సంభవామి యుగే యుగే

ఏప్రియల్ 2007 నుండి టపాలు

మణి రత్నం

ఏప్రియల్ 30, 2007 · అభిప్రాయములు

ఈ పోస్ట్ రాయడానికి కారణం వెంకట్ గారి 24ఫ్రేములు, 64కళలు లో మణి రత్నం పై రాసిన ఆర్టికల్ , ఆయన దాన్ని పూర్తి చేయక ముందే నేను రాయడం తప్పనుకోండి కానీ ఎందుకో మనసాగలేదు , కారణం నేను మణి రత్నం గారిని మరీ అంత గొప్ప డైరెక్టర్ గా చూడక పోవడం , ఆయన కాస్త overhyped, overrated అనిపిస్తుంది , ఆయన కచ్చితంగా మంచి డైరెక్టరే ,కానీ నాకెందుకో ఆయన సినిమాలు కొన్ని మరీ గొప్పగా అనిపించలేదు !! కబట్టి అందరూ మొదట ఆ మంచి ఆర్టికల్ చదివి ఈ సుత్తి కి రండి !!

మణి రత్నం మొదటి నాలుగు సినిమాలు నేను చూళ్ళేదు (పల్లవి అనుపల్లవి , ఉన్నారు , పాగల్ నిలవు , ఇదయ కోవిల్ ) కాబట్టి వాటి మీద నో కామెంట్స్ .

మౌన రాగం — చాలా డీసెంట్ సినిమా , ఇలాంటి సినిమాలు తెలుగు లో కూడా అప్పటికీ చాలా వచ్చినా , స్క్రీన్ ప్లే పరంగా .. ఇది కాస్త ఎడ్జ్ ఓవర్ విన్నర్ .. వెంకట్ గారనట్టు అప్పట్లో వచ్చిన మరో తమిళ సినిమా కు ఇది కొంత కాపీ అని విన్నాను , దీని తరువాత ఆయన చాలా సినిమాలు ఇతరుల సినిమాలనుంచి inspire అయినవే , కొంత వరకూ కాపీ కూడా అనొచ్చు !! నన్ను అడిగితే అదే అంటాను !! రేవతి గారి ఆక్టింగ్ ఇందులో నిజంగా సూపర్ !! shez one of my fav actors in indina cinema.

నాయకన్ — ఎవరెన్ని చెప్పినా .. నేను మాత్రం ఇది కచ్చితంగా గాడ్ ఫాధర్ కాపీ అనే అంటాను, అందులో ఒక ఇటాలియన్ అమెరికా లో మాఫియా డాన్ గా ఎదిగితే .. ఇందులో ఒక మదరాసి .. బాంబే లో డాన్ గా ఎదుగుతాడు , ఇక ఇందులో సీన్లు చాలా వరకు మక్కీ కి మక్కీ దించక పోయినా …స్క్రీన్ ప్లే … టేకింగ్ … ఇలా చాలా వరకు కాపీ యే … కాపీ అయినా ఇండియన్ నేటివిటీ కి ఈ సబ్జెక్ట్ ఆపాదించి తీసి హిట్ చెయ్యడం గొప్ప కాదా అనవచ్చు …. కచ్చితంగా కాదు … గాడ్ ఫాథర్ లాంటి సబ్జెక్ట్ , విభిన్న జాతూల తో ఒక మిని ప్రపంచం గా అలలారుతున్న మన భారతదేశానికి అతికినట్టు సరిపోతుంది .. కాబట్టి అందులో గొప్ప దనేమీ లేదు … ఆ మాటకొస్తే మణి రత్నం కంటే రాం గోపాల్ వర్మా నే కొంత వరకూ బెటరూ … ఆయన కనీసం సర్కార్ , నన్ను inspire చేసిన గాడ్ ఫాథర్ కి ఫ్రాంసిస్ ఫోర్డ్ కొప్పోలా కి నేను అర్పిస్తున్న గురు దక్షిణ అని ప్రకటించుకున్నారు … మణి మాత్రం అది కాపీ కానే కాదు అని మంకు పట్టు పడుతున్నాడు .
పైగా నాయకన్ TIME ప్రకటించిన 100 గ్రేటెస్ట్ ఫిలంస్ ఎవర్ మేడ్ లిస్ట్ లో … ఉంది దీనికి కచ్చితంగా ఆ అర్హత లేదు … అందులో డౌట్ లేదు .

ఘర్షణ / అగ్ని నక్షత్రం —– అసలు ఈ సినిమా ఎందుకు తీసాడో మణి రత్నానికే తెలియాలి , బేకార్ సినిమా నన్ను అడిగితే … ఇందులో హాస్పిటల్ సీన్ లో ప్రభు , కార్తీక్ వాళ్ళ నాన్న ని రూం మార్చి , మెట్ల దగ్గర కాపు కాసే సీన్ .. గాడ్ ఫాథర్ నుంచి మక్కి కి మక్కి దించేసారు మణి ‘రతనం’ గారు …..

అంజలి —- ఈ సినిమా కు ఒక ఇంగ్లీష్ నవల ఆధారం , కొన్ని సీన్లు స్పీల్ బర్గ్ E.T నుంచి inspire అయ్యాయి , ఇందులో చిన్నారి షామిలీ అక్టింగ్ నిజంగా సూపర్ , రేవతి సినిమా కి మరో అసెట్.

దళ పతి —- ఈ సినిమా లో ని రజనీ , మమ్ముటి , అరవింద్ స్వామీ పాత్రలు మహా భారతం లో కర్ణుడు , ధుర్యోధనుడు , అర్జునుడి పాత్రలను తలపిస్తాయి , కధ కూడా కొంత వరకూ అలానే ఉంటుంది , ఇందులో మమ్ముటి పాత్ర మధ్యలో వీక్ అయినట్టు అనిపిస్తుంది , కొంత సైకోటెరిక్ గా కూడా అనిపిస్తుంది . దీని పై 1960’s లో వచ్చిన హాలీవుడ్ గాంగ్ స్టా సినిమాల ప్రభావం చాలా వరకూ ఉందనిపిస్తుంది .

గీతంజలి —- ఒప్పుకుంటా … ఈ సినిమా నిఝాంగా చాలా బావుంటుంది … పైగా ఇందులో నాగార్జునా ఉన్నాడు అందుకే నో కామెంట్స్ . ;)

రోజా — దళ పతి మహా భారతం నుంచి inspire అయినట్టే ఇది మైధలాజికల్ కారెక్టర్ సావిత్రి కధ నుంచి inspire అయ్యింది , కాక పోతే అక్కడ యముడు , ఇక్కడ టెర్రరిస్టు , అందులో సావిత్రి పట్టు దల చూసి యముడు కరిగి పోతే … ఇక్కడ అరవింద్ స్వామి మాటలకి టెర్రరిస్టు
ice అయి పోయాడు … కానీ ఇందులో జెండా తగుల బెట్టే సీన్ చూస్తే మాత్రం … రక్తం ఉడికి పోతుంది .

దొంగా దొంగా — రాం గోపాల్ వర్మా , మణి రత్నం కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నరంటే … అది ఏ రేంజి లో ఉందో అనుకుంటాం , నిజం చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా సూపర్ గ ఉంది అనిపించింది , కానీ ఇప్పుడు చూస్తే … యా….క్ ….

బాంబే —- హమ్ ..మ్…..మ్..మ్ ఈ సినిమా కి ఏం వంకలు పెట్టొచ్చబ్బా ?? ;) , రియల్ ఇంసిడెంట్ నుంచి inspire అయ్యింది … పైగా చాలా మంచి వర్క్ … కాబట్టి నో కామెంట్స్ .

ఇద్దరు — తమిళ నాడు రాజకీయల ఆధారంగా తీసిన సినిమా ఇది !! పర్లేదు బానే ఉంటుంది !!
చాలా చోట్ల కధ మరీ పర్సనలైజ్ చేసినట్టు అనిపించింది , కధనం కూడా స్లో …. ముఖ్య పాత్రల మధ్య వైరం కూడా సినిమాలో వేగం తేలేక పోయింది !!

దిల్ సే — చూళ్ళేదు , నో కామెంట్స్ !! :)

సఖి — పర్లేదు మంచి సినిమా … కాక పోతే .. ఇలాంటి వి బోల్డొచ్చాయి కాబట్టి లైట్ .. :)

అమ్రుతా — తమిళ టైగర్ల పోరాట నేపధ్యం లో సాగుతుంది … మొదటి అర్ధ గంట తరువాత సినిమాలో వేగం పెరిగింది కానీ , ప్లాట్ లో ని కాంప్లెక్సిటీ సరిగ్గా హండిల్ చెయ్య క పోవడం వల్ల నేమో మధ్యలో డైల్యూట్ అయినట్టు అనిపించింది !!
కానీ ఇందులో మాధవన్ , సిమ్రాన్ పాత్రలు చాలా బాగున్నాయి , సిమ్రాన్ ఒక తల్లి గా తన అమ్రుతకు సహాయ పడుతుంటే …. మాధవన్ మాత్రం తన రీసెర్చి కి కూడా పనికివస్తుంది అన్న రీతిలో ఉంటాడు , ఒక డెడికేటెడ్ రచయిత , తన లోని తండ్రి పాత్రను అధిగమించి అమ్రుత కు సహాయ పడుతుంది !!

యువ — ఈ సినిమా లో హీరోల ఇంట్రడక్షన్ సీన్ చూసి అందరూ … మాకి కిరి కిరి ఏం తీసాడు మావా అన్నారు .. తీరా చూస్తే మెక్సికన్ సినిమా అమెరోస్ పెరురోస్ నుంచి కాపీ పేస్ట్ చేసారు … సరే ఆ సీన్ వదిలేసి సినిమా అన్నా గొప్పగా ఉందా అంటే అదీ లేదు …. పాలిట్రిక్స్ లో యువత అనే మంచి కాచీ సబ్జెక్ట్ తీసుకొని ఊదేసారు , సినిమా లో బేసిక్ ఎలిమెంట్స్ చాలా మిస్స్ అయినట్టు అనిపించాయి .

గురు — Orson Welles తీసిన సిటిజన్ కేన్ చూసొచ్చి ఈ సినిమా చూడండి , కధా కధనాలు వేరైనా … కారెక్టర్ పరంగా … విజువల్స్ పరంగా .. స్క్రీన్ ప్లే పరంగా ఎన్ని సారూప్యతలు ఉన్నాయో మీరే గడ గడా చెబుతారు , ఇక అభిషేక్ అయితే Orson లాగా ఆక్ట్ చేడానికి తెగ కష్టపడ్డాడు పాపం , ఇందులో లైటింగ్ టెక్నిక్స్ అంతకు ముందే వచ్చిన స్పీల్ బర్గ్ సినిమా మ్యూనిక్ లైటింగ్ ఎఫెక్ట్స్ ని గుర్తుకు తెస్తాయి . దీన్ని ధీరూ భాయి అంబానీ జీవితం ఆధారంగా తీసారు. ఎందుకో నాకు పెద్దగా నచ్చలేదు !! ఒక రకంగా చెప్పాలంటే మన వాళ్ళు బయోగ్రఫీ సినిమాలు తీయలంటే ఇంకా చాలా ఎదగాలి !! ఈ సినిమా ఈ సం వ మన దేశం తరుఫున ఆస్కార్ కి పంపిస్తారట , చూద్దాం ఏ చేస్తాడో మన గురూ గారు !!

మొత్తానికి నే చెప్పేదేంటంటే మణి రత్నం కచ్చితంగా ఇండియా లో ఉన్న గొప్ప ఫిలిం మేకర్స్ లో ఒకరు కానీ ఆయన కున్న పేరు చాల వరకు Hype మాత్రమే , మరీ అంత ఒరిజినాలిటీ క్రియేటివిటీ ఏం లేవు , అలా అంటే గొప్ప గొప్ప దర్శకులు చాల మంది నిజ జీవితం లోని సంఘటణల నుంచే స్పూర్తి చెంది సినిమాలు తీసారనుకోండి , కానీ ఎందుకో మణి ని అందులో చేర్చ బుద్దికావట్లేదు .. పైగా ఆయన సినిమాల్లో ఇళయరాజా , బాలూ మహేంద్రన్ , పీ సీ శ్రీ రాం , శ్రీకర్ ప్రసాద్ లాంటి వారి పాత్రలు మరువలేనివి. నన్ను అడిగితే ఆయన మంచి డైరెక్టర్ కంటే మంచి మార్కెటింగ్ నిపుణుడు అంటాను నేను … దాని కి గురూ మార్కెటింగే సాక్ష్యం , 12 కోట్ల తో తీసిన సినిమాకి రిలీజ్ కాక మునుపే పాతికోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టున్నాడు మరి … మణి రత్నమా మజాకా ….

PS : ప్రతీ విశయాన్ని వంకర బుద్ది తో చూసే వారు ఉంటారు , కొంత వరకూ అయితే క్రిటిక్ అంటారు , మరీ శ్రుతి మించితే సినిక్ అంటారు , కాబట్టి నా లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉండనే ఉంటారు , కాబట్టి వళ్ళని లైట్ తీసుకొని ఆమిర్ తో మణి గారి నెక్స్ట్ సినిమా లజ్జో కి రెడీ అవ్వండి !!

PS 2 : This post is not inteneded to hurt any ones feelings , every thing above quoted and said are strictly my personal opinions not intended to hurt any one , or degrade any one , but if any one still feels hurted .. I DON’T CARE ;)

వర్గాలు క్రిటిక్స్ · డైరెక్టర్లు · సినిమాలు

మార్నింగ్ రాగా …

ఏప్రియల్ 28, 2007 · అభిప్రాయములు

ఈ పోస్టు మార్నింగ్ రాగా సినిమా గురించి కాదు , నన్ను ఏడిపించిన మార్నింగ్ రాగం గురించి ;) !!

రెండేళ్ళ కిందట నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో (ఇప్పుడు నేను 4th year) మా ఇంటి ముందున్న అపార్ట్మెంట్ లో ఒక ఇంజనీరింగ్ చదివే అమ్మయిల గుంపు ఉండేది … 5 గురు ఉండేవారు ఫ్లాట్ లో …. కొండముచ్చు జాతికి చెందిన రకాలు ….

మామూలుగా 8 కే లేచి కాలేజ్ వెళ్ళే నా స్కెడ్యూలు కాస్తా హాలిడేస్ రావడం తో రెగులర్ స్కెడ్యూల్ కి వచ్చేసింది … రాత్రి పొద్దుపోయేవరకు ఇంటర్నెట్ మీద ఉండి ..పొద్దున లేచే సరికి మధ్యాహనం ఒకటో … రెండో .. అయ్యేది .. మా ఇల్లు డుప్లెక్స్ కావడం తో నా రూం 1st ఫ్లోర్ లో ఉండేది … అదీ నా ఖర్మ కొద్ది … ఆ కోతుల రూం కి ఎదురుగా …
మొదటి రోజు … నేను లేచి బ్రష్ చేసుకోవడానికి బయట బాల్కానీ లోకి రాగానే … MS SUBBALAKSHMI వెంకటేశ్వర సుప్రభాతం వినిపించింది .. కోతుల ఫ్లాట్ లోంచి … హ ..హ .. వీళ్ళు కూడా మన బాపతే అనుకుకొని నవ్వుకున్నాను …. కానీ ఇలా రోజూ అవుతుండడం తో డౌటొచ్చి గమని0చడం మొదలెడితే అసలు విశయం తెలిసింది … వాళ్ళు సుప్రభాతం పెట్టేది నన్ను ఏడిపించడానికి .. తెల్లారింది … మన హీరో గారు లేచారు సుప్రభాతం వినిపించండి సారుకు అన్నట్లు అలా పెట్టేవారు … మొదట్లో ఎంబారసింగ్ గా కూసింత సిగ్గు గా అనిపించింది …. కానీ వాళ్ళకు భయపడేదేంటి … చెంఢాలంగా … అలా చేస్తే ఆ.భా.ని.స (అఖిల భారత నిద్రపోతుల సంఘం ) కి అన్యాయం చేసిన వాడిని అవుతానని , వాళ్ళ గోల పట్టించుకోకుండా నా స్కెడ్యూల్ కంటిన్యూ అయ్యాను …. కానీ వాళ్ళ గోల ఆగ లేదు … పైగా ఎంత వరకూ వెళ్ళారంటే ….” త్వరగా నిద్ర లేవడం వల్ల లాభాలు ” అంటూ నా నిద్ర ను దేశ ఆర్ధిక పరి స్థితి కి లింకు పెడుతూ ఒక 2 పేజీల ఆకాశ రామన్న లెటర్ రాసారు నాకు …దీనికి తోడు మా అమ్మ ‘చూడు సెలవులైనా ఆ అమ్మాయిలు ఎంత చక్కగా పొద్దున్నే లేచి ఎంత చక్కగా చదువుకుంటున్నారో .. ‘ అంటూ విశేశ్కారాలు మొదలెట్టేది …చిర్రెత్తిపోయింది … కానీ ఏం చేయలేని స్థితి … వెళ్ళి నా నిద్ర నా ఇష్టం మీకేంటి బాధ అని లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దామంటే … కనీస పరిచయం కూడా లేదు … పైగా ఐదుగురు ఆడ రౌడీలు … లాగి ఒకటి ఇచ్చారంటే … వా… అనుకుంటూ ఇంటికి వెళ్ళాల్సిందే … చివరకు ఇలా అయితే కాదని బస్స్ స్టాప్ దగ్గర మాటేసి … వాళ్ళల్లో
ఇద్దరు కనిపించ గానే వెళ్ళి అసలేంటి మీ బాధ …. అని అడిగి కడిగి పారేసాను . ఏంమాట్లాడకుండా కిస .. కిస నవ్వుకుంటూ వెళ్ళిపోయారు … అందరూ కలిసి ఏంఅనుకున్నారో ఏమో మొత్తానికి గోల ఆపేసారు , సారీ కూడా చెప్పారు …. మెళ్ళగా మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారనుకోండి .

ఇంతకీ ఈ సుత్తంతా ఎందుకంటే .. ఈ మధ్య CAT exam కి సంభంధించి బెంగళూరు లో IIM ఇంటర్వ్యూలు అట్టెండ్ అయ్యాను .. అక్కడ ఇంటర్వూ లో ” నీకు జీవితం లో ఎదురైన మోస్ట్ ఎంబారసింగ్ సంఘటన ఏది ? అందులోంచి ఎలా బయట పడ్దావ్ ” అని ఓ అడిగారు .. ఈ కధ పూర్తి గా చెప్పేసరికి నా సెలక్షన్ సంగతి దేవుడెరుగు .. జ్యూరీ మొత్తం నవ్వుతూనే ఉన్నారు … ఇప్పుడు మాత్రం మార్నింగ్ రాగా కంటే జ్యూరీ నవ్వులే మరింత ఎంబారసింగ్ గా అనిపిస్తుంది … , ఈ పోస్ట్ చదివి మీరు కూడా అలా ఫీల్ అయితే నేనేమీ చెయ్యలేను … :( , అయితే నాదో ఎదవ కొచ్చనీ మీకు జీవితం లో ఎదురైన అత్యంత ఎంబారసింగ్ సీన్ ఏది ??

వర్గాలు నేను

స.. రి.. గ.. మ.. ప …..

ఏప్రియల్ 13, 2007 · అభిప్రాయములు

స రి గ మ ప … లిటిల్ చాంప్స్ … నిన్న ఈ ప్రోగ్రాం చూస్తున్నంత సేపూ చప్పట్లు కొడుతూనే ఉన్నా …

పట్టు మని పదేళ్ళు కూడా లేవు ఒక్కొక్కల్లకి … కానీ వాళ్ళు పాట ల తో ….. బాలూ .. జానకీ ల ను మరిపించారు …

… మామూలుగా నా రూం లో ప్రాజెక్ట్ వర్క్ తో కుస్తీ పడుతున్న నేను … సడన్ గా … సుశీల గారి

వాయిస్ వినపడే సరికి .. కింద లివింగ్ రూం లోకి పరిగెత్తాను …. చూస్తే సుశీల కాదు … శ్రావ్య అట …

పదేళ్ళు కూడా ఉన్నట్టు లేవు ….. పిట్ట కొంచం కూత ఘనం అని … ఒక రేంజి లో పాడేస్తోంది …

పాట అయ్పోయేసరికి .. చప్పట్లాగలేదు నాకు … కొడుతూనే ఉన్నా ప్రోగ్రాం ముగిసేవరకూ ..

ఆ ఒక్క అమ్మాయే కాదూ అందరూ అంతే … ఒకరికి మించి ఒకరు … సరిలేరు మాకెవ్వరూ అనట్టు పాడేస్తున్నారు …

మధ్యలో …. ఆంకర్ గాడెవడో .. నస పెట్టినా … ప్రోగ్రాం మాత్రం సూపర్ గా ఉంది ….

ఇంతకు ముందు లా సునీతను పెట్టాల్సింది … వీడు పెద్ద నస గాడిలా ఉన్నాడు …

నిన్న మ్యూసిక్ డైరెక్టర్ కోటి .. ఈ రోజు సింగర్ శైలజ లు జడ్జి లు గా వచ్చారు …

మొత్తం 15 మంది లోంచి 9 మందిని సెలెక్ట్ చేసారట ….6 గురు ఎలిమినేట్ అంటే బాధేసింది … అఅందుకే ఆ సెలక్షన్ బిట్ నే చూళ్ళేదు …

ఇలాంటి ప్రోగ్రాములు ఇంకా వస్తే బావుండు …

వర్గాలు ఇడియట్ బాక్స్

రావణుడు – సీత

ఏప్రియల్ 11, 2007 · అభిప్రాయములు

రావణుడు సన్యాసి లా రూపు మార్చి సీతా రాముల కుటీరానికి వచ్చే సీన్ ..

రావణుడు
— భవతీ బిక్షాం దేహి .

సీత — తీసుకోండి స్వామీ ..

రావణుడు — గీత దాటి రామ్మా ..

సీత గీత దాటుతుంది …

రావణుడు — హ .. హా .. నేను సన్యాసిని కాదు .. రావణుడిని ….

సీత —- హ … హా …. APRIL FOOL నేను సీతను కాను పనిమనిషిని ….

ఇది ఇవ్వాలే SMS గా వచ్చింది … నవ్వాపుకోలేక పోయాను …

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ఉంది ….

PS : సీత కి పనిమనిషి లేదు కదా … అంటూ ఎదవ లాజిక్కులు తీయొద్దు , జోక్ ని జోక్ గా నే తీసుకోండి !!

వర్గాలు జోకులు-హైకులు

పాత అడ్వర్టైజ్మెంట్లు

ఏప్రియల్ 8, 2007 · అభిప్రాయములు

ఇవ్వాల చానెల్స్ మారుస్తూ ఉంటే సడన్ గా TIMES NOW లో పాత బజాజ్ ఆడ్ వస్తుడడం తో ఆగిపోయాను చూస్తే హమారా బజాజ్ ఆడ్ ఇంకా గుర్తు రాలేదా అదే నండి
బులంద్ భారత్ కి బులంద్ తస్వీర్ …..హమారా బజాజ్ …. హమారా బజాజ్ …హమారా బజాజ్ …
అంటూ చిన్నప్పుడు ఎప్పుడూ పాడుతూ ఉండేవారు … అప్పుడే మర్చి పోయారా ఎలా మర్చి పోతారు లెండి … మొత్తం దేశం నోట్లో ఎన్నో సం. వా ల పాటు నానిన జింగల్ అది . ఇప్పుడు బజాజ్ కున్న బ్రాండ్ ఇమేజ్ కి ఆ ఆడ్ ఎంత తోడ్పడిందో ఊహించవచ్చు .

ఆ ప్రోగ్రాం లో ఇంకొన్ని మరచిపోలేని పాత ఆడ్స్ గురించి ఇచ్చాడు , చాలా బావుంది ప్రోగ్రాం కాక పోతే సగం నుంచే చూసాను , ప్రోగ్రాం పూర్తి అయినా మనసెందుకో ఊరుకో లేదు , పెన్నూ పేపరూ ముందేసుకుని నాకు గుర్తున్న పాత ఆడ్స్ అన్ని లిస్ట్ రాసుకుంటూ వెళ్ళాను అదే ఈ లిస్టు , ఇంటెర్నెట్ లో వెతికితే కొన్నిటి వీడియోలు కూడా దొరికాయి

YOU TUBE లో హమారా బజాజ్ వీడియో —- http://www.youtube.com/watch?v=oWFSG0YL_mM

ఇక నాకు గుర్తున్న ఆడ్స్ కొన్ని

బజాజ్ బల్బ్స్ —- ” జబ్ మే చోటా బచ్చా తా బహుత్ శారారత్ కర్తా తా …“అనే ఆడ్ గుర్తుందా ?? ఈ ఆడ్ నేను పెద్ద గా చూసింది లేదు , దీని జింగిల్ మాత్రం ఇప్పటికీ హం చేస్తూ ఉంటాను . ఒక వ్యక్తి తన చిన్నపటి నుంచి ముదుసలి అయ్యే వరకూ తన జీవితం లో బజాజ్ బల్బ్స్ గురించి చూపిస్తూ పాడుతుంటాడు , భలే గా ఉంటుంది పాట …. దీని లిరిక్స్ దొరికాయి కాని వీడియో దొరక లేదు … స్చ్ …

ఏక్ అనేక్ ఏక్తా — టైటిల్ చూస్తే ఈ పాటికి గుర్తొచ్చేసి ఉంటుంది .. సూరజ్ ఏక్ చందా ఏక్ తారే అనేక్ హై … అంటూ ఒక అక్క తన తమ్ముడికి మన దేశం వివిధ జాతుల ,మతాల ఐకమత్యం గురించి కల్చర్ గురించి చెప్పే ఈ ఆనిమేటెడ్ ఆడ్ ని ఎవరు మర్చి పోగలరు , ఇది 1978 లోనే 80 వేల బడ్జెట్ తో తీసరంటే ఆశ్చర్యం వేస్తుంది .
ఈ ఆడ్ ఆడియో లింకు — http://as01.coolgoose.com/music/song.php?id=96973
వీడియో లింకు — http://www.youtube.com/watch?v=JukuUNk_cRs

మిలే సుర్ మేరా తుమారా
మన దూర దర్శన్ (రెండు రెండ్ల ఆరు గారి ప్రకారం దూల దర్శన్ :) ) ఈ ఆడ్ తీసింది అంటే చాలా మంది నమ్మరేమో . మొత్తం భారత దేశం లోని సంగీత , నటనా కళాకారులను ఒక చోట చేర్చారు ఈ పాట కోసం … ఈ పాటకి ట్యూన్ కట్టింది ఎవరో ఖాన్ అని గుర్తు , బిస్మిల్లా ఖాన్ గారు అని అనుకుంటున్నాను ..సరిగ్గా గురు లేదు .. దీనికి లిరిక్స్ రాసింది మాత్రం చల్ మేరీ లూనా … భారత ఆడ్ ఇండస్ట్రీ ని మరో మలుపు తిప్పిన ద గ్రేట్ పియూష్ పాండే.

దీని వీడియో లింకు — http://www.youtube.com/watch?v=k7OkWpfTz1U

ఇందులో మంగళం పల్లి బాల మురళీ క్రిష్ణ గారి –
నీ స్వరమూ నా స్వరమూ సంగమమై ….
మన స్వరంగా అవతరించే .. ” అనే తెలుగు లైన్ నాకు ఇప్పటికీ గుర్తే .

నిర్మా — నేను ఇప్పటికీ పాడుకునే మరో ఆడ్ జింగిల్ నిర్మా వాషింగ్ పౌడర్ ది .. వాషింగ్ పౌడర్ నిర్మా … శంకర్ దయాల్ శర్మా … నాకు స్కూల్ లో ఇలా పాడడమే గుర్తు అసలు పాట ఎప్పూడో మర్చి పోయా.

అమూల్ – వీళ్ళవి చాలా వరకూ ప్రింట్ ఆడ్స్ అయినా నాకెందుకో విపరీతంగా ఇష్టం ,ఆడ్ల ల లో వీళ్ళ సటైర్లు అల్టిమేట్ అసలా … ఇక ఆ బుజ్జి పాప బొమ్మ అయితే ఎంత ముద్దుగా ఉంటుందో … వీళ్ళ ప్రింట్ ఆడ్స అన్నీ www.amul.com లో చూడొచ్చు.

వుడ్ వర్డ్స్ గ్రేప్ వాటర్ — ఏంటీ పాప ఏడుస్తుందా …. అయితే వుడ్ వర్డ్స్ గ్రేప్ వాటర్ పట్టు
ఇది కూడా మరో మంచి ఆడ్ .

రస్నా — ఐ లవ్ యూ రస్నా ….. అంటూ బుజ్జి అంకిత చెబుతుంటే ఇప్పటికీ గుర్తే … కాక పోతే పాపం సినిమాల్లో ఇప్పుడు అదే సైజు డ్రెస్సులు వేస్తుంటే బాధేస్తుంది . కాక పోతే సూపర్ ఆడ్ .

ఓనిడా దయ్యం —- చిన్నప్పుడు అన్నం తినక మారాం చేస్తే … ఓనిడా దయానికి పట్టిస్తా నంటూ
అమ్మ బెదిరించేది :) , ఎందుకో మధ్య లో ఆపేసి మళ్ళీ ఈ మధ్య మొదలెట్టారు ఈ దయ్యాన్ని .
ఓనిడా దయ్యం అంటే వెంట నే గుర్తొచ్చేది ముగ్గురు గుండూ రావుల మిరిండా ఆడ్ ఇది కూడా సూపర్ గ ఉంటుంది , యూ ట్యూబ్ లో ఇప్పటికీ కనిపిస్తుంది .

లిరిల్ —– లా .. ల ల ల లా … ల ల ల లా … ల్ల ల్ల ల్ల .. ల్ల ల్లా ల్లా…. అంటూ అప్పటి కేరెన్ లూనెల్ నుంచీ మొన్నటి దీపికా పదుకొనే వరకూ … వాటర్ ఫాల్స్ కింద పాడేసి … మన చేత సబ్బును కొనిపించేసారు … ఈ ఆడ్ ని డిజైన్ చేసింది ద వన్ అండ్ ఓన్లీ అలెక్ పద్మసీ .
సొట్ట బుగ్గల ప్రీతీ జింటా కూడా ఒకప్పుడు లిరిల్ గర్లే ..

ఇక ఫెవికాల్ ఆడ్స్ ని ఎలా మర్చి పోతాం నవ్విస్తూనే చెప్పల్సింది చెప్పేస్తారు ఈ ఫోటో చాలు అది ప్రూవ్ చెయ్య డానికి
మరిన్ని ఫెవికాల్ ఆడ్స్ www.pidilite.com లో చూడొచ్చు !!

మర్చి పోయాను ఆ ప్రోగ్రాం చూస్తుంటే మరో కొత్త విశయం తెలిసింది … నిన్న మొన్నటి వరకూ I am a COMPLAN boy , I am a COMPLAN girl అంటూ మనతో కాంప్లాన్ తాగించింది ఎవరో కాదు ఆయేశా టాకియా , షాహిద్ కాపూర్లే ..
ఇలాంటివే బోల్డు ….. సూపర్ ఆడ్స్ అప్పటికీ ఇప్పటికీ గుర్తుండి పోతాయి ….

వెళ్ళే ముందు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ … వీడియో లేకుండా ..కేవలం మాటలతో నే … అజరామరమైన చార్మినార్ రేకుల ఆడ్

ఏంటి రామయ్యా ధీర్ఘాంగా అలోచిస్తున్నావ్ ??
ఏం లేదు , మా ఇంటికి ..గొడ్ల సావిడి కి ఏ రేకులు వెయ్యాలా అని …
ఇందులో అలోచించడానికి ఏవుంది … నాణ్యమైన వీ మన్నికైన చార్మినార్ రేకులనే వాడు ….
చార్మినార్ ….. చార్మినార్ …..

వర్గాలు ఆడ్స్

ఏప్రిల్ 1 నిజాలు

ఏప్రియల్ 1, 2007 · 1 వ్యాఖ్య

ఒక అమ్మాయికి ప్రపోస్ చెయ్యలంటే ఈ రోజే కరెక్ట్టు !!

ఒక వేళ ఒప్పుకుందనుకోండి సంతోషమే ….

లేదా నో అందనుకోండి ….. అక్కా…. ఏప్రిల్ ఫూల్ అని వేరే అమ్మాయీని వెతికే పనిలో పడొచ్చు !!

కాక పోతే ఆ అమ్మాయి మీకంటే తెలివి మీరిందయ్యి ఒప్పుకునట్టే ఒప్పుకుని

తరువాత ఏప్రిల్ ఫూల్ అందనుకోండి బొక్క మనకే .

అలాగే .. నాన్నారి కి మన పరీక్షల రెజల్ట్ చెప్పడానికి … భార్యామణి కి వడ్డాణం చేయిస్తానని ప్రామిస్ చెయ్యడానికి .

ఇంతకు మించిన తరుణం లేదు .

వర్గాలు జోకులు-హైకులు