ఈ పోస్టు మార్నింగ్ రాగా సినిమా గురించి కాదు , నన్ను ఏడిపించిన మార్నింగ్ రాగం గురించి
!!
రెండేళ్ళ కిందట నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో (ఇప్పుడు నేను 4th year) మా ఇంటి ముందున్న అపార్ట్మెంట్ లో ఒక ఇంజనీరింగ్ చదివే అమ్మయిల గుంపు ఉండేది … 5 గురు ఉండేవారు ఫ్లాట్ లో …. కొండముచ్చు జాతికి చెందిన రకాలు ….
మామూలుగా 8 కే లేచి కాలేజ్ వెళ్ళే నా స్కెడ్యూలు కాస్తా హాలిడేస్ రావడం తో రెగులర్ స్కెడ్యూల్ కి వచ్చేసింది … రాత్రి పొద్దుపోయేవరకు ఇంటర్నెట్ మీద ఉండి ..పొద్దున లేచే సరికి మధ్యాహనం ఒకటో … రెండో .. అయ్యేది .. మా ఇల్లు డుప్లెక్స్ కావడం తో నా రూం 1st ఫ్లోర్ లో ఉండేది … అదీ నా ఖర్మ కొద్ది … ఆ కోతుల రూం కి ఎదురుగా …
మొదటి రోజు … నేను లేచి బ్రష్ చేసుకోవడానికి బయట బాల్కానీ లోకి రాగానే … MS SUBBALAKSHMI వెంకటేశ్వర సుప్రభాతం వినిపించింది .. కోతుల ఫ్లాట్ లోంచి … హ ..హ .. వీళ్ళు కూడా మన బాపతే అనుకుకొని నవ్వుకున్నాను …. కానీ ఇలా రోజూ అవుతుండడం తో డౌటొచ్చి గమని0చడం మొదలెడితే అసలు విశయం తెలిసింది … వాళ్ళు సుప్రభాతం పెట్టేది నన్ను ఏడిపించడానికి .. తెల్లారింది … మన హీరో గారు లేచారు సుప్రభాతం వినిపించండి సారుకు అన్నట్లు అలా పెట్టేవారు … మొదట్లో ఎంబారసింగ్ గా కూసింత సిగ్గు గా అనిపించింది …. కానీ వాళ్ళకు భయపడేదేంటి … చెంఢాలంగా … అలా చేస్తే ఆ.భా.ని.స (అఖిల భారత నిద్రపోతుల సంఘం ) కి అన్యాయం చేసిన వాడిని అవుతానని , వాళ్ళ గోల పట్టించుకోకుండా నా స్కెడ్యూల్ కంటిన్యూ అయ్యాను …. కానీ వాళ్ళ గోల ఆగ లేదు … పైగా ఎంత వరకూ వెళ్ళారంటే ….” త్వరగా నిద్ర లేవడం వల్ల లాభాలు ” అంటూ నా నిద్ర ను దేశ ఆర్ధిక పరి స్థితి కి లింకు పెడుతూ ఒక 2 పేజీల ఆకాశ రామన్న లెటర్ రాసారు నాకు …దీనికి తోడు మా అమ్మ ‘చూడు సెలవులైనా ఆ అమ్మాయిలు ఎంత చక్కగా పొద్దున్నే లేచి ఎంత చక్కగా చదువుకుంటున్నారో .. ‘ అంటూ విశేశ్కారాలు మొదలెట్టేది …చిర్రెత్తిపోయింది … కానీ ఏం చేయలేని స్థితి … వెళ్ళి నా నిద్ర నా ఇష్టం మీకేంటి బాధ అని లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దామంటే … కనీస పరిచయం కూడా లేదు … పైగా ఐదుగురు ఆడ రౌడీలు … లాగి ఒకటి ఇచ్చారంటే … వా… అనుకుంటూ ఇంటికి వెళ్ళాల్సిందే … చివరకు ఇలా అయితే కాదని బస్స్ స్టాప్ దగ్గర మాటేసి … వాళ్ళల్లో
ఇద్దరు కనిపించ గానే వెళ్ళి అసలేంటి మీ బాధ …. అని అడిగి కడిగి పారేసాను . ఏంమాట్లాడకుండా కిస .. కిస నవ్వుకుంటూ వెళ్ళిపోయారు … అందరూ కలిసి ఏంఅనుకున్నారో ఏమో మొత్తానికి గోల ఆపేసారు , సారీ కూడా చెప్పారు …. మెళ్ళగా మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారనుకోండి .
ఇంతకీ ఈ సుత్తంతా ఎందుకంటే .. ఈ మధ్య CAT exam కి సంభంధించి బెంగళూరు లో IIM ఇంటర్వ్యూలు అట్టెండ్ అయ్యాను .. అక్కడ ఇంటర్వూ లో ” నీకు జీవితం లో ఎదురైన మోస్ట్ ఎంబారసింగ్ సంఘటన ఏది ? అందులోంచి ఎలా బయట పడ్దావ్ ” అని ఓ అడిగారు .. ఈ కధ పూర్తి గా చెప్పేసరికి నా సెలక్షన్ సంగతి దేవుడెరుగు .. జ్యూరీ మొత్తం నవ్వుతూనే ఉన్నారు … ఇప్పుడు మాత్రం మార్నింగ్ రాగా కంటే జ్యూరీ నవ్వులే మరింత ఎంబారసింగ్ గా అనిపిస్తుంది … , ఈ పోస్ట్ చదివి మీరు కూడా అలా ఫీల్ అయితే నేనేమీ చెయ్యలేను …
, అయితే నాదో ఎదవ కొచ్చనీ మీకు జీవితం లో ఎదురైన అత్యంత ఎంబారసింగ్ సీన్ ఏది ??
10 స్పందనలు so far ↓
evaro neeku telusu // ఏప్రియల్ 28, 2007 వద్ద 1:58 అపరాహ్నం |
Yuuppie, dat waz da most funniest incident of our lives till now .
We can never ever forget dat , thankz for da fun honey .
“కొండముచ్చు జాతికి చెందిన రకాలు” anthanga badha pettama bangarukonda ?
ROMASHA RAO // ఏప్రియల్ 28, 2007 వద్ద 2:50 అపరాహ్నం |
kondamucchulu aa ??? [:x][:x][:x]
.
mamalni kotulu antaava , sowmya is gonna kill you if she reads this .. doubt ledu ,count your days
archi cheppinattu … it was the most funniest incident of our lives .
by the way heard you made it for iimb congrats ,i knew you would …you rock , so scrapping ms at georgia tech ??
ప్రవీణ్ గార్లపాటి // ఏప్రియల్ 28, 2007 వద్ద 5:23 అపరాహ్నం |
హహహ…
భలే ఉంది మీ కథ/వ్యథ. మీ ఐఐఎమ్ సెలెక్షన్ కి శుభాకాంక్షలు. ఐతే బెంగుళూరు లో కలుద్దాము
రాకేశ్వర రావు // ఏప్రియల్ 29, 2007 వద్ద 5:23 పూర్వాహ్నం |
జార్జియా టెక్ అడమిట్ వచ్చిందా. మంచిది. నాకు ఇక్కడ (టెక్ లో) ఉన్నా రెండేళ్ళు నా జీవీతంలో అతిమధురమైనవి. కాని మీరు ఐఐఐయం కి పోతారనుకుంటా .. డబ్బు బా ఉందిగా అక్కుడ
ఐనా ఎమైనా ప్రశ్నలుంటే నాకు మెయిల్ చేయవచ్చు.
శుభాకాంక్షలు, మీ అడ్మిట్లకు కాదు. మీకున్న ladies fan following కి. keep in touch any way!
S // మే 1, 2007 వద్ద 5:28 పూర్వాహ్నం |
నిజమా! కాస్త విడ్డూరంగా అనిపించినా కూడా … నవ్వాగలేదు. ఇంతకీ ఈ కథ చెప్పిన ఇంటర్వ్యూ లో సీటు వచ్చిందా?
S // మే 1, 2007 వద్ద 5:29 పూర్వాహ్నం |
Oh! IIMB లో వచ్చిందా! Congrats! Double congrats for GATECH admit…
Manaswini // మే 1, 2007 వద్ద 7:29 పూర్వాహ్నం |
Hmmm
Bagundi
Krishh Raem // మే 1, 2007 వద్ద 8:26 పూర్వాహ్నం |
correction : IIM Interview maatrame attend ayyanu admit kaadu !! IIMB naa lanti vallaki vaste daniki inkem value untundhi !!
Gatech matram admit vachindi !!
a picchi pilla edo vagesindi , sorry bloggers , kaanee mee wishesh maatram atte pettunkunta Visa ki panikostayi !!
radhika // మే 1, 2007 వద్ద 2:04 అపరాహ్నం |
ఇంతకీ ఎవ్వరూ వాల్ల వాల్ల జీవితాల్లో ఎంబార్సింగ్ మూమెంట్స్ ని[తెలుగులో ఎమంటారు?]చెప్పలేదేమి?ఎవరన్న చెప్పాకా నేను చెపుదామనుకుంటున్నాను.
Krishna // మే 2, 2007 వద్ద 6:53 పూర్వాహ్నం |
@ radhika గారు
మీరే మొదలెడితే పోలా !!