సంభవామి యుగే యుగే

మే 2007 నుండి టపాలు

The Seventh Seal / ద సెవంత్ సీల్ /Sjunde inseglet, Det (1957)

మే 18, 2007 · అభిప్రాయములు

The Seventh Seal / ద సెవంత్ సీల్ /Sjunde inseglet, Det (1957)

ఇది నాకు తెలిసి one of the most complex and ofcourse the greatest ever made .

దీని డైరెక్టర్ Ingmar Bergman గురించి ఎంత చెప్పినా తక్కువే …. ఇది ఒక స్వీడిష్ ఫిలిం

visuals , photgraphy ఆర్ట్ వాల్యూస్ పరంగా ఇది మే బీ ద గ్రేటెస్ట్ ఇన్ సినిమా హిస్టరీ .

స్థూలంగా కధ చెప్పాలంటే …

ఇది మెడీవల్ పీరియడ్ టైం లైన్ లో సాగుతుంది !!

Antonius Block అనే సైనికుడు , Crusades లో పాల్గొని … విరక్తి చెంది తన అనుచరుడి తో కలిసి తన దేశానికి చేరుకుంటాడు.

కానీ అప్పటికే ఆ దేశం భయంకర వ్యాధులతో అల్లకల్లోలంగా ఉంటుంది …. పైగా ఇతని కోసం డెత్ (మ్రుత్యువు మనిషి రూపం లో / human personification ) అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది …

ఈ క్రమం లో అతను తన జీవీతాన్ని పొడిగించడానికి మ్రుత్యువు తో చెస్ పందెం కాస్తాడు … తను ఓడిపోతానని తెలిసినా … పందెం నెపం తో తన కుటుంబాన్ని ఆఖరి సారి చూసుకోవచ్చని ఈ ఎత్తు వేస్తాడు ….

మ్రుత్యువు తో పోరాడుతున్న సైనికుడు (చెస్ ) లో అసలు ఊహించుకుంటేనే …. అదో రకమైన భయం కమ్మేస్తుంది … సినిమా లో కూడా అలాగే తీసారు Ingmar Bergman.

(మ్రుత్యువు / Death)

సినిమా హిస్టరీ లో 10 గ్రేటెస్ట్ సీన్లు ఎవైనా ఉంటే …. అందులో దీనికి స్థానం పదిలం .

అసలు ఈ సినిమా ని interpret చెయడానికి నాకు చాలా సమయం పట్టింది ….ఇంకా అర్ధం కానివి బోల్డు విశయాలు ఉన్నాయనుకోండి దీంట్లో… ముఖ్యంగా క్లైమాక్స్ …

Ingmar Bergman సినిమాలు అన్ని అలాగే ఉంటాయట , ఆయన సినిమాల్లో ఇదే నా మొదటిది !!

ఈ సినిమా ఇచ్చిన కిక్కు నుంచి తేరుకోవడానికి నాకు 4 రోజులు పట్టింది … కల లో కూడా వెంటాడింది ….

సినిమా లో కొన్ని సీన్లు చాలా intense గా ఉంటాయి … I wouldn’t recommend this flick for amatuer film buffs who haven’t got to watch many extential filims.

(personal experince తో చెబుతున్నా ;) ) ముఖ్యంగా పిల్లల ల తో కలిసి అస్సలు చూడొద్ధు … కానీ మీరు ఆర్ట్ లవర్ అయ్యి , దేవుడు … జీవితం …. ఆత్మ …. అలోచనలు …

లాంటి వాటి గురించి శొధించాలనుకునే వారైతే మాత్రం మీకు ఇది Must Watch.

వర్గాలు డిరెక్టర్లు · సినిమాలు · స్వీడిష్ సినిమా

Good Bye Lenin! / గుడ్ బై లెనిన్ (2003)

మే 18, 2007 · అభిప్రాయములు

Good Bye Lenin! / గుడ్ బై లెనిన్ (2003)

అసలీ సినిమా గురించి మొన్న (13th may) మదర్స్ డే రోజు రాసుండాల్సింది , కూసింత లేట్ అయ్యింది … :)

ఇది కూడా జర్మన్ సినిమా నే … techinical గా మూవీ క్రిటిక్స్ దీనికి ఫుల్ల్ మార్కులు వెయ్యక పోవచ్చు గానీ ..
ఒక ఆవరేజ్ ఫిలిం బఫ్ గా అంతకు మించి ఒక మనిషి గా నేను మాత్రం దీన్ని absolute stellar అంటాను …
ఒక కొడుకు తన తల్లి గురించి పడే తపనే గుడ్ బై లెనిన్!

ఈ సినిమా unification of germany నేపధ్యం లో సాగుతుంది , Christiane …east germany కి చెందిన కమ్మ్యూనిస్ట్ పార్టీ S.P.D కి గట్టి మద్దతుదారు ..

ఓ సారి తన కొడుకు గవర్నమెంట్ వ్యతిరేక రాలీ కొడుకు దెబ్బలు తినడం చూసి 8 నెలల పాటు కోమా లోకి వెల్లి పోతుంది … ఈ 8 నెలల కాలం లో జర్మనీ యూనిఫికేషన్ జరిగి పోతుంది ,

8 నెల తరువాత Christiane కోమా నుంచి తేరుకుంటుంది , కానీ డాక్టర్ ఆమెకు ఎలాంటి షాక్ కలిగించే న్యూస్ చెప్పొద్దని ఆమె కుటుంబానికి సలహా ఇస్తాడు …

తన తల్లి east germany సపోర్టర్ కావడం తో అది ఇక లేదని తెలిస్తే ఎక్కడ షాక్ కి గురౌతుందో నని ,
ఆమె కొడుకు Alex తనకా విషయం తెలియకుండా …
తన కుటుంబం .. స్నేహితుల తో కలిసి ఆమెకు east germany ఇంకా ఉందని నమ్మించడానికి .. చిన్న చిన్న నాటకాలు / అబద్ధాలు చెబుతూ పోతాడు … అవి కాస్తా పోను పోనూ చాలా కాంప్లెక్స్ గా తయ్యారయ్యి కూర్చుంటాయి ,

ఇంతలో Christiane భర్త గురించి కూడా ఆ కుటుంబానికి కొన్ని నిజాలు తెలుస్తాయి …. ఇలా కధ సాగి పోతుంది .

తన తల్లి ని నమ్మించడానికి Alex పడే కష్టాలు మనకు ఒక క్షణం నవ్వు తెప్పించినా … మరు నిమిషం అరె … మనం అతని కస్టాలు చూసి నవ్వామా ?? అని కాస్త సిగ్గు పడతాం !!

ఈ సినిమా ఏమీ పొలిటికల్ సెటైర్ కాదు …. itz all bout human emotions n’ relations.

వర్గాలు జర్మన్ సినిమా · సినిమాలు

Run Lola Run / రన్ లోలా రన్ / Lola Rennt (1998)

మే 17, 2007 · అభిప్రాయములు

Run Lola Run / రన్ లోలా రన్ (1998)

ఇది భాష గా చూస్తే జర్మన్ సినిమా , genre కోణం లో చూస్తే థ్రిల్లర్ , స్క్రీన్ ప్లే ప్రకారం చూస్తే నాన్-లీనియర్ , సినిమా గా చూస్తే మాత్రం గొప్ప సినిమాల్లో ఒకటి !!

ఒక పనిని ఎన్ని రకాలు గా చేయొచ్చో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది …. మన జీవితం లో అతి చిన్న
సంఘటనలు కూడా మన జీవితం లో ఎన్ని మార్పులు తేగలవో (Butterfly effect ) అలోచించి సినిమా తీస్తే ఎలా ఉంటుంది ?? రన్ లోలా రన్ లా ఉంటుంది !!

లోలా …. తన బాయి ఫ్రెండ్ మానీ తో కలిసి స్మగ్లింగ్ / మనీ ట్రాన్స్ ఫర్ బిజినెస్ లో ఉంటుంది , మానీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ని లోలా రీసీవ్ చేసుకునే సీన్ తో స్టార్ట్ అవుతుంది … ఫోన్ లో మానీ తను “ఈ రోజు .. స్మగ్లింగ్ డీలర్ కి ఇవ్వాల్సిన డబ్బు పొరపాటున Train లో పోగొట్టుకున్నాని …. ఎవరో బిచ్చగాడు ఎత్తుకెళ్ళాడని అనుమానంగా ఉందని చెప్తాడు … ఇంకో 20 ని మి ల్లో తను డీలర్ కి డబ్బు ఇవ్వక పోతే అతను నన్ను చంపేస్తాడు …. ఎదో ఒకటి చేయి … నువ్వు 20 ని మి ల్లో Em చేయలేక పోతే నేను పక్కనున్న ,
సూపర్ మార్కెట్ ను దోచేస్తాను నాకు మార్గం లేదు” అని పెట్టేస్తాడు …..

ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండీ బాబూ సినిమా …. పరుగే పరుగు హీరోయిణ్ … సినిమా మొత్తం లోలా పరిగెడుతూనే ఉంటుంది …. సినిమా మూడు పారలల్ Time frames లో సాగుతుంది … అసలు సినిమా ఇలా కూడా తీయవచ్చా అనిపిస్తుంది …. అల్టిమేట్ అసలా … క్లైమాక్స్ ఐతే Mind blowing …

ఈ రకమైన ధీం తో మరి కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి … Krzysztof Kieślowski తీసిన త్రీ కలర్స్ లోని RED లో ఈ

రకమైన పారలల్ time frame ధీం sequence కనిపిస్తయి …. అలాంటిదే మరో సినిమా The Butterfly Effect , Ashton kutcher ది ..
కాక్ పోతే దీని కాంసెప్ట్ కాస్త డిఫరెంట్ .

సినిమా లో లోలా కి తప్ప ఎవరూ పైవోటల్ roles లేవు … lola గా Franka Potente బాగా చేసింది … Bourne Identity , supremacy

చూసిన వారికి తిను పరిచయమే …

ఈ సినిమా డైరెక్టర్ Tom Tykwer పోయిన సం వ తీసిన Perfume కూడా బాగుంటుంది …

ఇతను Nataie Portman తో తీసిన షార్ట్ ఫిలిం The Truth కూడా బాగుంటుంది … కేవలం 7 ని మి ల్లలోనే మంచి కాంసెప్ట్ ప్రెసెంట్ చేసాడు !!

ఆ షార్ట్ ఫిలిం వీడియో లింకు …

వర్గాలు జర్మన్ సినిమా · డైరెక్టర్లు · నా ఫేవరెట్ · సినిమాలు

A tête-à-tête with GOD

మే 15, 2007 · అభిప్రాయములు

ఈ పోస్టు నేను last year నా ఇంగ్లీష్ బ్లాగ్ 19 revolutions లో రాసింది !!

దాని లింకు

http://19revolutions.wordpress.com/2006/05/06/a-tete-a-tete-with-god/

నా పాత Blogger సైట్ లో కూడా ఇది ఉంది

దీని గురించి ఇక్కడెందుకంటే … ఇవ్వాల ఒక బ్లాగ్ దీని కొత్త version choosaa అక్కడ సోర్స్ ఇవ్వలేదు …. అందుకే ఇక్కడ ….

బై ద వే …. నేను నా ఇంగ్లీష్ బ్లాగ్ ని Blogger నుంచి WordPress కి migrate చేసానోచ్ …. దాదాపు ఆరు నెళ్ళైయ్యింది ఇంగ్లీష్ లో పోస్ట్ రాసి …. ఇప్పటినుంచైనా వారానికొక పోస్ట్ అయినా రాయాలని డిసైడ్ అయ్యా ….

తెలుగు ని కూడా మారుద్దామనుకున్నా కానీ ఎందుకో Blogger ని వదల బుద్ధి కావట్లేదు …still Blogger Rocks . ఎందుకో నాకు WordPress లో కొత్త Template upload చేద్దామంటే రావట్లేదు …. ఎన్ని tutorials చదివినా బుర్రకెక్కట్లేదు …
I royally suck at coding !! :) ఎనీ suggestions ?? సపరేట్ Doamin ఉంటే తప్ప WordPress అవసరం లేదనిపిస్తోంది , look n’ feel మాత్రం WordPress లో బావుంది !!

ఇంకో నెల తో నా మొదటి బ్లాగ్ బ్లాగర్ లో స్టార్ట్ చేసి నాలుగేళ్ళు పూర్తవుతుంది (started it in 2003) … కొన్ని కారణాల వల్ల అది డిలీట్ చెయ్యాల్సి వచ్చింది !!

వర్గాలు నేను

My Sassy Girl / మై సాసీ గర్ల్ (2001)

మే 12, 2007 · అభిప్రాయములు

My Sassy Girl tag line —- Wanna Die ??

కొరియన్ సినిమాలంటే అందరికీ కరాటేలూ కుంగ్ – ఫూ లూ మాత్రమే గుర్తొస్తాయి !! నాకు కూడా ఈ సినిమా చూసే వరకూ అదే అభిప్రాయం అనుకొండి !!
కొంత మందైతే ఎంటి కొరియా వాల్లు సినిమాలు కూడా తీస్తా రేటి ….. ఇదెప్పటినుంచి …. అనేస్తారు !!

నేను ఇప్పటి వరకూ చూసిన సినిమా లన్నిటి లోకీ టాప్ 10 గడ గడా చెప్పమంటే …. అందులో ఇది కచ్చితంగా ఉంటుంది !!

ఇక రోమాంటిక్ సినిమాల్లో అయితే ఇది top 3 లో కచ్చితంగా ఉంటుంది .. డౌట్ లేదు ….

ఇది Kim Ho-sik అనే అతను తన ప్రేమ కధను Internet లో సీరియల్ గా పెట్టాడు , అది కాస్తా సూపర్ హీట్టయ్యి కూర్చుంది

.. ఆ కధ డైరెక్టర్ Kwak Jae-young విని ,కూసింత కల్పితం ఆడ్డ్ చేసి సినిమా గా తీసారు , అది ఇంకా పెద్ద హిట్టయ్యి కూర్చుంది !!

హీరో Gyeon-woo (Cha Tae-Hyun) monologue తో కధ మొదలవుతుంది … ఒక సారి అతను Train Station లో బాగా తాగి తూలుతున్న ఒక అమ్మాయి(హీరోయిన్) ని Train కి గుద్దుకోకుండా కాపాడతాడు ఏ నిమిషం లో ఆ ఆమ్మాయిని రక్షిస్తాడో కానీ … అక్కడనుంచి అతని కి కష్టాలే కష్టాలు …. అన్నీ ఫన్నీ కష్టాలే అనుకోండి :) . ఆమె కాస్తా Train ఎక్కాక ఒక అంకుల్ గారి పై కక్కేసి మన హీరో కేసి చూసి “హనీ” అంటూ మూర్చపోతుంది , దీంతో అంకుల్ గారు గర్ల్ ఫ్రెండ్ ని అదుపులో పెట్టుకోలేవా అంటూ విశేశ్కారాలు పెట్టి , జాగ్రత్త గా చూసుకోమంటాడు , ముక్కూ మొహం తెలియని ఆ అమ్మాయిని
భుజానేసుకొని మన Gyeon-woo ఒక హోటల్ లోకి వస్తాడు … ఆ అమ్మాయి ఇంకా మత్తులోనే ఉండగా .. Gyeon-woo ని పోలిసులు కొన్ని అనుకోని పరిస్థుతలలో అరెస్ట్ చేసి తీసుకెల్తారు … మరుసటి రోజు వార్నింగ్ తో వదిలేస్తారు … తర్వాత ఆ అమ్మాయి హీరో విచిత్రంగా స్నేహితులౌతారు …..ఇలా కధ మరిన్ని ట్విస్ట్ ల తో సాగిపోతుంది .

సినిమా మొదటి హాల్ఫ్ అంతా Gyeon-woo ఆ అమ్మాయి తో పడే చిలిపి కష్టాల తో సాగిపోతుంది … సెకండ్ హాఫ్ లో కి వెళ్ళే ముందు … అసలు ఆ అమ్మాయి ఎవరూ , తన గతం ఏంటో కొంత Gyeon-woo కి తెలుస్తుంది …. దీంతో ఆమె బాధ తీరే వరకూ తన తో నే ఉంటానని , తన లో తాను బాస చేసుకుంటాడు. ఇలా సినిమా సాగుతున్న కొద్దీ మనలో ఎదో తెలియని ఆర్ధత్ర పెరుగుతుంది , ఒక రకమైన తీయటి pain మన మనస్సులను కమ్మేస్తుంది ….. క్లైమాక్స్ లోకి వెళ్ళేసరికి మనల్ని మన0 పూర్తి మర్చిపోయి సినిమాలో immerse అయి పోతాం …

సినిమా తీసిన తీరు కూడా నిజంగా గ్రేట్ … ముఖ్యంగా .. Train లో ఇద్దరూ ఆడే సిల్లీ ఆటలూ , హీరోయిన్ shoes ని హీరో వేసుకొని నడిచే సీన్ , ధీం పార్క్ లో సైనికుడి సీన్ … Gyeon-woo heroine date కి చెప్పే పది రూల్స్ , తరువాత ఇద్దరూ Train station లో కలిసే సీన్లు …. చాలా బావుంటాయి , ఇక Gyeon-woo ని మరో కొండ మీదకు వెళ్ళమని హీరోయిన్ మరో కొండ పై నుంచి తన బాధ ను చెప్పుకునే సీన్ అయితే అల్టిమేట్ ….. నా all time great scenes లిస్ట్ లో ఇది కచ్చితంగా ఉంటుంది. కళ్ళు మీకు తెలియకుండానే చెమర్చుతాయి …. . cinema మొత్తం లో కధ లో ఇమిడిపోయి పాత్రల మధ్య సాగే అందమైన sublime కామెడీ మీ pain ని కొంత తగ్గిచవచ్చు.

ఈ సినిమా కి బలం కధా .. కధనం …. ముఖ్య పాత్రలు … పూర్తి నేటివిటి తో కూడిన పాత్రలు అవి … ఎక్కడో కొరియా సినిమా అయినా , మన జీవితాలకూ చాలా దగ్గర అనిపిస్తుంది . ఇక దీని back ground sound track దీనికి మరో పెద్ద అసెట్ట్ ,
soothing గా సాగుతూనే మనకు కలిగే తీయటి pain ను రెట్టింపు చేస్తుంది. హీరోయిన్ పాత్రను మలిచిన తీరు నిఝంగా అత్భుతం … Jun Ji-hyun ఒక రకంగా ఆ పాత్ర కు ప్రాణం పోసింది అనొచ్చు …. ఈ సినిమా లో ఈమె performance కి నే ఫ్లాట్
అయ్యి , తన మిగతా సినిమా లు కూడా ఓ రెండు చూసా !! అందులో Il Mare ఒకటి దీన్నే Hollywood లో Keanu Reeves, Sandra Bullock ల తో THE LAKE HOUSE రీమేక్ చేసారు. ఇక Gyeon-woo పాత్ర వేసిన Cha Tae-Hyun కొరియా లో అప్పటికే పాప్ సంచలనం … అతని కిది మొదటి సినిమా అట ..చాలా బాగా చేసాడు.

దీన్ని english లో Elisha Cuthbert (Girl Next Door fame) , Jesse Bradford (Flags of our fathers) తో రీమేక్ చేస్తున్నారు , Elisha క్యూట్ గా బానే ఉంటుంది కానీ Jun Ji-hyun ని మరిపించాలంటే చాలా కష్టపడాలి … అసలు ఆ సినిమా ని రీమేకే చెయ్యకూడదని నా opinion.

సినిమాలో heroine చెప్పే ఒక డైలాగ్ …

Heroine : You know why the sky is blue ??

Gyeon-woo : b’coz of the sun reflection ……. and …

Heroine : NOPE .. Itz for me … I want it be Blue … so Its Blue …
You know why the fire is hot ?? its for me too .. I want it hot so its hot ..
and do you why there are four seasons in korea ??

Gyeon-woo : దీనంగా …. b’coz of You ..
Heroine : Correct … అసలు నువ్వెందుకు పుట్టావో తెలుసా ?? నా కోసమే …

ఈ సినిమా మిస్స్ అయ్యారంటే జీవితం లో ఒక అద్బుతమైన సినిమా miss అయినట్టే … నేను రివ్యూ సరిగ్గా రాసుండక పోవచ్చు … వీడు ఇలానే అంటాడు అని లైట్ తీసుకోకండి … ఇది really amazing flick , don’t even dare to miss it ……plzzzz…

వర్గాలు కొరియా సినిమా · నా ఫేవరెట్ · రొమాంటిక్ సినిమాలు · సినిమా · సినిమాలు

Krzysztof Kieślowski’s THREE COLORS / త్రీ కలర్స్ – I

మే 11, 2007 · వ్యాఖ్యానించండి

Krzysztof Kieślowski తీసిన The Decalogue. గురించి ఇంతకు ముందే ఇక్కడ రాసా.

ఇదివరకు పోస్ట్ లో చెప్పినట్టు ఇది ఫ్రెంచ్ జెండా లో ఉన్న మూడు రంగుల (BLUE / WHITE / RED ) ,

ఫ్రెంచ్ దేశపు మూడు ప్రధాన విధానా ల(ideals liberty, equality , fraternity) పై

ace director Krzysztof Kieślowski, తీసిన మూడు ఫిలింస్ ,

కాక పోతే వీటిని పొలిటికల్ కధలకు అడాప్ట్ చెయ్యకుండా … పర్సనల్ ఎమోషన్స్ కి అడాప్ట్ చేసి తీసారు !!

Blue (1993) :

ఇందులో Juliette Binoche (Chocolat / English patient fame) ప్రధాన పాత్ర ధారి గా తీసారు.

Julie (Juliette Binoche) ఒక ప్రమాదం లో గొప్ప ఫ్రెంచి కంపోసర్ అయిన తన భర్త ని తన కూతిరిని

కోల్పోవడం తో కధ మొదలువుతుంది , ఆ ప్రమాదం కూడా మనకు స్క్రీన్ మీద చూపించకుండా …

.. బ్రేక్ ఆయిల్ లీక్ అవుతూ చూపిస్తారు , ఇలాంటి మెటాఫర్ సీన్స్ సినిమా మొత్తం అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి !!

సినిమా సాగుతున్నంత సేపూ director Krzysztof Kieślowski Blue కలర్ ని ధీం గా visuals లో ఉపయోగించిన

తీరు నిఝంగా అద్భుతం , హాస్పిటల్ లో Julie ని చూపిస్తూ తన కను పాప్పల్లో doctor ని లీల గా చూపిస్తూ

తీసిన సీన్ సినిమా ధీం మొత్తాన్ని మన కళ్ళకు కడుతుంది , ఇలాంటి సీన్ క్లైమాక్స్ లో కూడా ఉంది !!

హాస్పిటల్ నుంచి బయటపడిన తరువాత Julie తన గత స్మ్రుతులను మరచిపోవడానికి ఇల్లు మార్చేసి ,

పారిస్ వెళ్ళీ పోతుంది , అక్కడ తన భర్త మధ్యలో వదిలేసిన ఒక కంపోసిసన్ ని పూర్తి చేసే క్రమం లో

భర్త స్నేహితుడి తో ప్రేమ లో పడుతుంది , ఇంతలో తన భర్త కి మరో అమ్మయి తో సంభంధం ఉందని తెలుస్తుంది …

ఇలా Julie తన పాత జీవితం లోంచి కొద్ది కొద్దిగా బయటపడుతుంది !!

సినిమా లో పాత్రల్లోని intense psychic emotions ని ప్రేక్షకుడు తట్టుకునేందుకు అక్కడక్కడా blackouts ని

వాడిన తీరు సూపర్ . జూలీ తన భర్త , విధి పై కోపాన్ని ని లాలీ పాప్ పై చూపించే సీన్ , అక్కడక్కడా జూలీ మనస్సు ని

తెలియజేస్తూ సాగే stream of images ఇలాంటి సీన్ల తో సినిమా మొత్తం ఒక visual poesy లా ఉంటుంది.

(Blue లో Juliette Binoche)

ఈ ట్రైలాజీ లో మిగతా సినిమాలు White & Red గురించి next post లో …….

వర్గాలు క్రిటిక్స్ · డైరెక్టర్లు · ఫ్రెంచి సినిమా · షార్ట్ ఫిలంస్ · సినిమాలు

సర్రియల్ సినిమా / Luis Buñuel / Surreal cinema

మే 8, 2007 · వ్యాఖ్యానించండి

చాలా రోజుల తరువాత తీరిక దొరకడం తో డౌన్ లోడ్ చేసి చూడకుండా వదిలేసిన సినిమాల లో కొన్ని

వరుసపెట్టి నాలుగైదు చూసేసా అందులో Los olvidados ఒకటి

దీన్ని Luis Buñuel డైరెక్ట్ చేసారు , ఆయన ఇంకో సినిమా Un chien andalou / An Andalusian Dog

గురించి ఇంతకు ముందు ఇక్కడ ఓ చిన్న పోస్టు రాసాను , కాక పోతే అది షార్ట్ సినిమా ఇది ఫుల్ల్ లెంత్ సినిమా …

Los olvidados .. కచ్చితంగా one of the best flicks I did ever watch , మెక్సికో లో వీధి బాలల నేపధ్యం లో సాగుతుంది కధ …

Italian neorealism స్పూర్తి తో తీసారు ఈ సినిమా , ఇందులో మరీ andalou లో ఉన్నంత సర్రియలిసం లేక

పోయినా అక్కడక్కడా ఆ చాయలు కనిపిస్తాయి.

అసలు సర్రియల్ సినిమా కి Luis Buñuel గాడ్ ఫాధర్ లాంటి వారని పేరు , నేను ఇప్పటి వరకూ చూసిన ఆయన

సినిమాలు andalou , Los olvidados మాత్రమే . ఆయన తర్వాత ఈ genre అంత ఖ్యాతి సంపాదించిన

వారు ఎవరూ లేరంకుంటా , ఇప్పటికీ కేవలం సర్రియల్ genre కే కట్టుబడి సినిమాలు తీసే వారు అక్కడక్కడా

కనిపిస్తారు , అందులో నాకు తెలిసీ ముఖ్యమైన వారు David Lynch ఈయన సినిమాల్లో సర్రియల్ చాయలు

విపరీతంగా కనిపిస్తాయి ముఖ్యంగా Blue Velvet , Mulholland Dr … ఈయనవన్నీ ఫుల్ల్ లెంత్ సినిమాలే …

కాక పోతే సర్రియల్ genre లో చాలా వరకూ కనిపించేవి ఇండిపెండెంట్ షార్ట్ films ఏ .. ఈ కోవ కు చెందిన వారి లో

Guy Maddin ఒకరు .. ఈయన సినిమా The saddest music in the world మాత్రమే చూసా ..బావుంది …

ఇక bruce willis, bradpitt తో Twelve Monkeys , robert de niro తో Brazil సినిమాలు తీసి sci-fi , ఫాంటసీ

సినిమాల డైరెక్టర్ Terry gillam కూడా ఈ కోవకు చెందిన వాడే.

ఆ రెండు సినిమాల్లో కూసింత సర్రియల్ చాయలు కనపడతాయి.

David Lynch సినిమా Blue Velvet పోస్టర్

వర్గాలు డైరెక్టర్లు · షార్ట్ ఫిలంస్ · సర్రియల్ సినిమా · సినిమాలు

ఇంజనీరింగ్ అయిపోయింది

మే 6, 2007 · అభిప్రాయములు

హ హ … హి హి …. హు హూ … హే హే ….

అయిపోయింది .. మొత్తానికి పూర్తి అయ్యింది ….
ఎన్ని సబ్జెక్ట్లూ … ఎన్ని క్రెడిట్లూ … ఎన్ని అసైన్ మెంట్లూ ….
అబ్బబ్బబ్బా … వీటికి తోడూ అటెండెంసూ …
ఎంత కష్టం .. ఎంత నష్టం …. ఏదైతేనే … మొత్తానికి అయ్యింది !!
ఖేల్ ఖతం దుక్నం బంద్ !! డిన్ చిక్ …. డిన్ చిక్ … డిన్ చిక్ …. అంటూ ఇక లైఫ్ అంతా డాన్సింగే ….

అంతారాత్మ —- చస్స్ … నోర్ముయ్యి.. బే … ఇంజనీరింగ్ కష్టమా … ఎవడికి చెబుతున్నావు బే … నిజం చెప్పు అంత ఆనందంగా ఉందా ??

….. లేదు ….. లేదు … అస్సలు బాధ గా లేదు …..

అంతారాత్మ — లాగి ఒకటి పీకి ఇప్పుడు నిజంచెప్పు బే …

….. అవును బాధ గా ఉంది … ఏడుపొస్తోంది ….
రేపట్నుంచి … కాలేజ్ ఉండదు …
చుట్టూ ఫ్రెండ్స్ ఉండరూ …. బీట్ కొట్టడానికి రేఖ ఉండదు … కుళ్ళు జోకు లు వేసి నవ్వించే భరత్ ఉండడు …
బంక్ కొట్టడానికి … బాలాజీ సార్ క్లాస్ ఉండదు … ఆటపట్టించడానికి … జూనియర్లుండరు …
ఇక వర్షం లో ఫుట్ బాల ఆడలేం , క్లాస్ మధ్య లో sms లుండవ్ ….
క్లాస్ కారీడార్ ఖాలీ …. కాంటీన్ ఖాలీ …. బాస్కెట్ బాల్ కోర్టు ఖాలీ … మా మనస్సులే ఖాలీ …
నైట్ ఔట్ కొట్టడానికి రేపు ఎగ్జాం ఉండదు … యెస్స్ సర్ చెప్పడానికి అటెండెంస్ పిలవరు …. చిల్కూర్ లో 100 రౌండ్స్ కొట్టినా రెజల్స్ట్స్ రావు ..
ఇప్పుడన్నీ … ఫ్యూచర్ గురించే పాట్లు … మావా.. రామూ గాడు IBM అంట … అంటే … నా బిందూ US దొబ్బేస్తోంది అని ఇంకోడి ఏడుపు …
పే పాకేజీ లు … వీసా డేట్లు … వీటి గురించే ఇప్పుడు … అలోచన .. తిరిగి చూసుకుంటే …. అబ్బ ఎంత బావుంది ఇంజనీరింగ్ లైఫ్ … దేవుడా … ఇంకొక్క సం వ ఉంటే బావుండు …. కుదరదా ?? పోనీ ఓ రెండేళ్ళు వెనక్కి తిప్ప గలవా … అది కూడా చేయ లేవా ?? వింటున్నవా ??
దేవుడా …. నీ కేం కావాలన్నా ఇస్తా … పాతిక కొబ్బరి కాయలా ?? పాకెట్ మనీ మొత్తమా ?? పోనీ నా సంతోషం లో సగం ?? …


వర్గాలు నేను