హ హ … హి హి …. హు హూ … హే హే ….
అయిపోయింది .. మొత్తానికి పూర్తి అయ్యింది ….
ఎన్ని సబ్జెక్ట్లూ … ఎన్ని క్రెడిట్లూ … ఎన్ని అసైన్ మెంట్లూ ….
అబ్బబ్బబ్బా … వీటికి తోడూ అటెండెంసూ …
ఎంత కష్టం .. ఎంత నష్టం …. ఏదైతేనే … మొత్తానికి అయ్యింది !!
ఖేల్ ఖతం దుక్నం బంద్ !! డిన్ చిక్ …. డిన్ చిక్ … డిన్ చిక్ …. అంటూ ఇక లైఫ్ అంతా డాన్సింగే ….
అంతారాత్మ —- చస్స్ … నోర్ముయ్యి.. బే … ఇంజనీరింగ్ కష్టమా … ఎవడికి చెబుతున్నావు బే … నిజం చెప్పు అంత ఆనందంగా ఉందా ??
….. లేదు ….. లేదు … అస్సలు బాధ గా లేదు …..
అంతారాత్మ — లాగి ఒకటి పీకి ఇప్పుడు నిజంచెప్పు బే …
….. అవును బాధ గా ఉంది … ఏడుపొస్తోంది ….
రేపట్నుంచి … కాలేజ్ ఉండదు …
చుట్టూ ఫ్రెండ్స్ ఉండరూ …. బీట్ కొట్టడానికి రేఖ ఉండదు … కుళ్ళు జోకు లు వేసి నవ్వించే భరత్ ఉండడు …
బంక్ కొట్టడానికి … బాలాజీ సార్ క్లాస్ ఉండదు … ఆటపట్టించడానికి … జూనియర్లుండరు …
ఇక వర్షం లో ఫుట్ బాల ఆడలేం , క్లాస్ మధ్య లో sms లుండవ్ ….
క్లాస్ కారీడార్ ఖాలీ …. కాంటీన్ ఖాలీ …. బాస్కెట్ బాల్ కోర్టు ఖాలీ … మా మనస్సులే ఖాలీ …
నైట్ ఔట్ కొట్టడానికి రేపు ఎగ్జాం ఉండదు … యెస్స్ సర్ చెప్పడానికి అటెండెంస్ పిలవరు …. చిల్కూర్ లో 100 రౌండ్స్ కొట్టినా రెజల్స్ట్స్ రావు ..
ఇప్పుడన్నీ … ఫ్యూచర్ గురించే పాట్లు … మావా.. రామూ గాడు IBM అంట … అంటే … నా బిందూ US దొబ్బేస్తోంది అని ఇంకోడి ఏడుపు …
పే పాకేజీ లు … వీసా డేట్లు … వీటి గురించే ఇప్పుడు … అలోచన .. తిరిగి చూసుకుంటే …. అబ్బ ఎంత బావుంది ఇంజనీరింగ్ లైఫ్ … దేవుడా … ఇంకొక్క సం వ ఉంటే బావుండు …. కుదరదా ?? పోనీ ఓ రెండేళ్ళు వెనక్కి తిప్ప గలవా … అది కూడా చేయ లేవా ?? వింటున్నవా ??
దేవుడా …. నీ కేం కావాలన్నా ఇస్తా … పాతిక కొబ్బరి కాయలా ?? పాకెట్ మనీ మొత్తమా ?? పోనీ నా సంతోషం లో సగం ?? …
8 స్పందనలు so far ↓
జ్యోతి // మే 7, 2007 వద్ద 12:11 అపరాహ్నం |
Heheheh…even my son thinks the same. said goodbye to his bhootbangla(college)..and glad that he need not study for exams, xerox material and all..but feeling bored from the next day…missing everything….all the best ..get into some IIT …B O L
Krishh Raem // మే 7, 2007 వద్ద 1:51 అపరాహ్నం |
@ జ్యోతి గారు
ఓహ్ … మీ అబ్బాయి ఇంజనీరింగ్ గా ..
ఏ కాలేజ్ ??
ప్రవీణ్ గార్లపాటి // మే 7, 2007 వద్ద 2:34 అపరాహ్నం |
అంతే బాసూ…
ఏది లేకపోతే అప్పుడే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంది.
ఎనీవే పై చదువుల్లో పడుతున్నట్టున్నావ్.
the cycle repeats…
కవి కన్నయ్య // మే 7, 2007 వద్ద 4:59 అపరాహ్నం |
dude, forget what you are missing..and make the most out of your present..కాలేజ్ క్యాంపస్ లో అమ్మాయిలకు బీట్ కొట్టలేక పోతున్నావని బాద పడకు..జాబ్ మొదలైతే కంపెనీ కాఫెలో కొట్టొచ్చు బీట్..ప్రిన్చిపాల్, ప్రొఫెసర్ క్యారెక్టర్స్ నీకు ప్రాజెక్ట్ మేనేజర్, టీం లీడ్ ల రూపంలో దర్శనమిస్తారు
have fun and good luck..btw, thanks for taking time to visit my blog.
http://Kavikannayya.blogspot.com
nagola // మే 8, 2007 వద్ద 12:53 పూర్వాహ్నం |
పాతిక కొబ్బరి కాయలా ?? పాకెట్ మనీ మొత్తమా ?? పోనీ నా సంతోషం లో సగం ?? …
లైన్లతో నన్ను పడేశావ్.. నాదీ ఇదే పరిస్థితికదా మరి లాస్టియర్!
anusharaji // మే 9, 2007 వద్ద 4:59 పూర్వాహ్నం |
i exactly know what u r talking about
na engg. ipoyaku naku picchi ekkindi
picchi ante alanti ilanti picchi kadu
get ur self bz…
రాకేశ్వర రావు // మే 9, 2007 వద్ద 7:50 అపరాహ్నం |
the party is over.
బీటువెయ్యడానికి అమ్మాయిలైతే చాలా మంది ఉంటారు కాని ఇక్కడ.
మిగతా మజాలు తక్కువే..
radhika // మే 9, 2007 వద్ద 9:14 అపరాహ్నం |
గుండెల్లో తడి చెంపలని తాకలేదు గానీ కళ్ళని తడిపేసింది.మీరు చెప్పిన అన్ని వదులుకోవడం చాలా బాధాకరం.”తిరిగిరావు కాలేజీ రోజులు” అన్నారెవరో.