సంభవామి యుగే యుగే

My Sassy Girl / మై సాసీ గర్ల్ (2001)

మే 12, 2007 · అభిప్రాయములు

My Sassy Girl tag line —- Wanna Die ??

కొరియన్ సినిమాలంటే అందరికీ కరాటేలూ కుంగ్ – ఫూ లూ మాత్రమే గుర్తొస్తాయి !! నాకు కూడా ఈ సినిమా చూసే వరకూ అదే అభిప్రాయం అనుకొండి !!
కొంత మందైతే ఎంటి కొరియా వాల్లు సినిమాలు కూడా తీస్తా రేటి ….. ఇదెప్పటినుంచి …. అనేస్తారు !!

నేను ఇప్పటి వరకూ చూసిన సినిమా లన్నిటి లోకీ టాప్ 10 గడ గడా చెప్పమంటే …. అందులో ఇది కచ్చితంగా ఉంటుంది !!

ఇక రోమాంటిక్ సినిమాల్లో అయితే ఇది top 3 లో కచ్చితంగా ఉంటుంది .. డౌట్ లేదు ….

ఇది Kim Ho-sik అనే అతను తన ప్రేమ కధను Internet లో సీరియల్ గా పెట్టాడు , అది కాస్తా సూపర్ హీట్టయ్యి కూర్చుంది

.. ఆ కధ డైరెక్టర్ Kwak Jae-young విని ,కూసింత కల్పితం ఆడ్డ్ చేసి సినిమా గా తీసారు , అది ఇంకా పెద్ద హిట్టయ్యి కూర్చుంది !!

హీరో Gyeon-woo (Cha Tae-Hyun) monologue తో కధ మొదలవుతుంది … ఒక సారి అతను Train Station లో బాగా తాగి తూలుతున్న ఒక అమ్మాయి(హీరోయిన్) ని Train కి గుద్దుకోకుండా కాపాడతాడు ఏ నిమిషం లో ఆ ఆమ్మాయిని రక్షిస్తాడో కానీ … అక్కడనుంచి అతని కి కష్టాలే కష్టాలు …. అన్నీ ఫన్నీ కష్టాలే అనుకోండి :) . ఆమె కాస్తా Train ఎక్కాక ఒక అంకుల్ గారి పై కక్కేసి మన హీరో కేసి చూసి “హనీ” అంటూ మూర్చపోతుంది , దీంతో అంకుల్ గారు గర్ల్ ఫ్రెండ్ ని అదుపులో పెట్టుకోలేవా అంటూ విశేశ్కారాలు పెట్టి , జాగ్రత్త గా చూసుకోమంటాడు , ముక్కూ మొహం తెలియని ఆ అమ్మాయిని
భుజానేసుకొని మన Gyeon-woo ఒక హోటల్ లోకి వస్తాడు … ఆ అమ్మాయి ఇంకా మత్తులోనే ఉండగా .. Gyeon-woo ని పోలిసులు కొన్ని అనుకోని పరిస్థుతలలో అరెస్ట్ చేసి తీసుకెల్తారు … మరుసటి రోజు వార్నింగ్ తో వదిలేస్తారు … తర్వాత ఆ అమ్మాయి హీరో విచిత్రంగా స్నేహితులౌతారు …..ఇలా కధ మరిన్ని ట్విస్ట్ ల తో సాగిపోతుంది .

సినిమా మొదటి హాల్ఫ్ అంతా Gyeon-woo ఆ అమ్మాయి తో పడే చిలిపి కష్టాల తో సాగిపోతుంది … సెకండ్ హాఫ్ లో కి వెళ్ళే ముందు … అసలు ఆ అమ్మాయి ఎవరూ , తన గతం ఏంటో కొంత Gyeon-woo కి తెలుస్తుంది …. దీంతో ఆమె బాధ తీరే వరకూ తన తో నే ఉంటానని , తన లో తాను బాస చేసుకుంటాడు. ఇలా సినిమా సాగుతున్న కొద్దీ మనలో ఎదో తెలియని ఆర్ధత్ర పెరుగుతుంది , ఒక రకమైన తీయటి pain మన మనస్సులను కమ్మేస్తుంది ….. క్లైమాక్స్ లోకి వెళ్ళేసరికి మనల్ని మన0 పూర్తి మర్చిపోయి సినిమాలో immerse అయి పోతాం …

సినిమా తీసిన తీరు కూడా నిజంగా గ్రేట్ … ముఖ్యంగా .. Train లో ఇద్దరూ ఆడే సిల్లీ ఆటలూ , హీరోయిన్ shoes ని హీరో వేసుకొని నడిచే సీన్ , ధీం పార్క్ లో సైనికుడి సీన్ … Gyeon-woo heroine date కి చెప్పే పది రూల్స్ , తరువాత ఇద్దరూ Train station లో కలిసే సీన్లు …. చాలా బావుంటాయి , ఇక Gyeon-woo ని మరో కొండ మీదకు వెళ్ళమని హీరోయిన్ మరో కొండ పై నుంచి తన బాధ ను చెప్పుకునే సీన్ అయితే అల్టిమేట్ ….. నా all time great scenes లిస్ట్ లో ఇది కచ్చితంగా ఉంటుంది. కళ్ళు మీకు తెలియకుండానే చెమర్చుతాయి …. . cinema మొత్తం లో కధ లో ఇమిడిపోయి పాత్రల మధ్య సాగే అందమైన sublime కామెడీ మీ pain ని కొంత తగ్గిచవచ్చు.

ఈ సినిమా కి బలం కధా .. కధనం …. ముఖ్య పాత్రలు … పూర్తి నేటివిటి తో కూడిన పాత్రలు అవి … ఎక్కడో కొరియా సినిమా అయినా , మన జీవితాలకూ చాలా దగ్గర అనిపిస్తుంది . ఇక దీని back ground sound track దీనికి మరో పెద్ద అసెట్ట్ ,
soothing గా సాగుతూనే మనకు కలిగే తీయటి pain ను రెట్టింపు చేస్తుంది. హీరోయిన్ పాత్రను మలిచిన తీరు నిఝంగా అత్భుతం … Jun Ji-hyun ఒక రకంగా ఆ పాత్ర కు ప్రాణం పోసింది అనొచ్చు …. ఈ సినిమా లో ఈమె performance కి నే ఫ్లాట్
అయ్యి , తన మిగతా సినిమా లు కూడా ఓ రెండు చూసా !! అందులో Il Mare ఒకటి దీన్నే Hollywood లో Keanu Reeves, Sandra Bullock ల తో THE LAKE HOUSE రీమేక్ చేసారు. ఇక Gyeon-woo పాత్ర వేసిన Cha Tae-Hyun కొరియా లో అప్పటికే పాప్ సంచలనం … అతని కిది మొదటి సినిమా అట ..చాలా బాగా చేసాడు.

దీన్ని english లో Elisha Cuthbert (Girl Next Door fame) , Jesse Bradford (Flags of our fathers) తో రీమేక్ చేస్తున్నారు , Elisha క్యూట్ గా బానే ఉంటుంది కానీ Jun Ji-hyun ని మరిపించాలంటే చాలా కష్టపడాలి … అసలు ఆ సినిమా ని రీమేకే చెయ్యకూడదని నా opinion.

సినిమాలో heroine చెప్పే ఒక డైలాగ్ …

Heroine : You know why the sky is blue ??

Gyeon-woo : b’coz of the sun reflection ……. and …

Heroine : NOPE .. Itz for me … I want it be Blue … so Its Blue …
You know why the fire is hot ?? its for me too .. I want it hot so its hot ..
and do you why there are four seasons in korea ??

Gyeon-woo : దీనంగా …. b’coz of You ..
Heroine : Correct … అసలు నువ్వెందుకు పుట్టావో తెలుసా ?? నా కోసమే …

ఈ సినిమా మిస్స్ అయ్యారంటే జీవితం లో ఒక అద్బుతమైన సినిమా miss అయినట్టే … నేను రివ్యూ సరిగ్గా రాసుండక పోవచ్చు … వీడు ఇలానే అంటాడు అని లైట్ తీసుకోకండి … ఇది really amazing flick , don’t even dare to miss it ……plzzzz…

వర్గాలు కొరియా సినిమా · నా ఫేవరెట్ · రొమాంటిక్ సినిమాలు · సినిమా · సినిమాలు

3 స్పందనలు so far ↓

  • సత్యసాయి కొవ్వలి // మే 12, 2007 వద్ద 1:11 అపరాహ్నం | జవాబు

    హాయ్ క్రిష్, మీరివ్యూ చాలాబాగుంది. మాఅమ్మాయి ఈసినిమా సిడీ తెమ్మంది. నేను కొన్నికొన్నాను, కొన్ని చూసాను. వీళ్ళ సినిమాల ప్లాట్లు వెరైటీగాను, నేటివిటీతోను ఉంటాయి. టీవీ సీరియల్సు కూడా బాగుంటాయి. వీటికి బయటిదేశాల్లో మంచి డిమాండుంది. ఈమధ్య ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలు టైపు వస్తున్నాయి. Gem of the palace అన్న సీరియల్ ఇండియాలో డబ్ అయి వస్తుందని విన్నాను. అవునూ, ప్రవీణూ, మీరూ ఈసినిమాలు ఎక్కడ చూడగలుగు తున్నారు? (english sub titles తోపాటు)

  • సత్యసాయి కొవ్వలి // మే 12, 2007 వద్ద 1:13 అపరాహ్నం | జవాబు

    రెవ్యూ చాలాబాగుంది.

  • Krishh Raem // మే 12, 2007 వద్ద 2:55 అపరాహ్నం | జవాబు

    @ సత్యసాయి కొవ్వలి గారు

    first of all ధాంక్స్ !!
    సినిమాలకు కొదవేమిటండి internet లో బోల్డు ఫోరం లూ , కమ్మ్యూనిటీ లూ డిస్కస్ చేయడానికి !! ఇక చూడడానికైతే ఈ మధ్య హైద్రాబాద్ లో చాలా వరకు దొరుకుతున్నాయి !!
    దొరకనివి , కొనటానికి మరీ కాస్ట్లీ గా ఉన్నవి చూడ్డానికి Torrents , Peer 2peer సాఫ్ట్వేర్లు బోల్డు !!
    ఇక english sub titles కోసం
    http://www.divxsubtitles.net/

    http://www.opensubtitles.org/en

    లాంటి సైట్లు , VOB SUB లాంటి software ఉన్నాయు !!

    ఇక నా లాంటి film fanatics ఇంకేం కావాలి ;)
    Gem of the palace గురించి తెలీదండి !!

వ్యాఖ్యానించండి