equal periods keep; “Obedient slumbers that can wake and weep;” Desires compos’d, affections ever ev’n, Tears that delight, and sighs that waft to Heav’n. Grace shines around her with serenest beams, And whisp’ring angels prompt her golden dreams. For her th’ unfading rose of Eden blooms, And wings of seraphs shed divine perfumes, For her the Spouse prepares the bridal ring, For her white virgins hymeneals sing, To sounds of heav’nly harps she dies away, And melts in visions of eternal day.

సినిమా లో జిం కారీ , కేట్ వింస్లెట్ తో చెప్పే ఒక డైలాగ్
Joel – I could die right now, clem. I’m just… happy. I’ve never felt that before. I’m just exactly… where I wanna be.

మీ పార్ట్నర్ తో కలిసి తప్పక చూడవలసిన సినిమా …

దీని గురించి ఎంత రాసిన తక్కువే …. అవును మరి …. ప్రేమ గురించి ఎంతని రాయగలం ??

వర్గాలు సినిమాలు

షార్ట్ ఫిల్మ్

నవంబరు 26, 2006 · వ్యాఖ్యానించండి


షార్ట్ ఫిల్మ్ స్ అంటే నాకు ముందు నుంచీ ఆసక్తి తక్కువే , కాని వాటిల్లో కూడా కొన్ని మాస్టర్ పీస్ లాంటి సినిమాలు ఉన్నాయి ఈ మధ్య ఒక ఫ్రెండ్ ” Krzysztof Kieślowski” తీసిన “ద డెకలొజ్ (The Decalogue.)” చూడమని చెప్పాడు

డెకలొజ్ ‘ The Ten Commandments’ మీద బేస్డ్ సినిమా !!!

ఒక్కో కామండ్మెంట్ కీ సంభందించీ ఒక్కో సినిమా అన్న మాట
అలా పది సినిమాలు ఉంటాయి…

పది భాగాల్లో దేని ఇంటెన్సిటీ దానిదే … దేని ఇండివిజాలిటీ దానిదే …

ఆసలు డైరెక్టర్ ఆ సినిమలు తీసిన తీరు నిజంగ అత్బుతం

పది ఎపిసోడ్లలోనూ ఎక్కడా టెంపో మిస్స్ కాదు …..
ఈయన ఫ్రెంచ్ జెండా లొని మూడు రంగుల గురించి కూడ ఒక సినిమా తీసాడట ..
అది కూడా వీలయింత త్వరలో చూడాలి అని డిసైడ్ అయిపొయా …..

ఇక షార్ట్ ఫిల్మ్ స్ లొ అన్నిటికంటే రెమార్కబ్ల్ సినిమా ” Un chien andalou (1929)

1920 ల లో ఇలాంటి సినిమా తీసుంటారని ఎవరూ ఊహించ లేరు …..అసలు సర్రియల్ సినిమా అనే కాన్సెప్ట్ ని పరిచయం చేసిందే ఈ సినిమా …. పదిహేను నిమిషాలలో మనిషి ఎంత భయపెట్టచ్చో ఈ సినిమా చూస్తే తెలిసి పోతుంది !!!

ఇందులో మొదటి సీన్ నేను జీవితం లో ఎప్పటికీ మర్చి పోలేను ….. అంత భయంకరంగా ఉంటుంది !!!

హిచ్ కాక్ డైరెక్టర్ గా పీక్ పొజిషన్ లో ఉన్న టైం లో నే లూయిస్ బునెల్ ఈ సినిమా తీసాడు …
కాబట్టీ ఇద్దరూ ఒకరి ద్వార ఒకరు ఇన్స్పైర్ అయ్యే ఉంటారు !!!

లేక పొతే ఇద్దరూ .. ఇలా ఎలా భయపెడతారు !!

andalou నుంచి ఒక సీన్



వర్గాలు సినిమాలు

కసబ్లాంకా (1942)

నవంబరు 25, 2006 · 1 వ్యాఖ్య


కసబ్లాంకా (1942)

ఈ సినిమా పేరు మొదట వినగానే చాలా గర్లీ(girlie) స్టఫ్
ఎక్స్ పె క్ట్ చేసా కాని , చూస్తే చాల లవ్లీ స్టఫ్ఫ్ అయ్యి కూర్చుంది .
చాలా మంచి లవ్ స్టోరీ ..
మన రొటీన్ తెలుగు కుల్లు కామెడీ లవ్ స్టొరీ కాదండొయి .

వరల్డ్ వార్ 2 నేపధ్యం లో సాగే మంచి ట్రయాంగిల్ లవ్ స్టొరీ .
నాచురల్లి ఒక హీరో ప్రేమను త్యాగం చేస్తాడు అనుకొండి
(నాకు ఒక్క విశయం అర్ధం కాదు , గొప్ప గొప్ప ప్రేమ కధలు …..
త్యాగం తొనే ఎందుకు ముగుస్తాయో…………… ఎనీ ఇడియా ??)

ఇది రోమాంటిక్ సినిమాలకి గాడ్ ఫాథర్ లాంటిది !!!
ఈ సినిమా లో హీరోయిన్ “ఇంగ్రిడ్ బెర్జిమెన్ ” ఉంటుందండీ ….. అబబ్బబ్బా ……

ఆ కళ్ళు చాలు అసలా …

ఈ సినిమాకు ముందు హీరో హంప్రీ బోగార్ట్ అన్నీ మాఫియా డాన్ రోల్స్ చెసాడట …
కాని ఇందులో రోమాంటిక్ గా కూడ ఇరగదీసాడు !!

సినిమా చూసి నా లాగ ఇతనికి ఫాన్ అయిపొతే “ద మాల్టీస్ ఫల్కన్” ,”ప్లే ఇట్ అగయిన్ సాం ” కూడా చూసి తీరాల్సిందే !!

వర్గాలు సినిమాలు

డెడ్ పోయెట్స్ సోసైటీ (1989)

నవంబరు 25, 2006 · 1 వ్యాఖ్య


డెడ్ పోయెట్స్ సోసైటీ (1989)

ఈ రోజు చానెల్స్ మారుస్తూ ఉంటే తెల్సిసింది సాయాంత్రం జీ స్టుడియో లొ
డెడ్ పోఎట్స్ సోసైటీ సినెమా ఉందని !!! అహా అనుకున్న !!

చాలా రోజుల అయ్యింది ఆ సినిమా చూసి …. జాన్ కీట్స్ కవిత్వం లొ
ఉన్నంత సెరినిటీ ఉంటుంది సినిమా లో !! ఎందుకుండదు ..తీసింది అయన మీదే గా !!

రాబిన్ విలియం జాన్ కేట్ గా ఆక్ట్ చేసాడు .. రాబిన్ విలియం అంటే వెంటనే
గుర్తొచ్చే సినిమా ఇన్సొమ్నియా , భలే గా చేసాడు ఆ సినిమాలో అల్ పచినో తో పోటా పోటీగా ….
నా అభిప్రాయం ప్రకారం రాబిన్ విలియం హాలివుడ్ లో సెకండ్ మోస్ట్
అండర్ రేటెడ్ ఆక్టర్ , ఫర్స్ట్ ప్లేస్ లొ జిం కారీ కొట్టేసాడు , జిం కారీ గురించి అసలు చాల చెప్పాలి
…. అతన్ని ఫన్నీ మాన్ గా కొట్టి పారేసే వాల్లు థి ఎటర్నల్ సన్ షైన్ ఆఫ్ స్పాట్ లెస్స్ మైండ్ లొ
క్యారి పెర్ఫార్మెన్స్ చూస్తే ముక్కున వెలేసుకుంటారు . కారి గురించి ఆ సినిమా గురించి తారువాత మాట్లాడుకుందం … ఇప్పుడు రాబిన్ విలియం వంతు .

జాన్ కీట్స్ అనే ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ జులాయి గా ఉండే నలుగురు కుర్రాల్లకి
కవిత్వం రుచి చూపించి మనుషులుగా మార్చడనేది కధ !!
ఎథన్ హాక్ , జోష్ చార్లెస్ లాంటి వల్ల ఇండివిజుల పెర్ఫర్మెన్సెస్ ని స్టొరి డామినేట్ చేస్తుంది అంటే ఇది ఆక్టర్స్ సినిమా కాదు డైరెక్టర్ సినిమా …

సినిమా లో స్టూడెంట్స్ ప్రొఫెసర్ ని “ఓ కప్టెన్ ..మై కాప్టెన్ ” అని పిలుస్తూ ఉంటారు ..
ఇది మన మాయ బజార్లో “హై హై నాయకా …హొయి హొయి నాయకా ” ను గుర్తు తెస్తుంది ….
కా క పోతే ఈ సినిమా కూడా విషాదంగనే ముగుస్తుంది …

కాని మంచి కవిత్వం చదివిన అనుభూతిని మిగిల్చి ముగుస్తుంది !!!

వర్గాలు సినిమా

రెక్విం ఫర్ ఏ డ్రీం (2000)

నవంబరు 24, 2006 · అభిప్రాయములు


రెక్విం ఫర్ ఏ డ్రీం (2000)

చాల రోజుల నుంచి చూడలనుకుంటున్న సి నిమా ఇది మొత్తానికి చూసా

ఆ మధ్య్ ఒక విలేఖరి దర్శకుడు తేజ ని సినిమాలు యువత మీద ఎ మేరకు ప్రభావం చూపుతాయి
అని అడిగితే , 3 గంటల సినిమాకు ఎవరు ప్రభావితులు అవుతారు అంటూ కొట్టి పారేసాడు .
కాని ఆయన ఈ సినిమా చూస్తే చెంపలేసుకుని …10 గుంజీల్లు తీసి మరి తన మాట వెనక్కి తీసుకుంటాడు
అంత ప్రభావం ఉందు ఈ సినిమాలో

డ్రగ్స్ వాడడం వల్ల నలుగురి జీవితాలు ఎలా నాశనం అయ్యాయి అనేది ఈ సినిమా స్టోరి .

అమెరికన్ యుత్ అండ్ డ్రగ్స్ కధ గా చేసుకొని చాల సినిమాలు వచ్హయి ,
అందులొ చెప్పుకో దగ్గవి బాస్కెట్ బాల్ డైరీస్ , రెక్విం ఫర్ ఏ డ్రీం .
రెండూ విషాదంగా ముగిసే సినిమాలే , అఫ్ కోర్స్ డ్రగ్స్ వాడితే విషాదం
కాక శుభం కార్డ్ పడుతుందా నా పిచ్చి గాని . … టైటిల్ పోఎటిక్ కా ఉంతుంది
కాని సినెమా ఎకాడా సెరీన్ గా జోవియల్ గా ఉండదు …
సినిమా చూసిన తరువాత పాత్తికేజిల బాధ చేరి పొతుంది గుండెలో ..

కాని మిస్స్ కాకూడని సినిమా , మిస్స్ చేసే ధైర్యం కూడా చెయ్యకండి

వర్గాలు సినిమాలు