సంభవామి యుగే యుగే

ఫిబ్రవరి 2007 నుండి టపాలు

బ్లడ్ డైమెండ్ (2006)

ఫిబ్రవరి 25, 2007 · అభిప్రాయములు


బ్లడ్ డైమెండ్ (2006)

నిన్నే చూసా ఈ సినిమా మన గుడ్ ఓల్డ్ స్టెర్లింగ్ లో !! చాలా రోజుల నుంచి వెయిటింగ్ దీని గురించి !!

లీయోనార్డో అంటే అంత ఇష్టం లేక పోయినా సియార్రా లియోన్ లోని అంతర్యుద్ధం , వజ్రాల దొంగ రవాణా , డీ బీర్స్ లాంటి బడా వజ్రాల కంపెనీలు దీని గురించి అభ్యంతరం చెప్పడం తో కొంచం ఆసక్తి ఏర్పడింది .. పర్లేదు వీక్షణ లో నీరీక్షణకు తగిన ఫలితం ఉంది .

ఇక కధ విశయానికి వస్తే సియార్రా లియోన్ లో జరిగే అంతర్యుద్ధం బాక్ డ్రాప్ లో వజ్రాల వేట గురించి సినిమా కధ !! సోల్మన్ వాండీ ఒక బీద మత్స్య కారుడు , తన కొడుకుని డాక్టర్ చెయ్యలని అతని కోరిక , కానీ దేశం లోని రెవల్యూశినరీ గ్రూప్ RUF యొక్క సభ్యులు వాల్ల ఊరి మీద దాడి చేయ్యడం తో సోల్మన్ తన కుటుంబం తో విడి పోతాడు , అతన్ని వజ్రాల వేట లో దింపుతారు .. అక్కడ సోల్మన్ కి ఒక పేద్ద వజ్రం దొరుకుతుంది , అది అతను అక్కడే దాచేస్తాడు సమయం లో RUF కాంప్ పై సైనికులు దాడి చేసి అతన్ని జైల్ లో వేస్తారు , అక్కడే ఇతనికి వజ్రాల కోసం అక్రమ ఆయుధాలు అమ్మే డానీ ఆర్చర్ (లీయోనార్డో డీ కార్పియో )పరిచయం అవుతాడు , తన కుటుంబాన్ని వెతికి పెడితే వజ్రం ఇస్తానని చెప్పడం తో ఇద్దరూ ఒక ఒప్పందానికొచ్చి బయలు దేరుతారు , వీరికి మార్గం లో పరిచయం అయిన జర్నలిస్ట్ మాడీ బొవెన్ (జన్నిఫర్ కనెల్లీ )తో కలిసి సాల్మన్ తన కుటుంబాన్ని ఎలా చేరుకున్నాడు .. ఆర్చర్ వజ్రాన్ని సంపాదించాడాలేదా , వజ్రాల దొంగ రవాణా గూర్చి మాడీ తో కలిసి ప్రపంచానికి ఎలా చెప్పాడనేది అనేది కధ !!

కధా పరంగా పెద్దగా లొసుగులేవీ లేవు , అంతర్యుద్ధం నేపధ్యం లో ఉండండం తో మానవీవీయ కోణాన్ని హ్రుద్యంగా స్ప్రుషించారు .. ఇక పాత్రల విశయానికి వస్తే ఆర్చర్ పాత్ర లో మొదట కరుకుదనంతో ఉన్నా సినిమా సాగుతున్న కొద్ది అతని లోని మనావత్వం మెళ్ళ మెళ్ళగా బయట పడి చివర్న అతని త్యాగన్ని బయటపెడుతుంది , లియోనార్డో పాత్ర కు తగ్గ న్యాయం చేసాడు , 2006 లో బ్లడ్ డైమెండ్ , ది డిపార్టెడ్ ద్వారా అతని రెండు మంచి పెర్ఫార్మెంసెస్ చూడ గలిగాం , ఇందులో నటనకు గాను ఆస్కార్ కి కూడా నామినేట్ అయ్యాడు . ఇక సాల్మన్ పాత్ర లో అసలు వేరియేషన్స్ అంటూ ఏవీ లేవు మొదటి నుంచీ చివరి వరకూ తన కూతుంబాన్ని కలుసుకోవాలనే అతని తపన ఆ తపనే సినిమా ని కూడా నడిపిస్తుంది , ఇక జర్నలిస్ట్ మాడీ బోవెన్ గా నటించిన జెన్నిఫర్ కానెల్లీ ది పెద్ద పాత్రేమీ కాదు ఉన్నంత వరకూ బాగా చేసింది.

మొత్తనికి మంచి వీకెండ్ సినిమా .. మీ గర్ల్ ఫ్రెండ్సో .. భార్యలో .. డైమెండ్ రింగ్ చేయించమని పోరు పెడుతుంటే ఈ సినిమా కి తీసుకెల్లండి వాళ్ళ పోరు కొంతైనా తగ్గుతుంది ;-)

వర్గాలు సినిమాలు

తెలుసుకొనవె యువతీ !!

ఫిబ్రవరి 21, 2007 · అభిప్రాయములు

అమెరికా మెగా బిలియనీర్ రాక్ ఫెల్లర్ ఓ సారి సమయానికి జేబు లో చిల్లర లేక తన శెకెట్రీ (రావు గోపాల్ రావ్ స్టైల్ ) దగ్గర ఒక సెంట్ అప్పడిగి తీసుకున్నారు !!

మర్చి పోవద్దు …….రేపు గుర్తు చేసి తీసుకో ……..
మర్చి పోవద్దు సుమీ … అని మరీ మరీ చెబుతున్నారు !!

కానీ శెకట్రీ ఫర్వాలేదు సార్ దానిదేముంది అంటూ మొదలెట్టింది !!

ఏం లేదంటావేం ?? అని గద్దించారు రాక్ ఫెల్లర్ .. శెకట్రీ మౌత్ షట్ చేసింది !!

“నువ్విచ్చిన డబ్బు ఒక డాలర్ మీద ఏడాదికి వచ్చే వడ్డీ తో సమానం … ఏం లేదంటావే ?? ” .. అని శంటింగ్ ఇచ్చారు రాక్ గారు !!

అందుకే మరి రాక్ ఫెల్లర్ రాక్ ఫెల్లర్ గా … సెకట్రీ … సెకెట్రీ గా మిగిలి పోయారు !!

నేను మరీ రాక్ ఫెల్లర్ గా కాక పోయినా …..
శెకట్రీ గా మాత్రం సెట్టిల్ అవకూడదనుకుంటు న్నాను !!

వర్గాలు జోకులు-హైకులు

అద్రుష్టం

ఫిబ్రవరి 20, 2007 · అభిప్రాయములు

బాస్ గారి దగ్గర 300 రెస్యూములు ఉన్నాయి , ఉద్యోగాలు ఉన్నవి నాలుగే …

బాస్ గారు సెకెట్రీ (రావు గోపాల్ రావు స్టైల్ ) అని కేకెట్టారు …. సెకెట్రీ వచ్చింది !!

నీ ఇష్టం వచ్చిన 50 రెస్యూములు తీసి వాల్లని ఇంటర్వూ కీ పిలిచేయ్యి , మిగతావి చెత్త బుట్టలో వేసేయ్ ….. బాస్ గారి ఆర్డర్ ..

సెకెట్రీ : కానీ … సార్ , వాటిలో మంచి రెస్యూములు ఉంటే ????

బాస్ : గుడ్ కొచ్చెన్ ….. పాయింట్ లాగవ్ ….. కానీ నాక్కావలసింది ,
————— అద్రుష్టం ఉన్న వాళ్ళు .

వర్గాలు జోకులు-హైకులు

వాటర్ (2005)

ఫిబ్రవరి 18, 2007 · అభిప్రాయములు


వాటర్ (2005)

దీపా మెహతా గారి పాత సినిమాలు నేను పెద్దగా చూసింది లేదు …ఒక ఏర్త్ (1998) తప్ప .. అది కూడా ఆమిర్ ఖాన్ కోసమే ….

ఇక వాటర్ విశయానికి వస్తే .. నేను ఇప్పటి వరకు ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇంత డార్క్ మూవీ చూసింది లేదు !! దీపా మెహతా గారి ధైర్యానికి జోహార్లు . మనం చేసిన తప్పుల గురించి చెప్పుకోవడం …వాటిని కంఫెస్స్ చెసుకోవడం నిజంగా గొప్ప విశయం … కాని ఇది కొందరికి అర్ధం కాదు … అందుకే .. ఆవిడ్ని (దీపా) ఇక్కడ వాటర్ షూటింగ్ చెయ్యనివ్వకుండా ఆపారు …పాపం శ్రీ లంక వెళ్ళి పూర్తి చెయ్యల్సి వచ్చింది ఈ సినిమాని !!

ఇక భారత ప్రభుత్వానికి కూడా ధైర్యం లేక వాటర్ ని నిశేధించడమే కాకుండా దీనికి బదులు రెవల్యూషనరీ సినిమా అంటూ రంగ్ దే బసంతి ని ఆస్కార్ కి పంపించి బొక్క బోర్లా పడింది !!

ఇక సినిమా కధ విశయానికి వస్తే 1930 లలో వారనాసి లోని వితంతువల జీవితాల నేపధ్యం లో సాగుతుంది కధ !!
చిన్న వయసులోనే ముసలి నక్క ల తో పెళ్ళయ్యి , వాళ్ళు కాస్తా గుట్టుక్కుమనేసరికి విధవల ఆశ్రమానికి చేరుతుంటారు అమ్మాయిలు .

అలా చేరిందే 7 సం. ల చూఇయా . ఆ పాప కి గుండు గీసి జీవితాంతం ఇక్కడే పడి ఉండమని శాశిస్తారు . అదే ఆశ్రమం లో ఉన్న శకుంతల పూర్తి రెవల్యూషినరీ అన్న మాట . ఇక మరో అమ్మయి కల్యాణి (లీసా రే ) . ఆశ్రమ పెద్దగా మధుమతి (మనోరమ ) ఉంటుంది !! మధుమతి ఆశ్రమం నడిపే ఖర్చు సాకు తో తన గుంట నక్క గులాబి (రఘువీర్ యాదవ్ ) తో కలిసి కల్యాణి ని వేశ్యా వ్రుత్తి లో కి దిపుతుంది.

ఇలా ఉండగా కల్యాణి కి ఒక రోజు గాంధేయవాది అయిన నారాయన్ (జాన్ అబ్రహం ) తో పరిచయం అవుతాడు . మొదటి చూపులోనే కల్యాణి ని ప్రేమించిన నారాయన్ అమెను రహస్యంగా కలుస్తూ ఉంటాడు . ఒక రోజు నిన్ను పెళ్ళీ చేసుకుంటాను ..ఇద్దరం కలకత్త వెళ్ళీ పోదాం రెడీ గా ఉండ మంటాడు .. ఈ విశయం తెలిసిన మధుమతి కోపం తో కల్యాణి ని చావ చితక బాది , గుండు కొట్టింస్తుంది . అయినపట్టికీ నారాయన్ కల్యాణి ని తీసుకొని తన ఇంటికి బయలు దేరుతాడు కాని అతని తండ్రి తనను ఇంతకు ముందే వాడుకున్నాడని తెలిసి ఆత్మ హత్య చేసుకుంటుంది .

అప్పుడిక మధుమతి కల్యాణి స్థానం లో చిన్నారి చూయియా ని వేశ్య గా మారుస్తుంది . కాని శకుంతల (సీమా బిశ్వాస్ ) ఆమెను చెర నుంచి తప్పించి నారాయన్ కి అప్పగించి పెంచి పెద్దచెయ్యమన డం తొ కధ ముగుస్తుంది .

సినిమా లో కాస్టింగ్ చాలా బావుంది !! మధుమతి గా మనోరమ సూర్య కాంతం ని మరిపిస్తుంది . ఇక సీమా బిశ్వాస్ ఎప్పటి లాగే అదర గొట్టేసింది . చూయియా పాత్ర చేసిన అమ్మయి కూడా చాలా బాగ చేసింది . ఇక లీసా రే .. జాన్ చాలా ఆప్ట్ గా ఉన్నారు .
సినిమా చూసిన తరువాత ..మన సాంప్రదాయాలు ఇంత భయంకరంగా ఉండేవా అనిపిస్తుంది .. . మొత్తమ్మీద మంచి సినిమా .. ఆస్కార్ బరి లో మరో సినిమా వోల్వర్ చూస్తే తప్ప ఈ సినిమా గెలుపు (ఆస్కార్ లో)గురించి చెప్పలేం.

వర్గాలు సినిమాలు

చికెన్ హర్రర్

ఫిబ్రవరి 14, 2007 · 1 వ్యాఖ్య


అందుకే శాఖాహారులుగా మారమనేది !!

వర్గాలు జోకులు-హైకులు

హిట్లర్ – పీస్

ఫిబ్రవరి 12, 2007 · అభిప్రాయములు

ఇది రెండవ ప్రపంచ యుద్దం మొదలైన తొలి రోజుల్లో జరిగిన సంఘటన అట !!

జర్మనీ సైన్యం తెల్లారితే యుద్ధం మొదలెట్టడానికి రెడీ గా ఉంది !!

హిట్లర్ సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది !!

వేలాది మంది సైనికులు ఆయన వీర పలుకుల వినడం కోసం చెవులు రిక్కించి మరీ రెడీ గా ఉన్నారు !!

ఆయన వడి వడి గా వేదిక మీదికి వచ్చారు !!

ప్రసంగం మొదలెట్టారు …..

సైనికులారా నాకు పీస్ కావాలి అన్నారు (రెండు నిమిషాలు మౌనం )

సగం మందికి గుండాగిపొయ్యింది ఒక నిమిషం పాటు !!

హిట్లర్ ఏంటీ …. పీస్ (శాంతి )కావాలనడం ఏంటి…. , తెల్లారితే యుద్ధం పెట్టుకొని

ఈయనే0టి శాంతి వచనాలు పలుకుతున్నాడు అని బిత్తర పోయారు !!

హిట్లర్ మల్లీ మొదలెట్టారు !!

సైనికులారా నాకు పీస్ కావలి !!

పోలాండ్ లో ఒక పీస్ (భాగం )!!

ఫ్రాన్స్ లో ఒక పీస్ !!

ఇంగ్లాండ్ లో ఒక పీస్ !!

అమెరికా లో ఒక పీస్ కావాలి !!

అదే మీ జన్మభూమి జర్మనీ కి మీరు ఇచ్చే బహుమతి !!

వెల్లండి .. వెళ్ళి గెలుచుకు రండి … అన్నారు !!

అప్పటిగాని అందరి కీ అర్ధం కాలేదు … ఆయనక్కావలసింది పీస్ (భూ భాగం ) కానీ పీస్ (శాంతి ) కాదని !!

హిట్లరా ……. మజాకా …..

వర్గాలు జోకులు-హైకులు

హిట్లర్ -క్రికెట్

ఫిబ్రవరి 12, 2007 · అభిప్రాయములు

జర్మనీ లొ చాలా మందికి క్రికెట్ అనే ఆట వు0దని తెలీదు

దానికో చిన్న కధ వుంది

ఒక సారి హిట్లర్ ఇంగ్లాండ్ పర్యటనలొ వుండగా

ఇంగ్లాండ్ కి ఆస్ట్రేలియా కి మధ్య టెస్ట్ మాచ్

మొదలయ్యింది మన హిట్లర్ గారు ఈ ఆటేదో బాగుంది

కదా చూసి వెల్దామని అగారు….

మొదటి రోజు అట అయిపొగానే అయన వుండబట్ట లేక

ఒకవ్యక్తిని అడిగరు రిజల్ట్ ఏమిటని, ఆ పెద్దమనిషి తాపీగా,

సార్ ఇంకా 4 రోజుల ఆట వుంది అన్నాడు.

రొండో రొజు అట పూర్తయ్యింది , హిట్లర్ గారు మల్లి ఆ పెద్ద మనిషిని

పిలిచి అడిగారు అయన సార్ ఇవ్వాల ఆస్త్రేలియా వాల్లు బలే

బాదారు, ఇంక 3 రొజులుల్లొ రిజల్ట్ తెలిసిపొతుంది అన్నడు

మూడొ రొజు అట పూర్తయ్యింది, హిట్లర్ గారిది అదే ప్రశ్న

, ఈసారి అపెద్దాయన ఇంగ్లాండ్ వాల్లు చితకబదరు అని చెప్పాడు.

నాలుగో రొజు అట పూర్తయ్యింది , ఈసారి ఆ మనిషి మన

హిట్లర్ గారికి సార్ అట చాల రంజుగావుంది …..

ఎవరు గెలుస్తారో చెప్పలేను అన్నాడు.

హిట్లర్ కి టెన్షన్ పెరిగిపొయ్యింది, ఐదొ రొజు అట పూర్తయ్యింది

రెజల్ట్ హిట్లర్ చెవిన పడింది..

మ్యచ్ డ్రా అయ్యిందని,

అప్పుడు మన హిట్లర్ కి చిర్రెతుకొచ్చి తన దేశానికి వెల్లి

5 రొజులు అడి రెజాల్ట్ లెకుండా పొయ్యే క్రికెట్ ని మన దేశం లొ ఎవ్వరూ ఆడకూడదు ,
ఈ ఆట ముగిసే లో పల నేను 3 దేశాలు ఆక్రమించేసే వాడిని !!

టైం వేస్ట్ చేసే .. ఈ ఆటను ఆడ కూడదని ఆర్డర్ వేసాడు

అప్పటి నుంచి జెర్మనీ లొ క్రికెట్ అంటే అందరికి ఎలర్జీ !!

దేశం లో క్రికెట్ జ్వరం మొదలయ్యింది గా … ఇది గుర్తొచ్చింది !!

బై ద వే ….

నేనూ హిట్లర్ గారి పాలసీ నే ఫాలో అవుతున్నా !!

వర్గాలు జోకులు-హైకులు

మంచి రొమాంటిక్ సినిమాలు

ఫిబ్రవరి 11, 2007 · అభిప్రాయములు

Feb 14 వచ్చేసింది కదా అందుకే నేమో

రొమాంటిక్ సినిమాల మీదికి మనసు పొయ్యింది !!
అందుకే ఇప్పట్టి వరకు నేను చూసి … నాకు పిచ్చ పిచ్చ గ నచ్చేసిన రొమాంటిక్ సినిమాల లిస్ట్ ఇస్తున్నా …. ఈ లిస్ట్ లో నేను చాలా మంచి సినిమాలు మిస్స్ చేసి ఉండొచ్చు … కారణం వాటిని నేను చూడక పోవడమో … చూసినా నచ్చక పోవడమో అయ్యుంటుంది !!!

గుర్తొచ్చిన పేరు బట్టి రాసను … కబట్టి మొదట ఉన్నది అన్నిటి కంటే బెస్ట్ అనీ ,చివర ఉంటే .. వర్స్ట్ అనీ అర్ధం కాదు

ఏటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్స్ మైండ్ (2004) , కసబ్లాంకా (1942)

గురించి ఇంతకు ముందే రాసాను , కాబట్టి వాటిని చేర్చ లేదు !!

1) ఇట్స్ ఏ వండర్ ఫుల్ల్ లైఫ్ (1946)

ఫ్రాంక్ కాప్రా తీసిన ఆల్ టైం గ్రేట్ మూవీ ఇది !!!
నిరాశా నిస్ప్రుహ ల తో … ఉండి ..జీవితం లో ఎదగ లేక ….. ఆత్మ హత్యా ప్రయత్నం చెయ్యబోయిన ఒక వ్యక్తిని … ఒక ఏంజిల్ … ఎలా జీవితం లో నిలబెట్టి మనిషి ని చేసింది అనేది సినిమా !!!
ఈ సినిమా క్లైమాక్స్ కి వచ్చే సరికి మీకు తెలియికుండానే … ఏడ్చేస్తారు …
చాలా మంచి సినిమా ..

2) ద నోట్ బుక్ (2004)

2004 లో వచ్చిన మంచి లవ్ స్టోరీ … కాక పొతే ఇది ట్రయంగిల్ లవ్ స్టోరీ..
ఈ సినిమ లో ఒక సీన్ లొ హీరో హీరొయిన్ ఒక సంవత్సరం తరువాత వర్షం లొ కలిసే సీన్ ఉంటుంది …
అది సినిమా కే హైలైట్ …. కాం అండ్ సెరీన్ లవ్ స్టొరీ ….మీ భాగస్వామిని వెంట పెట్టుకొని మరీ చూడాల్సిన సినిమా !!

3)సిటి ఆఫ్ ఏంజిల్స్ (1998) —

నికోలాస్ కేజ్ … అన్నీ యాక్షన్ మూవీస్ చేస్తున్న టైం లో వచ్చిన మంచి లవ్ స్టొరీ ఇది ..

ఇందులో .. ఏంజిల్ అయిన అయిన ..కేజ్ ..మెగ్ ర్యాన్ ప్రేమ కొసం .. మనిషి గా మారిపోతాడు …

కాని అతను ఆమె దగ్గరకి చేరే సరికి .. మెగ్ ర్యాన్ చనిపోతుంది
!!!

మెగ్ ర్యాన్ రొమాంటిక సినిమాలా దేవత , తనంత బాగా ఇంకెవరూ ఇలాంటి పాత్రలకు సరిపోరు !!

4)ఘోస్ట్ (1990) —

ఇది మరో సాడ్ ఎండింగ్ రోమాంటిక్ సినిమా …. చని పోయిన తరువాత కూడా తన భార్య రక్షణ కోసం తపన పడే ఒక ఘోస్ట్( దయ్యం ) కధ ఇది !!!
దీన్ని తెలుగు లో సుమన్ హీరో గా రీమేక్ చేసారు పేరు గుర్తు లేదు .

5) వెన్ హ్యారి మెట్ సాలీ (1989) –

మెగ్ ర్యాన్ నటించిన మరో మంచి కామెడీ లవ్ స్టోరీ … ఇద్దరు చిన్న నాటి స్నేహితుల మధ్య జరిగే స్టొరీ ఇది …

ఇందులో న్యు యార్క్ అందాలు చూసి తీరల్సిందే ….

6) 50 ఫర్స్ట్ డేట్స్ (2004)—

డ్రూ బారీ మోర్ నా ఫేవరేట్ హీరోయిన్ ల లో ఒకరు …

ఎప్పటి కైనా డ్రూ బారీ లాంటి క్యూట్ గర్ల్ ఫ్రెండ్ దొరక పోదా అని ఎదురు చూస్తున్న !! ;)
ఇందులో డ్రూ కి షార్ట్ టర్మ్ మెమరీ లాస్స్ ఉంటుంది …
హీరో ఆడం సాండ్లర్ ప్రతీ రోజు వాల్ల ప్రేమ ను గుర్తు చేస్తూ ఉంటాడు …

మంచి కామెడీ రోమాన్స్ అన్న మాట !!
ఇదే కపుల్ చాలా కాలం కింద వెడ్డింగ్ సింగర్ అనే రొమాంటిక్ కామెడీ లొ కూడా నటించారు .

డ్రూ బారి మోర్ అంటే నాకు మరో డాక్యుమెంటరీ గుర్తొచ్చింది దాని పేరు

మై డేట్ విత్ డ్రూ” నా లంటి ఒక డ్రూ బర్రి మోర్ అమర ప్రేమికుడు తీసిన సినిమా ఇది !!!

30 రోజుల్లో , కేవలం 1000 $ ల తో డ్రూ తో డేట్ ఎలా సంపాదించాడనేది స్టోరీ..

నేనూ అలాంటి … ప్రయత్నమే ఎదో ఒకటి .. చేసి డ్రూ ని కలుసుకోవాలి ….

డ్రూ నే వచ్చేస్తున్నా …………

7) ప్రెట్టి ఉమెన్ (1990) —

హాలీవుడ్ సావిత్రి జూలియా రాబర్ట్స్ హీరొయిన్ గా చేసిన మొదటి సినిమా ఇది , ఇది కూడా రోమాంటిక కామెడీ ఏ అనుకోండి ..

వ్యాపారి అయిన రిచర్డ్ గెర్ కీ , ప్రాస్టిట్యూట్ అయిన జూలియా కి మధ్య నడిచే కధ ఇది !!

8) అమేలీ (2001) —

ఇదో ఫ్రెంచి రోమాంటిక కామెడీ , చాలా మంచి సినిమా ..

చిన్నప్పటి నుంచి మిగతా పిల్లల్లకి దూరంగా పెరిగన , అమాయకురలైన అమేలీ విచిత్ర పరిస్థుతలలో తన చిన్నప్పటి స్నేహితుడి ని ఎలా కలుసుకుందనేది కధ !!

అమేలీ గా ఆడ్రీ టోటో నటించింది !!

9) ద ప్రిన్ సెస్స్ బ్రైడ్ (1987) —

రాజ కుమారి , రాకుమరుడు … రాక్షసుడు ….. ఇలా మన తెలుగు రాజుల సినిమాలా ఉంటుంది కధ !!

పాటలు లేని లోటు ను ప్రముఖ రాక్ బాండ్ డైర్ స్ట్రైట్స్ లీడ్ లీడ్ సింగర్ మార్క్ నాఫ్లర్ గారు ఇచ్చిన నేపధ్య సంగీతం తీర్చేస్తుంది !!

10) లవ్ ఆక్చువల్లీ (2000)

ఇదో బ్ర్టిటిష్ రోమాంటిక్ కామెడీ , రొమాంటిక కామెడీల్లో ఇది నా ఫేవరేట్లలలో ఒకటి !!

హైలైట్ ఎంటంటే ఇది ఒకటి లేక రెండు జంటల కధ కాదు , ఏకంగా ఎనిమిది జంటల 5 వారాల జీవిత ప్రయాణం !!

ఏ జంట కధ ఇంకోకరితో పోలదు !! బ్రిటిష్ ప్రైం మినిస్టర్ (హుగ్ గ్రాంట్ ) నుంచి మాములు ఉద్యోగి వరకూ జీవితం లో వేరు వేరు దారుల్లోని వారిని ప్రేమ అనే దారి ప్రయాన్ని మనకి చూపించే కధ !! స్క్రీం ప్లే అద్భుతం ఈ సినిమాలో !!

లవ్ ఆక్చువల్లీ ప్రేమికుల కధ కాదు … ప్రేమను గురించన కధ !!

11) గర్ల్ నెక్స్ట్ డోర్ (2004) —

ఇదో టీనేజ్ లవ్ స్టోరీ , అలా అని హాలివుడ్ బి గ్రేడ్ టీనేజ్ సినిమా కాదండోయి (అఫ్ కోర్స్ నేను అలా అనుకొనే చూసాననుకోండి ;) )

తన పక్కింటి అమ్మాయితో మొదటి చూపులొనే ప్రేమ లో పడ్డ హిర్సిచ్ (మాధ్యూ కిడ్మెన్) , కి ఆమె గురించి కొన్ని రోజుల తరువాత భయంకరమైన నిజం తెలుసుతుంది !!

ఆ సమస్యల్లొంచి ఆ అమ్మాయిని తప్పించిన హిర్సిచ్ అదే సమయం లో తన కలల యునివర్సిటీ లోకి ఎలా అడుగుపెట్టాడనేది కధ !!

12) టైటానిక్ (1997) —-


హాలీవుడ్ బాక్సఫిస్ రికార్డులను ని బద్దలు కొట్టేసి , పాత రికార్డులను ముక్కలు ముక్కలు గా చేసేసి …కాకులకు గద్దలకు వేసేసింది ఈ జేంస్ కామెరూన్ సినిమా .

ఈ సినిమా రెలీస్ అయ్యేప్పటికి నేను 6 వ తర గతి లో ఉన్నా , అప్పుడు చూసినప్పుడు ఎంటో చెత్త సినిమా అనిపించింది , ఇప్పుడు చూసినా అలాగే అనిపిస్తుంది .

మనసులో ఎక్కడో మాత్రం నిజంగా ఇది నాకు చాలా నచ్చేసింది అనిపించింది !! అందుకే లిస్ట్ లో చేర్చేసా !!

13) నాటింగ్ హిల్ల్ (1999) —-


ఇది మరో బ్రిటిష్ రొమాంటిక కామెడి , బ్రిటిష్ సూపర్ స్టార్ హుగ్ గ్రాంట్ , జూలియా రాబర్ట్స్ ఇందులో నాయికా నాయికలు !!

ప్రముఖ తార అయిన జూలియా తన బుక్ స్టోర్ కి వచ్చినప్పుడు చూసిన విలియం (హుగ్ గ్రాంట్) మొదటి చూపులనే ప్రేమ లొ పడతాడు !!

ఇక జూలియా కూడా అతనికి దగ్గర కావడం తో అతని జీవితం లో వచ్చిన మార్పులను తట్టుకొని వాల్లిద్దరూ ఎలా ఒకటి అయ్యారు అనేది కధ !!

ప్రెడిక్టబుల్ స్టోరీ అయినా ఎందుకో ఈ సినిమా మల్లీ మల్లీ చూడాలనిపిస్తుంది !!

14) ఎలజిబెత్ టౌన్ (2005) ——

ఉద్యోగం పొయి విపరీతమైన నిరాశ లో ఉన్న డ్రు (ఓర్లాండో బ్లూం ) కి తన తండ్రి మరణ వార్త తెలియడం తో మరింత నిస్ప్రుహ కి గురి అవుతాడు !!

తనకి మరణమే శరణం అనుకొని తన తండ్రి ఖర్మ ల కు బయలు దేరుతాడు , కాని దారిలో క్లైరీ (క్రిస్టెన్ డస్ట్ ) తో జరిగిన పరిచయం తనకు కొత్త జీవితాన్ని ఇచ్చి ..

జీవించడం లో ఉన్న ఆనందాన్ని గుర్తు చేస్తుంది .

డ్రూ రోడ్ ట్రిప్ ఈ సినిమా కు హైలైట్ !!

మీ పార్ట్నర్ తో తప్పక చూడ వల్సిన సినిమా !!

15) రోమన్ హాలిడే (1953) —

ఈ సినిమానే తెలుగు లో వెంకటేశ్ హీరో గా మళ్ళీశ్వరీ అనే పేరుతో తీసారు !!

ఈ సినిమా పుణ్యామా అని నా పేరు ప్రసాద్ నుంచి పెళ్ళీ కాని ప్రసాద్ కి మారి పొయ్యింది , నా విశయం పక్కన పెట్టి రోమన్ హాలిడే గురించే మాట్లాడితే …

ఇది 1950’s లో రోం (ఇటలీ) నేపధ్యం లొ జరిగే సినిమా !! రాకుమరి అయిన రాకుమారి ఆన్ (ఆడ్రీ హెప్ బర్న) తన రాజ్యాన్ని వదిలేసి మన హీరో జో బ్రాడ్లీ (గ్రెగరీ పెక్ ) దగ్గరికి వచ్చి చేరుతుంది , ఈ విశయం తెలియని మన హీరో , తన ని మామూలు అమ్మయి అనుకొని సైకిల్ పై నగరమంతా చూపిస్తాడు …. మెళ్ళగా ప్రేమించేస్తాడు కూడా … ఆఖరికి నిజం తెలుసు కొని ప్రేమను త్యాగం చెయ్యబోతాడు … అయినా క్లైమాక్స్ లో కలుస్తారునుకోండి !!

16 ) ఏ వాక్ టు రిమెంబర్ (2002) —


ఇది మరో టీన్ మూవీ , అండ్ మళ్ళీ బి గ్రేడ్ సినిమా కాదు !!

రెండు పరస్పరు విరుద్ధ భావాలు కలి గిన ఇద్దరు వ్యక్తుల , తమ అలోచనలకు ఏ మాత్రం సరితూగని వ్యక్తుల తో ఒకటౌతారు …

లాండన్ , సులీవన్ ఇద్దరినీ వారు చేసిన తప్పులకు శిక్ష గా కమ్యునిటీ సర్వీస్ చెయ్యమని ఆదేశిస్తారు … అలా కలిసిన ఇద్దరూ ప్రేమ లో పడతారు …

ఇది సాడ్ సినిమా అయినా .. క్లైమాక్స్ లో ఇద్దరూ కలవడం తో అంతా హ్యాప్పీసే …. మీ భాగస్వామి తో చూడ వలసిన మరో మంచి సినిమా !!
17) యూ హవ్ గాట్ ఏ మేల్ (1998) –-



మెగ్ రాయన్ , టాం హాంక్స్ , నాయికా నాయకులు గా నటించిన 1998 సినిమా ఇది ,
నిజ జీవితం లో వ్యాపార ప్రత్యర్ధులైన జో ఫాక్స్ (టాం హాంక్స్) కాధ్లీన్ కెల్లీ (మెగ్ రాయన్ ) , ఇంటర్నెట్ లో మాత్రం విపరీతంగ ప్రేమించేసుకుంటారు . మొదట్లో విరోధులైనా … నిజజీవితం లొ (సినిమాలో) కూడా ఒకరిని ఒకరు ఇష్ట పడ్డం మొదలు పెడతారు .

వీల్లిద్దరి జంట చూడ ముచ్హట గా ఉంటుంది !! ఇదే క్రూ (డైరెక్టర్ , మెగ్ రాయన్ , టాం హాంక్స్) 1993 లో స్లీప్ లెస్స్ ఇన్ సియాటల్ అనే సినిమా వచ్చింది !! అది కూడా రోమాంటిక్ సినిమా నే !!

18) ద అపార్ట్మెంట్ (1960) —-


బిల్లీ వైల్డర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఆల్ టైం గ్రేట్ … అంతకు ముందే మార్లిన్ మోన్రో తో సం లైక్ ఇట్ హాట్ అనే సూపెర్ సినిమా తీసి , అదే ఊపు లో ఇది కూడా తీసేసారు !! సం లైక్ ఇట్ హాట్ కూడా చాలా బావుంటుంది .. కాని అందులో రొమాంస్ చెప్పుకో దగ్గ రేంజ్ లో ఉండదు అందుకే ఈ లిస్ట్ లో చోటు లేదు !!

ఇక ద అపార్ట్మెంట్ విశయానికి వస్తే , నలుగురు బాస్ ల తో సతమతమవుతూ , వాల్లని నెగ్గుకొచ్చి లిఫ్ట్ ఆపరేటర్ అయిన హీరొయిన్ ప్రేమ ను మన హీరో ఎలా గెలుచుకునా్డనేది కధ !!

ఈ సినిమా రొమాన్స్ కోసమే కాదు కామెడీ కొసం కూడా తప్పక చూడ వల్సిందే !!

19) అమెరికాస్ స్వీట్ హార్ట్స్ (2001) —


పే…..ద్ద సినిమా స్టార్సూ , దంపతులూ అయిన కాధరీనా జీటా జోంస్ , జాన్ కుసాక్ (సినిమాలో) విభేధాలొచ్చి విడి పోతారు ,

కాక పోతే వాల్లిద్దరూ కలిసి నటించిన సినిమా ప్రమోసన్ కోసం మల్లీ కలవాల్సి వస్తుంది !! వల్లిదరిని కలపడానికి డైరెక్టర్ (బిల్లీ క్రిస్టల్ ) జీటా జోంస్ అసిస్టెంట్ కం. సోదరైన జూలీయా రాబర్ట్స్ కష్టాలు భలె నవ్వు తెప్పిస్తాయి !!

ఇందులో పంచ్ లైన్లు భలె ఉంటాయి !!

ఒక డైలాగ్ ఇలా ఉంటుంది నువ్వు ప్రేమిస్తే బ్రేక్ ఫాస్ట్ కి వెల్లినట్టు వెల్లి పోవాలి వాల్ల దగ్గరికి అంతే గాని కూర్చొని అలో చించ కూడదు !!

మొత్తానికి లిస్ట్ లో ఉండాల్సిన సినిమా !!

20) ఫొర్ వెడ్డీంగ్స్ అండ్ ఏ ఫ్యునరల్ (1994) —-

హ్యూగ్ గ్రాంట్ , అండీ మెక్ డావెల్ నటించి బ్రిటిష్ చిత్రం ఇది !!

నలుగురు స్నేహితుల పెళ్ళిలూ ఒక ఖర్మ మధ్య నడిచే కధ ఇది , సూపర్ కామెడీ …

ఇందులో రోవాన్ అటిక్సన్ ప్రీస్ట్ ఎపిసోడ్ సినిమా కే హైలైట్ అసలా …
ఇంతకు ముందు చెప్పినట్టు మెగ్ రయాన్ రొమాంటిక్ సినిమాల దేవత అయితే హ్యూగ్ గ్రాంట్ దేవుడు ..

21) బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ (1995) —

క్లైంట్ ఈస్ట్ వుడ్ నేను రాసిన లాస్ట్ పోస్ట్ లో ఈ సినిమా గురించి రాయలేదు , ఇప్పుడు రాస్తున్నా .

క్లైంట్ ఈస్ట్ వుడ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో అయనా మెరీల్ స్ట్రీప్ నటించారు !!

మెరీల్ స్ట్రీప్ అంటే నాకు చాలా ఇష్టం , ఈ సినిమాలో ఆవిడ నటన కి జోహార్లు ..

క్లైంట్ ఈస్ట్ వుడ్ కౌబాయ్ సినిమాలు మాత్రమే బాగా తీస్తాడనుకున్నా కాని ప్రేమ సినిమాలు ఇంత బాగా తీస్తాడని తెలీదు !!

తన భర్తా పిల్లలకి దూరంగా ఉన్న ఫ్రాంసెస్కా (మెరీల్ స్ట్రీప్) , మాడిసన్ కౌంటీ కి వచ్హిన ఫొటోగ్రాఫర్ క్లైంట్ ఈస్ట్ వుడ్ తో ప్రేమ లో పడుతుంది !! కాని నాలుగు రోజుల కే విడి పోతారు .

సినిమా క్లైమాక్స్ కంట తడి పెట్టిస్తుంది !!

22) రోమియో + జూలియట్ (1996) —


టైటిల్ చూస్తేనే కధ అర్ధం అయి పోతుంది ఇక డిస్కశన్ లెందుకు ?? . 1996 లో వచ్చిన ఈ మూవీ షేక్స్ పియర్ నవలకు ఈ నాటి రూపం !! లియొ నార్డో డికార్పియో , క్లైరీ డేంస్ ఈ నాటి అమర ప్రేమికులు గా నటించారు.
సినిమాకు కాక పోయినా ఆ అమర ప్రేమ కధ కోసమైనా ఈ సినిమా లిస్ట్ చెయ్యక తప్పింది కాదు !!

23 ) ది ఇంగ్లీష్ పేషంట్ (1996) –



వార్ బేస్డ్ రొమాటిక్ సినిమాల్లో ఇది నెం 2 మొదటిది మొదటిది లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ .ప్రపంచ యుద్ధం లో విపరీతంగా గాయ పడిన లాస్లో ( రాల్ఫ్ ఫినెస్స్ ) కీ నర్స్ జూలియట్ బినోచే కీ మధ్య నడిచే ప్రేమ కధ ఇది !!
ఇక మరో ముగ్గురి నేపధ్యం లో కూడా కధ నడుస్తుందనుకోండి !! ఇక వాల్లందరూ యుద్ధం నుంచి ఎలా బయట పడ్డరు అనేది కధ !!

ఈ సినిమా కి మైకెల్ ఒండాత్జీ రాసిన నవల ఆధారం .

24) హిట్చ్ (2005) —

రీసెంట్ గా వచ్చి … నాకు నచ్చి … ఈ లిస్ట్ లో చేరిని సినిమా ఇది !!
అందరికీ ప్రేమ పాఠాలు చెప్పే ఆలెక్స్ హిట్చ్ (విల్ స్మిత్ ) .. సారా (ఈవా మెండస్ )ని చూసి మనసు పారేసుకుంటాడు !!
నానా తంటాలు పడి మెళ్ళగా ప్రేమ లోకి లాగుతాడు కూడా … కాని అతని పాత క్లైంట్ వల్ల సారా అతన్ని అపార్ధం చేసుకుంటుంది !! ఇక మన హీరో అమెకు ఎలా నిజాన్ని తెలియజేసి తన దాన్ని చేసుకు్న్నాడు అనేది కధ !!

అంత గొప్ప సినిమా కాక పోవచ్చు కాని మంచి సినిమా … సినిమా చూస్తునన్ననత సేపు మీ మోము పై చిరు నవ్వు చెదరదు (అయ్ బాబొయ్ ఇదేంటి , నేను ఇంత భారీ డైలాగులు కొట్టేస్తున్నను (:D)

25) లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ (1997) —-

రాబార్ట్ బెన్జీని దర్షకత్వం లో అయనే కధానాయకుడిగా నటించిన సినిమా ఇది !!
ఇది కూడా రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యం లో నడుస్తుంది … కా పోతే ఇందులో కామెడీ కూడా ఉందండొయి .. ఇది ఇటా్లియన్ సినిమా .

ఇందులో నాయికా నాయకుల ప్రేమ కంటే తండ్రీ కొడుకులే ప్రేమే మిమ్మల్ని మరింతగా ఆకట్టు కుంటుంది !!
సినిమా అంతా హాయిగా సాగిపోయినా … క్లైమాక్స్ మాత్రం గుండెల్ని పిండేస్తుంది !!

26) ష్రెక్ (2001) —

ఇదేంటి పిల్లల ఆనిమేటెడ్ సినిమా అయిన ష్రెక్ ఇందులో చేర్చాడేంటీ అని తిట్టుకుంట్టున్నారా ??
సినిమా మరో చూసి తిట్టండి చూద్దాం !!
ఇది నిజంగా రొమాంటిక సినిమా నే నా ద్రుష్టిలో …
ఇందులో క్లైమాక్స్ నాకు చాలా ఇష్టం …

ఆనిమేటడ్ సినిమాల్లో మరో రొమాంటిక్ సినిమా ఆంట్జ్ వీలైతే దాన్ని కూడా ఒక లుక్కెయ్యండి

27) ఎ వాక్ ఇన్ ద క్లౌడ్స్ (1995) —

ఈ సినిమా కధ కూడా రెండవ ప్రపంచ నేపధ్యం లో నే జరరుతుంది , కాక పోతే ఇందులో యుద్ధం మేయిన్ స్ట్రీం కధలో ఉండదు !!
మాట్రిక్స్ లో నియో ద వన్ గా ఏజెంట్ స్మిత్ ఫైటింగ్ ఇరగ దీసిన కియానూ రీవ్స్ ఈ సినిమాలో రొమాంస్ లో కూడా ఇరగదీసాడు !!

మన చిరంజీవి గారి బావగారు బాగున్నరా ఈ సినిమా కాపీయే .. ఈ పాటికే సినిమా కధ చూచాయ గా అర్ధం అయ్యుంటుంది అనుకుంటా ??
కియానూ రీవ్స్ సినిమాలు స్వీట్ నవంబర్ , లేక్ హౌస్ కూడా నాకు చాలా ఇష్టం కాని ఎందుకో లి్స్ట్ లో చేర్చ బుద్ది కాలేదు !!

28) చాక్లేట్ (2000) —

ఈ సినిమా కి జానీ డెప్ , జూడీ డెంచ్ , కారీ అన్నీ మోస్ , ఆల్ఫ్రెడ్ మొలీనా లాంటి పెద్ద స్టార్ కాస్టే ఉంది ..
సినిమా కధ కొస్తే .. మారు మూల ఫ్రెంచి గ్రామం లోకి తన కూతురితో కొత్త గా వచ్చిన వియాన్నే (ఆల్ఫ్రెడ్ మొలీనా) , అక్కడ ఒక చాక్లేట్ కొట్టు పెడుతుంది !! అందరి మన్ననలూ పొందినా గ్రామ పెద్దకు మాత్రం ఈవిడ చేసే పనులు నచ్హవు … ఇంతలో జాని డెప్ రంగ ప్రవేశం చేస్తాడు ..ఇక వాల్ల మధ్య నడిచే ప్రేమే సినిమా !!

29 ) సింగిన్ ఇన్ ద రైన్ (1952) –


ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఇలాంటి వాటినే చూసి అంటారు … అంది హాలీఉడ్డైనా …. తెలుగు సినిమా అయినా ఓల్డ్ గోల్డే …. కాదు ప్లాటినమే ….
ఈ సినిమా రొమాంస్ కంటే పాటలే చాలా బావుంటాయి …. సినిమా మొత్తం పాటలే …

నాకిష్టమైన పాటలు …. టైటిల్ సాంగ్ …సింగిన్ ఇన్ ద రైన్ ….
ఆల్ ఇ డూ ఇస్ డ్రీం ఆఫ్ యూ …
గుడ్ మార్నినింగ్ …

30) మై సాస్సీ గర్ల్ (2001) —

ఇదో కొరియన్ సినిమా ….

లిస్ట్ లో ఉన్న వాటన్నిటి లో కి నాకు ఇష్టమైన సినిమా ఇది !!

నాకు ఈ సినిమా విపరీతంగా ఇష్టం ….నా ఆల్ టైం ఫేవరేట్ సినిమాల్లో ఇది తప్పక ఉంటుంది !!

ఎందుకో ఇక్కడ దీని గురించి రాయ బుద్ధి కావట్లేదు …

డీటేల్డ్ గా మరో పే…..ద్ద పోస్ట్ రాసు కొస్తా ఈ సినిమా గురించి !!

ఇదీ నా లిస్ట్ …. చాలా మిస్స్ చేసి ఉండొచ్చు … చెప్పాను గా గుర్తున్నవి … నేను చూసినవి …. నాకు నచ్చినవి ఇందులో చేర్చాను

సబ్రీనా అనే సినిమా కూడా బావుటుంది కానీ ఎందుకో చేర్చ బుద్ది కాలేదు …

ఇక తెలుగు లో కూడా బోల్డు సినిమాలు ఇష్టం అన్నీ రాయలేం కదా అందుకే చర్చ లేదు …

సో మీ భార్యలతో .. భర్తలతో … గర్లఫ్రెండ్లతో … బాయ్ ఫ్రెండ్ తో నో కూర్చొని హాయిగా వీలైనన్ని చూసెయ్యండి …

(భార్యలు , భర్తలు అని లు వాడేసినంత మాత్రానా అపార్ధం చేసుకొకం డే …. ) !!

ఇష్ యూ ఎ ఎరీ యాప్పీ ఆలంటైన్స్ దినం …………………….

ఇది నా డ్రూ కి ……

. [red][b]
_________హాప్పీ వ____________హాప్పీ వల
______హాప్పీ వలెంటైం_______హాప్పీ వలెంటైంస్
____హాప్పీ వలెంటైంస్ డే___హాప్పీ వలెంటైంస్ డే
___హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంట_______హాప్
__హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంట_________హాప్
_హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్_______హాప్
_హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే ______
హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హాప్__హాప
హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ _
హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వల
హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వల
_హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ
__హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హాప్ప
____హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హా
______హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్
_________హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెం
____________హాప్పీ వలెంటైంస్ డే హాప్ప
______________హాప్పీ వలెంటైంస్ డే
_________________హాప్పీ వలెంటై
___________________హాప్పీ వల
_____________________హాప్పీ
______________________హాప్
_______________________హా

వర్గాలు రొమాంటిక్ సినిమాలు · సినిమాలు