Feb 14 వచ్చేసింది కదా అందుకే నేమో
రొమాంటిక్ సినిమాల మీదికి మనసు పొయ్యింది !!
అందుకే ఇప్పట్టి వరకు నేను చూసి … నాకు పిచ్చ పిచ్చ గ నచ్చేసిన రొమాంటిక్ సినిమాల లిస్ట్ ఇస్తున్నా …. ఈ లిస్ట్ లో నేను చాలా మంచి సినిమాలు మిస్స్ చేసి ఉండొచ్చు … కారణం వాటిని నేను చూడక పోవడమో … చూసినా నచ్చక పోవడమో అయ్యుంటుంది !!!
గుర్తొచ్చిన పేరు బట్టి రాసను … కబట్టి మొదట ఉన్నది అన్నిటి కంటే బెస్ట్ అనీ ,చివర ఉంటే .. వర్స్ట్ అనీ అర్ధం కాదు
ఏటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్స్ మైండ్ (2004) , కసబ్లాంకా (1942)
గురించి ఇంతకు ముందే రాసాను , కాబట్టి వాటిని చేర్చ లేదు !!
1) ఇట్స్ ఏ వండర్ ఫుల్ల్ లైఫ్ (1946) —
ఫ్రాంక్ కాప్రా తీసిన ఆల్ టైం గ్రేట్ మూవీ ఇది !!!
నిరాశా నిస్ప్రుహ ల తో … ఉండి ..జీవితం లో ఎదగ లేక ….. ఆత్మ హత్యా ప్రయత్నం చెయ్యబోయిన ఒక వ్యక్తిని … ఒక ఏంజిల్ … ఎలా జీవితం లో నిలబెట్టి మనిషి ని చేసింది అనేది సినిమా !!!
ఈ సినిమా క్లైమాక్స్ కి వచ్చే సరికి మీకు తెలియికుండానే … ఏడ్చేస్తారు …
చాలా మంచి సినిమా ..
2004 లో వచ్చిన మంచి లవ్ స్టోరీ … కాక పొతే ఇది ట్రయంగిల్ లవ్ స్టోరీ..
ఈ సినిమ లో ఒక సీన్ లొ హీరో హీరొయిన్ ఒక సంవత్సరం తరువాత వర్షం లొ కలిసే సీన్ ఉంటుంది …
అది సినిమా కే హైలైట్ …. కాం అండ్ సెరీన్ లవ్ స్టొరీ ….మీ భాగస్వామిని వెంట పెట్టుకొని మరీ చూడాల్సిన సినిమా !!
నికోలాస్ కేజ్ … అన్నీ యాక్షన్ మూవీస్ చేస్తున్న టైం లో వచ్చిన మంచి లవ్ స్టొరీ ఇది ..
ఇందులో .. ఏంజిల్ అయిన అయిన ..కేజ్ ..మెగ్ ర్యాన్ ప్రేమ కొసం .. మనిషి గా మారిపోతాడు …
కాని అతను ఆమె దగ్గరకి చేరే సరికి .. మెగ్ ర్యాన్ చనిపోతుంది
!!!
మెగ్ ర్యాన్ రొమాంటిక సినిమాలా దేవత , తనంత బాగా ఇంకెవరూ ఇలాంటి పాత్రలకు సరిపోరు !!
ఇది మరో సాడ్ ఎండింగ్ రోమాంటిక్ సినిమా …. చని పోయిన తరువాత కూడా తన భార్య రక్షణ కోసం తపన పడే ఒక ఘోస్ట్( దయ్యం ) కధ ఇది !!!
దీన్ని తెలుగు లో సుమన్ హీరో గా రీమేక్ చేసారు పేరు గుర్తు లేదు .
5) వెన్ హ్యారి మెట్ సాలీ (1989) –
మెగ్ ర్యాన్ నటించిన మరో మంచి కామెడీ లవ్ స్టోరీ … ఇద్దరు చిన్న నాటి స్నేహితుల మధ్య జరిగే స్టొరీ ఇది …
ఇందులో న్యు యార్క్ అందాలు చూసి తీరల్సిందే ….
6) 50 ఫర్స్ట్ డేట్స్ (2004)—
డ్రూ బారీ మోర్ నా ఫేవరేట్ హీరోయిన్ ల లో ఒకరు …
ఎప్పటి కైనా డ్రూ బారీ లాంటి క్యూట్ గర్ల్ ఫ్రెండ్ దొరక పోదా అని ఎదురు చూస్తున్న !!
ఇందులో డ్రూ కి షార్ట్ టర్మ్ మెమరీ లాస్స్ ఉంటుంది …
హీరో ఆడం సాండ్లర్ ప్రతీ రోజు వాల్ల ప్రేమ ను గుర్తు చేస్తూ ఉంటాడు …
మంచి కామెడీ రోమాన్స్ అన్న మాట !!
ఇదే కపుల్ చాలా కాలం కింద వెడ్డింగ్ సింగర్ అనే రొమాంటిక్ కామెడీ లొ కూడా నటించారు .
డ్రూ బారి మోర్ అంటే నాకు మరో డాక్యుమెంటరీ గుర్తొచ్చింది దాని పేరు
“మై డేట్ విత్ డ్రూ” నా లంటి ఒక డ్రూ బర్రి మోర్ అమర ప్రేమికుడు తీసిన సినిమా ఇది !!!
30 రోజుల్లో , కేవలం 1000 $ ల తో డ్రూ తో డేట్ ఎలా సంపాదించాడనేది స్టోరీ..
నేనూ అలాంటి … ప్రయత్నమే ఎదో ఒకటి .. చేసి డ్రూ ని కలుసుకోవాలి ….
హాలీవుడ్ సావిత్రి జూలియా రాబర్ట్స్ హీరొయిన్ గా చేసిన మొదటి సినిమా ఇది , ఇది కూడా రోమాంటిక కామెడీ ఏ అనుకోండి ..
వ్యాపారి అయిన రిచర్డ్ గెర్ కీ , ప్రాస్టిట్యూట్ అయిన జూలియా కి మధ్య నడిచే కధ ఇది !!
ఇదో ఫ్రెంచి రోమాంటిక కామెడీ , చాలా మంచి సినిమా ..
చిన్నప్పటి నుంచి మిగతా పిల్లల్లకి దూరంగా పెరిగన , అమాయకురలైన అమేలీ విచిత్ర పరిస్థుతలలో తన చిన్నప్పటి స్నేహితుడి ని ఎలా కలుసుకుందనేది కధ !!
అమేలీ గా ఆడ్రీ టోటో నటించింది !!
9) ద ప్రిన్ సెస్స్ బ్రైడ్ (1987) —
రాజ కుమారి , రాకుమరుడు … రాక్షసుడు ….. ఇలా మన తెలుగు రాజుల సినిమాలా ఉంటుంది కధ !!
పాటలు లేని లోటు ను ప్రముఖ రాక్ బాండ్ డైర్ స్ట్రైట్స్ లీడ్ లీడ్ సింగర్ మార్క్ నాఫ్లర్ గారు ఇచ్చిన నేపధ్య సంగీతం తీర్చేస్తుంది !!
ఇదో బ్ర్టిటిష్ రోమాంటిక్ కామెడీ , రొమాంటిక కామెడీల్లో ఇది నా ఫేవరేట్లలలో ఒకటి !!
హైలైట్ ఎంటంటే ఇది ఒకటి లేక రెండు జంటల కధ కాదు , ఏకంగా ఎనిమిది జంటల 5 వారాల జీవిత ప్రయాణం !!
ఏ జంట కధ ఇంకోకరితో పోలదు !! బ్రిటిష్ ప్రైం మినిస్టర్ (హుగ్ గ్రాంట్ ) నుంచి మాములు ఉద్యోగి వరకూ జీవితం లో వేరు వేరు దారుల్లోని వారిని ప్రేమ అనే దారి ప్రయాన్ని మనకి చూపించే కధ !! స్క్రీం ప్లే అద్భుతం ఈ సినిమాలో !!
లవ్ ఆక్చువల్లీ ప్రేమికుల కధ కాదు … ప్రేమను గురించన కధ !!
11) గర్ల్ నెక్స్ట్ డోర్ (2004) —
ఇదో టీనేజ్ లవ్ స్టోరీ , అలా అని హాలివుడ్ బి గ్రేడ్ టీనేజ్ సినిమా కాదండోయి (అఫ్ కోర్స్ నేను అలా అనుకొనే చూసాననుకోండి
)
తన పక్కింటి అమ్మాయితో మొదటి చూపులొనే ప్రేమ లో పడ్డ హిర్సిచ్ (మాధ్యూ కిడ్మెన్) , కి ఆమె గురించి కొన్ని రోజుల తరువాత భయంకరమైన నిజం తెలుసుతుంది !!
ఆ సమస్యల్లొంచి ఆ అమ్మాయిని తప్పించిన హిర్సిచ్ అదే సమయం లో తన కలల యునివర్సిటీ లోకి ఎలా అడుగుపెట్టాడనేది కధ !!
హాలీవుడ్ బాక్సఫిస్ రికార్డులను ని బద్దలు కొట్టేసి , పాత రికార్డులను ముక్కలు ముక్కలు గా చేసేసి …కాకులకు గద్దలకు వేసేసింది ఈ జేంస్ కామెరూన్ సినిమా .
ఈ సినిమా రెలీస్ అయ్యేప్పటికి నేను 6 వ తర గతి లో ఉన్నా , అప్పుడు చూసినప్పుడు ఎంటో చెత్త సినిమా అనిపించింది , ఇప్పుడు చూసినా అలాగే అనిపిస్తుంది .
మనసులో ఎక్కడో మాత్రం నిజంగా ఇది నాకు చాలా నచ్చేసింది అనిపించింది !! అందుకే లిస్ట్ లో చేర్చేసా !!
ఇది మరో బ్రిటిష్ రొమాంటిక కామెడి , బ్రిటిష్ సూపర్ స్టార్ హుగ్ గ్రాంట్ , జూలియా రాబర్ట్స్ ఇందులో నాయికా నాయికలు !!
ప్రముఖ తార అయిన జూలియా తన బుక్ స్టోర్ కి వచ్చినప్పుడు చూసిన విలియం (హుగ్ గ్రాంట్) మొదటి చూపులనే ప్రేమ లొ పడతాడు !!
ఇక జూలియా కూడా అతనికి దగ్గర కావడం తో అతని జీవితం లో వచ్చిన మార్పులను తట్టుకొని వాల్లిద్దరూ ఎలా ఒకటి అయ్యారు అనేది కధ !!
ప్రెడిక్టబుల్ స్టోరీ అయినా ఎందుకో ఈ సినిమా మల్లీ మల్లీ చూడాలనిపిస్తుంది !!
ఉద్యోగం పొయి విపరీతమైన నిరాశ లో ఉన్న డ్రు (ఓర్లాండో బ్లూం ) కి తన తండ్రి మరణ వార్త తెలియడం తో మరింత నిస్ప్రుహ కి గురి అవుతాడు !!
తనకి మరణమే శరణం అనుకొని తన తండ్రి ఖర్మ ల కు బయలు దేరుతాడు , కాని దారిలో క్లైరీ (క్రిస్టెన్ డస్ట్ ) తో జరిగిన పరిచయం తనకు కొత్త జీవితాన్ని ఇచ్చి ..
జీవించడం లో ఉన్న ఆనందాన్ని గుర్తు చేస్తుంది .
డ్రూ రోడ్ ట్రిప్ ఈ సినిమా కు హైలైట్ !!
మీ పార్ట్నర్ తో తప్పక చూడ వల్సిన సినిమా !!
15) రోమన్ హాలిడే (1953) —
ఈ సినిమానే తెలుగు లో వెంకటేశ్ హీరో గా మళ్ళీశ్వరీ అనే పేరుతో తీసారు !!
ఈ సినిమా పుణ్యామా అని నా పేరు ప్రసాద్ నుంచి పెళ్ళీ కాని ప్రసాద్ కి మారి పొయ్యింది , నా విశయం పక్కన పెట్టి రోమన్ హాలిడే గురించే మాట్లాడితే …
ఇది 1950’s లో రోం (ఇటలీ) నేపధ్యం లొ జరిగే సినిమా !! రాకుమరి అయిన రాకుమారి ఆన్ (ఆడ్రీ హెప్ బర్న) తన రాజ్యాన్ని వదిలేసి మన హీరో జో బ్రాడ్లీ (గ్రెగరీ పెక్ ) దగ్గరికి వచ్చి చేరుతుంది , ఈ విశయం తెలియని మన హీరో , తన ని మామూలు అమ్మయి అనుకొని సైకిల్ పై నగరమంతా చూపిస్తాడు …. మెళ్ళగా ప్రేమించేస్తాడు కూడా … ఆఖరికి నిజం తెలుసు కొని ప్రేమను త్యాగం చెయ్యబోతాడు … అయినా క్లైమాక్స్ లో కలుస్తారునుకోండి !!
16 ) ఏ వాక్ టు రిమెంబర్ (2002) —
ఇది మరో టీన్ మూవీ , అండ్ మళ్ళీ బి గ్రేడ్ సినిమా కాదు !!
రెండు పరస్పరు విరుద్ధ భావాలు కలి గిన ఇద్దరు వ్యక్తుల , తమ అలోచనలకు ఏ మాత్రం సరితూగని వ్యక్తుల తో ఒకటౌతారు …
లాండన్ , సులీవన్ ఇద్దరినీ వారు చేసిన తప్పులకు శిక్ష గా కమ్యునిటీ సర్వీస్ చెయ్యమని ఆదేశిస్తారు … అలా కలిసిన ఇద్దరూ ప్రేమ లో పడతారు …
ఇది సాడ్ సినిమా అయినా .. క్లైమాక్స్ లో ఇద్దరూ కలవడం తో అంతా హ్యాప్పీసే …. మీ భాగస్వామి తో చూడ వలసిన మరో మంచి సినిమా !!
17) యూ హవ్ గాట్ ఏ మేల్ (1998) –-
మెగ్ రాయన్ , టాం హాంక్స్ , నాయికా నాయకులు గా నటించిన 1998 సినిమా ఇది ,
నిజ జీవితం లో వ్యాపార ప్రత్యర్ధులైన జో ఫాక్స్ (టాం హాంక్స్) కాధ్లీన్ కెల్లీ (మెగ్ రాయన్ ) , ఇంటర్నెట్ లో మాత్రం విపరీతంగ ప్రేమించేసుకుంటారు . మొదట్లో విరోధులైనా … నిజజీవితం లొ (సినిమాలో) కూడా ఒకరిని ఒకరు ఇష్ట పడ్డం మొదలు పెడతారు .
వీల్లిద్దరి జంట చూడ ముచ్హట గా ఉంటుంది !! ఇదే క్రూ (డైరెక్టర్ , మెగ్ రాయన్ , టాం హాంక్స్) 1993 లో స్లీప్ లెస్స్ ఇన్ సియాటల్ అనే సినిమా వచ్చింది !! అది కూడా రోమాంటిక్ సినిమా నే !!
బిల్లీ వైల్డర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఆల్ టైం గ్రేట్ … అంతకు ముందే మార్లిన్ మోన్రో తో సం లైక్ ఇట్ హాట్ అనే సూపెర్ సినిమా తీసి , అదే ఊపు లో ఇది కూడా తీసేసారు !! సం లైక్ ఇట్ హాట్ కూడా చాలా బావుంటుంది .. కాని అందులో రొమాంస్ చెప్పుకో దగ్గ రేంజ్ లో ఉండదు అందుకే ఈ లిస్ట్ లో చోటు లేదు !!
ఇక ద అపార్ట్మెంట్ విశయానికి వస్తే , నలుగురు బాస్ ల తో సతమతమవుతూ , వాల్లని నెగ్గుకొచ్చి లిఫ్ట్ ఆపరేటర్ అయిన హీరొయిన్ ప్రేమ ను మన హీరో ఎలా గెలుచుకునా్డనేది కధ !!
ఈ సినిమా రొమాన్స్ కోసమే కాదు కామెడీ కొసం కూడా తప్పక చూడ వల్సిందే !!
19) అమెరికాస్ స్వీట్ హార్ట్స్ (2001) —
పే…..ద్ద సినిమా స్టార్సూ , దంపతులూ అయిన కాధరీనా జీటా జోంస్ , జాన్ కుసాక్ (సినిమాలో) విభేధాలొచ్చి విడి పోతారు ,
కాక పోతే వాల్లిద్దరూ కలిసి నటించిన సినిమా ప్రమోసన్ కోసం మల్లీ కలవాల్సి వస్తుంది !! వల్లిదరిని కలపడానికి డైరెక్టర్ (బిల్లీ క్రిస్టల్ ) జీటా జోంస్ అసిస్టెంట్ కం. సోదరైన జూలీయా రాబర్ట్స్ కష్టాలు భలె నవ్వు తెప్పిస్తాయి !!
ఇందులో పంచ్ లైన్లు భలె ఉంటాయి !!
ఒక డైలాగ్ ఇలా ఉంటుంది నువ్వు ప్రేమిస్తే బ్రేక్ ఫాస్ట్ కి వెల్లినట్టు వెల్లి పోవాలి వాల్ల దగ్గరికి అంతే గాని కూర్చొని అలో చించ కూడదు !!
మొత్తానికి లిస్ట్ లో ఉండాల్సిన సినిమా !!
20) ఫొర్ వెడ్డీంగ్స్ అండ్ ఏ ఫ్యునరల్ (1994) —-
హ్యూగ్ గ్రాంట్ , అండీ మెక్ డావెల్ నటించి బ్రిటిష్ చిత్రం ఇది !!
నలుగురు స్నేహితుల పెళ్ళిలూ ఒక ఖర్మ మధ్య నడిచే కధ ఇది , సూపర్ కామెడీ …
ఇందులో రోవాన్ అటిక్సన్ ప్రీస్ట్ ఎపిసోడ్ సినిమా కే హైలైట్ అసలా …
ఇంతకు ముందు చెప్పినట్టు మెగ్ రయాన్ రొమాంటిక్ సినిమాల దేవత అయితే హ్యూగ్ గ్రాంట్ దేవుడు ..
21) బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ (1995) —
క్లైంట్ ఈస్ట్ వుడ్ నేను రాసిన లాస్ట్ పోస్ట్ లో ఈ సినిమా గురించి రాయలేదు , ఇప్పుడు రాస్తున్నా .
క్లైంట్ ఈస్ట్ వుడ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో అయనా మెరీల్ స్ట్రీప్ నటించారు !!
మెరీల్ స్ట్రీప్ అంటే నాకు చాలా ఇష్టం , ఈ సినిమాలో ఆవిడ నటన కి జోహార్లు ..
క్లైంట్ ఈస్ట్ వుడ్ కౌబాయ్ సినిమాలు మాత్రమే బాగా తీస్తాడనుకున్నా కాని ప్రేమ సినిమాలు ఇంత బాగా తీస్తాడని తెలీదు !!
తన భర్తా పిల్లలకి దూరంగా ఉన్న ఫ్రాంసెస్కా (మెరీల్ స్ట్రీప్) , మాడిసన్ కౌంటీ కి వచ్హిన ఫొటోగ్రాఫర్ క్లైంట్ ఈస్ట్ వుడ్ తో ప్రేమ లో పడుతుంది !! కాని నాలుగు రోజుల కే విడి పోతారు .
సినిమా క్లైమాక్స్ కంట తడి పెట్టిస్తుంది !!
టైటిల్ చూస్తేనే కధ అర్ధం అయి పోతుంది ఇక డిస్కశన్ లెందుకు ?? . 1996 లో వచ్చిన ఈ మూవీ షేక్స్ పియర్ నవలకు ఈ నాటి రూపం !! లియొ నార్డో డికార్పియో , క్లైరీ డేంస్ ఈ నాటి అమర ప్రేమికులు గా నటించారు.
సినిమాకు కాక పోయినా ఆ అమర ప్రేమ కధ కోసమైనా ఈ సినిమా లిస్ట్ చెయ్యక తప్పింది కాదు !!
23 ) ది ఇంగ్లీష్ పేషంట్ (1996) –
వార్ బేస్డ్ రొమాటిక్ సినిమాల్లో ఇది నెం 2 మొదటిది మొదటిది లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ .ప్రపంచ యుద్ధం లో విపరీతంగా గాయ పడిన లాస్లో ( రాల్ఫ్ ఫినెస్స్ ) కీ నర్స్ జూలియట్ బినోచే కీ మధ్య నడిచే ప్రేమ కధ ఇది !!
ఇక మరో ముగ్గురి నేపధ్యం లో కూడా కధ నడుస్తుందనుకోండి !! ఇక వాల్లందరూ యుద్ధం నుంచి ఎలా బయట పడ్డరు అనేది కధ !!
ఈ సినిమా కి మైకెల్ ఒండాత్జీ రాసిన నవల ఆధారం .
రీసెంట్ గా వచ్చి … నాకు నచ్చి … ఈ లిస్ట్ లో చేరిని సినిమా ఇది !!
అందరికీ ప్రేమ పాఠాలు చెప్పే ఆలెక్స్ హిట్చ్ (విల్ స్మిత్ ) .. సారా (ఈవా మెండస్ )ని చూసి మనసు పారేసుకుంటాడు !!
నానా తంటాలు పడి మెళ్ళగా ప్రేమ లోకి లాగుతాడు కూడా … కాని అతని పాత క్లైంట్ వల్ల సారా అతన్ని అపార్ధం చేసుకుంటుంది !! ఇక మన హీరో అమెకు ఎలా నిజాన్ని తెలియజేసి తన దాన్ని చేసుకు్న్నాడు అనేది కధ !!
అంత గొప్ప సినిమా కాక పోవచ్చు కాని మంచి సినిమా … సినిమా చూస్తునన్ననత సేపు మీ మోము పై చిరు నవ్వు చెదరదు (అయ్ బాబొయ్ ఇదేంటి , నేను ఇంత భారీ డైలాగులు కొట్టేస్తున్నను (:D)
25) లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ (1997) —-
రాబార్ట్ బెన్జీని దర్షకత్వం లో అయనే కధానాయకుడిగా నటించిన సినిమా ఇది !!
ఇది కూడా రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యం లో నడుస్తుంది … కా పోతే ఇందులో కామెడీ కూడా ఉందండొయి .. ఇది ఇటా్లియన్ సినిమా .
ఇందులో నాయికా నాయకుల ప్రేమ కంటే తండ్రీ కొడుకులే ప్రేమే మిమ్మల్ని మరింతగా ఆకట్టు కుంటుంది !!
సినిమా అంతా హాయిగా సాగిపోయినా … క్లైమాక్స్ మాత్రం గుండెల్ని పిండేస్తుంది !!
26) ష్రెక్ (2001) —
ఇదేంటి పిల్లల ఆనిమేటెడ్ సినిమా అయిన ష్రెక్ ఇందులో చేర్చాడేంటీ అని తిట్టుకుంట్టున్నారా ??
సినిమా మరో చూసి తిట్టండి చూద్దాం !!
ఇది నిజంగా రొమాంటిక సినిమా నే నా ద్రుష్టిలో …
ఇందులో క్లైమాక్స్ నాకు చాలా ఇష్టం …
ఆనిమేటడ్ సినిమాల్లో మరో రొమాంటిక్ సినిమా ఆంట్జ్ వీలైతే దాన్ని కూడా ఒక లుక్కెయ్యండి
27) ఎ వాక్ ఇన్ ద క్లౌడ్స్ (1995) —
ఈ సినిమా కధ కూడా రెండవ ప్రపంచ నేపధ్యం లో నే జరరుతుంది , కాక పోతే ఇందులో యుద్ధం మేయిన్ స్ట్రీం కధలో ఉండదు !!
మాట్రిక్స్ లో నియో ద వన్ గా ఏజెంట్ స్మిత్ ఫైటింగ్ ఇరగ దీసిన కియానూ రీవ్స్ ఈ సినిమాలో రొమాంస్ లో కూడా ఇరగదీసాడు !!
మన చిరంజీవి గారి బావగారు బాగున్నరా ఈ సినిమా కాపీయే .. ఈ పాటికే సినిమా కధ చూచాయ గా అర్ధం అయ్యుంటుంది అనుకుంటా ??
కియానూ రీవ్స్ సినిమాలు స్వీట్ నవంబర్ , లేక్ హౌస్ కూడా నాకు చాలా ఇష్టం కాని ఎందుకో లి్స్ట్ లో చేర్చ బుద్ది కాలేదు !!
28) చాక్లేట్ (2000) —
ఈ సినిమా కి జానీ డెప్ , జూడీ డెంచ్ , కారీ అన్నీ మోస్ , ఆల్ఫ్రెడ్ మొలీనా లాంటి పెద్ద స్టార్ కాస్టే ఉంది ..
సినిమా కధ కొస్తే .. మారు మూల ఫ్రెంచి గ్రామం లోకి తన కూతురితో కొత్త గా వచ్చిన వియాన్నే (ఆల్ఫ్రెడ్ మొలీనా) , అక్కడ ఒక చాక్లేట్ కొట్టు పెడుతుంది !! అందరి మన్ననలూ పొందినా గ్రామ పెద్దకు మాత్రం ఈవిడ చేసే పనులు నచ్హవు … ఇంతలో జాని డెప్ రంగ ప్రవేశం చేస్తాడు ..ఇక వాల్ల మధ్య నడిచే ప్రేమే సినిమా !!
29 ) సింగిన్ ఇన్ ద రైన్ (1952) –
ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఇలాంటి వాటినే చూసి అంటారు … అంది హాలీఉడ్డైనా …. తెలుగు సినిమా అయినా ఓల్డ్ గోల్డే …. కాదు ప్లాటినమే ….
ఈ సినిమా రొమాంస్ కంటే పాటలే చాలా బావుంటాయి …. సినిమా మొత్తం పాటలే …
నాకిష్టమైన పాటలు …. టైటిల్ సాంగ్ …సింగిన్ ఇన్ ద రైన్ ….
ఆల్ ఇ డూ ఇస్ డ్రీం ఆఫ్ యూ …
గుడ్ మార్నినింగ్ …
30) మై సాస్సీ గర్ల్ (2001) —
ఇదో కొరియన్ సినిమా ….
లిస్ట్ లో ఉన్న వాటన్నిటి లో కి నాకు ఇష్టమైన సినిమా ఇది !!

నాకు ఈ సినిమా విపరీతంగా ఇష్టం ….నా ఆల్ టైం ఫేవరేట్ సినిమాల్లో ఇది తప్పక ఉంటుంది !!
ఎందుకో ఇక్కడ దీని గురించి రాయ బుద్ధి కావట్లేదు …
డీటేల్డ్ గా మరో పే…..ద్ద పోస్ట్ రాసు కొస్తా ఈ సినిమా గురించి !!
ఇదీ నా లిస్ట్ …. చాలా మిస్స్ చేసి ఉండొచ్చు … చెప్పాను గా గుర్తున్నవి … నేను చూసినవి …. నాకు నచ్చినవి ఇందులో చేర్చాను
సబ్రీనా అనే సినిమా కూడా బావుటుంది కానీ ఎందుకో చేర్చ బుద్ది కాలేదు …
ఇక తెలుగు లో కూడా బోల్డు సినిమాలు ఇష్టం అన్నీ రాయలేం కదా అందుకే చర్చ లేదు …
సో మీ భార్యలతో .. భర్తలతో … గర్లఫ్రెండ్లతో … బాయ్ ఫ్రెండ్ తో నో కూర్చొని హాయిగా వీలైనన్ని చూసెయ్యండి …
(భార్యలు , భర్తలు అని లు వాడేసినంత మాత్రానా అపార్ధం చేసుకొకం డే …. ) !!
ఇష్ యూ ఎ ఎరీ యాప్పీ ఆలంటైన్స్ దినం …………………….
ఇది నా డ్రూ కి ……
. [red][b]
_________హాప్పీ వ____________హాప్పీ వల
______హాప్పీ వలెంటైం_______హాప్పీ వలెంటైంస్
____హాప్పీ వలెంటైంస్ డే___హాప్పీ వలెంటైంస్ డే
___హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంట_______హాప్
__హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంట_________హాప్
_హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్_______హాప్
_హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే ______హ
హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హాప్__హాప
హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ _హ
హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వల
హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వల
_హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ
__హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హాప్ప
____హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్ డే హా
______హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెంటైంస్
_________హాప్పీ వలెంటైంస్ డే హాప్పీ వలెం
____________హాప్పీ వలెంటైంస్ డే హాప్ప
______________హాప్పీ వలెంటైంస్ డే
_________________హాప్పీ వలెంటై
___________________హాప్పీ వల
_____________________హాప్పీ
______________________హాప్
_______________________హా
























6 స్పందనలు so far ↓
ప్రవీణ్ గార్లపాటి // ఫిబ్రవరి 14, 2007 వద్ద 2:29 అపరాహ్నం |
అదిరిందండీ మీ టేస్టు. ఏంటబ్బా “You Got Mail” ఇందులో లేదు అనుకుంటుండగా అది కూడా వచ్చేసింది. ఈ పొస్టు ని del.icio.us కి అంకితం చెయ్యాల్సిందే
“ష్రెక్” విషయంలో నేను మీ సైడే.
ఇందులో చాలా మటుకు నేను చూడనివే. నేను romantic కాదన్నమాట. ఇక మొదలెట్టాలి మరి
మీ డ్రూ మీకు తొందర్లో దొరకాలని ఆశిస్తూ…
Krishh Raem // ఫిబ్రవరి 14, 2007 వద్ద 4:25 అపరాహ్నం |
thanks !!
kiran kumar Chava // ఫిబ్రవరి 14, 2007 వద్ద 5:24 అపరాహ్నం |
aatma balaM == ghost ?
Ramanadha Reddy // ఫిబ్రవరి 14, 2007 వద్ద 8:59 అపరాహ్నం |
Eternal Sunshine… గురించి ఇంతకుముందొక సారి మీ బ్లాగులోనే చదివాను. మళ్లీ ఇక్కడ చూసి DVD తెచ్చుకొన్నాను. ఇంకా చూడలేదు. తీరికగా చూసి ఎంత నచ్చితే అన్ని ధన్యవాదాలు చెబుతాను. మళ్లీ కలుద్దాం.
Krishh Raem // ఫిబ్రవరి 15, 2007 వద్ద 7:58 పూర్వాహ్నం |
@ చావా గారు !!
హా … కరెక్ట్ అండీ …
ఆత్మ బలమే ఘొస్ట్ !!
అక్కడ మంత్రగత్తె గా వూఫీ గోల్డ్ బర్గ్ నటించింది !! ఇక్కడ కైకాలా సత్యనారాయణ గారు చెసారు ఆ రోల్ !!
@ రానారె –
అది కాస్త కాంప్లెక్స్ మూవీ కాబట్టి మొదటి సారి చూసి అర్ధం కాకపోతే మాత్రం తిట్టుకోకండే !!
Santhosh // జులై 22, 2008 వద్ద 5:35 అపరాహ్నం |
nenu choodalisanvi chala vnavi andhukey nenu emi chepalekapothunanu