Run Lola Run / రన్ లోలా రన్ (1998)
ఇది భాష గా చూస్తే జర్మన్ సినిమా , genre కోణం లో చూస్తే థ్రిల్లర్ , స్క్రీన్ ప్లే ప్రకారం చూస్తే నాన్-లీనియర్ , సినిమా గా చూస్తే మాత్రం గొప్ప సినిమాల్లో ఒకటి !!
ఒక పనిని ఎన్ని రకాలు గా చేయొచ్చో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది …. మన జీవితం లో అతి చిన్న
సంఘటనలు కూడా మన జీవితం లో ఎన్ని మార్పులు తేగలవో (Butterfly effect ) అలోచించి సినిమా తీస్తే ఎలా ఉంటుంది ?? రన్ లోలా రన్ లా ఉంటుంది !!
లోలా …. తన బాయి ఫ్రెండ్ మానీ తో కలిసి స్మగ్లింగ్ / మనీ ట్రాన్స్ ఫర్ బిజినెస్ లో ఉంటుంది , మానీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ని లోలా రీసీవ్ చేసుకునే సీన్ తో స్టార్ట్ అవుతుంది … ఫోన్ లో మానీ తను “ఈ రోజు .. స్మగ్లింగ్ డీలర్ కి ఇవ్వాల్సిన డబ్బు పొరపాటున Train లో పోగొట్టుకున్నాని …. ఎవరో బిచ్చగాడు ఎత్తుకెళ్ళాడని అనుమానంగా ఉందని చెప్తాడు … ఇంకో 20 ని మి ల్లో తను డీలర్ కి డబ్బు ఇవ్వక పోతే అతను నన్ను చంపేస్తాడు …. ఎదో ఒకటి చేయి … నువ్వు 20 ని మి ల్లో Em చేయలేక పోతే నేను పక్కనున్న ,
సూపర్ మార్కెట్ ను దోచేస్తాను నాకు మార్గం లేదు” అని పెట్టేస్తాడు …..
ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండీ బాబూ సినిమా …. పరుగే పరుగు హీరోయిణ్ … సినిమా మొత్తం లోలా పరిగెడుతూనే ఉంటుంది …. సినిమా మూడు పారలల్ Time frames లో సాగుతుంది … అసలు సినిమా ఇలా కూడా తీయవచ్చా అనిపిస్తుంది …. అల్టిమేట్ అసలా … క్లైమాక్స్ ఐతే Mind blowing …
ఈ రకమైన ధీం తో మరి కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి … Krzysztof Kieślowski తీసిన త్రీ కలర్స్ లోని RED లో ఈ
రకమైన పారలల్ time frame ధీం sequence కనిపిస్తయి …. అలాంటిదే మరో సినిమా The Butterfly Effect , Ashton kutcher ది ..
కాక్ పోతే దీని కాంసెప్ట్ కాస్త డిఫరెంట్ .
సినిమా లో లోలా కి తప్ప ఎవరూ పైవోటల్ roles లేవు … lola గా Franka Potente బాగా చేసింది … Bourne Identity , supremacy
ఈ సినిమా డైరెక్టర్ Tom Tykwer పోయిన సం వ తీసిన Perfume కూడా బాగుంటుంది …
ఇతను Nataie Portman తో తీసిన షార్ట్ ఫిలిం The Truth కూడా బాగుంటుంది … కేవలం 7 ని మి ల్లలోనే మంచి కాంసెప్ట్ ప్రెసెంట్ చేసాడు !!
ఆ షార్ట్ ఫిలిం వీడియో లింకు …

6 స్పందనలు so far ↓
నవీన్ గార్ల // మే 17, 2007 వద్ద 12:25 అపరాహ్నం |
కమల్ హాసన్ దర్శకత్వం వహించిన పోతురాజు (విరుమాండి) సినిమాలో ఈ రకం కథనం (స్క్రీన్ ప్లే) ను ఉపయోగించాడు.
ప్రవీణ్ గార్లపాటి // మే 17, 2007 వద్ద 3:21 అపరాహ్నం |
ఓ ఐదారు నెలెల క్రితం రెండు సినిమాలూ చూసాను.
రన్ లోలా రన్ సబ్ టైటిల్స్ లేకుండా చూశా, అంతగా ఎంజాయ్ చెయ్యలేకపోయాను. కానీ కథ లో నావెల్టీ మాత్రం అదరహో. సినిమా మొత్తం పరిగెడుతూనే ఉంటుంది ఒక దగ్గరి నుంచి ఒక దగ్గర వరకు. ఒక్క నిమిషం ముందొచ్చుంటె ఎలా ఉండేది అనే కాన్సెప్ట్, పారలెల్ స్టోరీ లైన్స్ నాకు నచ్చాయి.
అలాగే బటర్ ఫ్లై ఎఫెక్ట్ కూడా, ఫ్రాంక్ గా చెప్పాలంటే అర్థం చేసుకోవడానికి రెండు సార్లు చూడాల్సొచ్చింది
చిన్నప్పుడు ఆ పేలుడు, అప్పుడు ఏం జరిగింది, మధ్య లో ఏం జరిగిందో మర్చిపోయి జర్నల్స్ తిరగేస్తూ అబ్బో అర్థమే కాలేదు సరిగా… తర్వాత మళ్ళీ సారి చూస్తే అర్థమయిందనుకోండి.
మంచి సినిమాలు.
ఇలాంటిదే కథాంశం తమిళంలో లో 12 B అనే సినిమా వచ్చినట్టు గుర్తు.
Japes // మే 17, 2007 వద్ద 3:52 అపరాహ్నం |
“Verumandi” has a different non-linear treatment.. but i dont think its just like “Run LoLa” the difference being…
“Verumandi” is an interpretation of one incident (murder) by three different characters … where as “Run LoLa” seems like a same story being shown on three ( different ) parallel time frames…
they used “Run LoLa” format for a tamil movie (Damn it, i forgot its name)… the story line goes.. the lead has an interview to attend & he’s at a bus-stop & he sees the love of his life… now the time line splits to two… they show 2 different storylines showing what happens if he pursues the girl… also if he takes a bus & attends that interview.. help me out if you get the title.
PS: last sunday i picked up the DVD for “Run LoLa” but i found some other, so i put it back to pick it later this weekend… i guess its time i go pick it up.
Japes // మే 17, 2007 వద్ద 3:53 అపరాహ్నం |
Thanks Praveen… the Title i was look for was “12 B”
కొత్త పాళీ // మే 17, 2007 వద్ద 4:25 అపరాహ్నం |
12బి సినిమా గ్వినెట్ పాల్ట్రొ నిఅటించిన ఒక హాలివుడ్ సినిమాకి కాపీ. ఆ హాలివుడ్ సినిమా మరి దేనికో కాపీ అయుండొచ్చు.
రన్ లోలా రన్ చాలా ఎంజాయ్ చేశాను. ఈ అమ్మాయే నాయికగా ఈ దర్శకుడు తీసిన ప్రిన్సెస్ అండ్ వారియర్ ఒక చక్కని ప్రేమ కథ. మిగతా సినిమాలు చూళ్ళేదు – చూడాలి.
Krishh Raem // మే 17, 2007 వద్ద 6:13 అపరాహ్నం |
@ VIRUMANDI —
Viruamndi had a different kinda
screen play Yup it waz a parallel time frame only the P.O.V is different for chars not plot .
@ 12 B , కొత్త పాళీ గారు
నేను ఆ సినిమా చూళ్ళేదు కాని Japes గారు చెప్పిన
ప్లాట్ బట్టీ చూస్తే itz similar to SLIDING DOORS and yeah it stars Gweneth Paltrow Queen of romantic movies
and yeah princes and warrior waz gud esp. the tracheotamy scene was mind blowing !!