టైటిల్ చూసే అర్ధం అయ్యుంటుంది ఈ పాటికి … చాలా రోజుల్నుంచి రాయాలంకుంటున్న పోస్టు … దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగాయాని … ఎప్పుడొ రిలీస్ అయినా వాటి గురించి ఇప్పుడు ఈ నస !! కొన్ని ఈ లిస్ట్ లో లేవు అంటే బాలేవు అని కాదు ….. వాటి గురించి సపరేటు గా పేద్ద పేద్ద పోస్టులు రాసుకొస్తానని అర్ధం
.
Paprika :
ఇదో జపనీస్ animated ఫిలిం (not animes) , ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఎదో కల లా అనిపించింది , ఇది సినిమానే అని నిర్ధారించుకోవడానికి చాలా సార్లు తల ష్రగ్ చేస్తూనే ఉన్నాను … amazing piece of animation. ఈ సినిమా డిరెక్టర్ Satoshi Kon కి ఇలాంటి సినిమాలు తీయడం కొత్తేమీ కాదు , ఇంతకు మునుపు నేను చూసిన ఈయన సినిమా Millennium Actress అది కూడా బ్రిల్లియంట్ సినిమా అనుకోండి. ఇక Paprika కధ కొస్తే … ఇది పూర్తిగా కలలకు (dreams) సంభంధించిన స్టోరీ … ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది , ఎవరైనా మీ కల లోకి చొరబడితే ఎలా ఉంటుంది ?? Paprika సినిమా లా ఉంటుంది.
ఈ మధ్యే ఈ బ్లాగ్ లో రాసిన Waking Life లా ఇది టూ complexive కాక పోయినా దీనిలో ఉండే surreal , stream of conscience, dream symbolism మెధడ్స్ మన మెదళ్ళని కట్టి పడేస్తుంది.
ఇలాంటి సినిమాలు మరికొన్ని : Waking life , Abre los Ojos / Open your eyes
Knocked Up :
బాచిలర్ హూడ్ …. బిందాస్ లైఫ్ …. వన్ నైట్ స్టాండ్ … ప్రెగ్నెంట్ … షాక్ … పేరెంట్ హుడ్ …. ఇది స్థూలంగా కధ …. అట్టర్లీ ఫన్నీ సర్కాసం (sarcasm) … కొంత మంది దీన్ని క్రాప్ అన్నారు … కానీ నాకు మాత్రం భలే నచ్చ్హేసింది … చాలా సింపుల్ స్టొరీ లైన్ …. పెర్ఫార్మెంసెస్ కూడా అవరేజే …. కానీ మస్త్ మూవీ …. హోల్ సం టైం పాస్ గారెంటీడ్ ….
The Fountain :
ఈ సినిమా చూసి నాలుగు నెలలు అవుతున్నా … దీని గురించి ఇంకా నేనో అభిప్రాయానికి రాలేక పోయా … ఇప్పటి వరకు ఓ మూడు సార్లు చూసా … చూసిన ప్రతీ సారీ ఓపీనీయన్ మారి పోతోంది , కొత్త కొత్త doubts పుడుతున్నాయి …. అన్ని సార్లు చూసినా … ఇంకా చాలా qwestions unanswered.
Xtential , philosophy , time travel , parallel stories ఈ genres అన్నిటి నీ పునికి పుచ్చుకున్న కధ ఈ సినిమాది …ఇలాంటి వాటిని interpret చేయడం కొంచం కష్టం …. ఈ రకం సినిమా ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్ధం / అవగాహన చేసుకుంటారు కాబట్టి ఒక్క పద్ధతి లో interpret చేయడం కష్టం …. ఏదేమైనా ఇంకా బాగా అరగాలి సినిమా నాకు …
కధ విషయానికి వస్తే … వేల సం. వ . రాల టైం స్పాన్ లో సాగుతుంది కధ … అటు మాయన్ సామ్రాజ్యం నుంచి ఈ నాటి టైం లైన్ ని టచ్ చేస్తూ … రేపటి భవిష్యత్తు లోనూ సాగే … లవ్ స్టోరీ … ఈ మూడు కధలు పారలల్ గా సాగుతాయి …. సినిమా కొన్ని చోట్ల ‘Vanilla sky ‘ లాగే మన Consciousness loci ని దాటి వెళ్ళి పోతుంది అనిపించింది … అందుకే చాలా మందికి ఇది మొదట చూడ గానే నచ్చక పోయి ఉండొచ్చు.
అసలు ఈ సినిమా 2002 లోనే రావల్సింది … అప్పట్లో బ్రాడ్ పిట్ట్ , కేట్ బ్లాంకెట్ తో కలిసి ఈ సినిమా నిర్మించాల్సి ఉండగా … మధ్య లో నే రద్దై పోయింది , మళ్ళీ ఇన్నాల్టికి Hugh Jackman , Rachel Weisz తో నిర్మించారు.
అన్నిటి కంటే ముఖ్యంగా Darren Aronofsky is back అదే ఆనందంగా ఉంది …. pi , Requiem for a Dream లాంటి సినిమాలు తీసిన దర్షకుడు … ఇన్ని రోజులు గాప్ తీసుకుంటే ఇంకేమైనా ఉందా ….
Little Miss Sunshine :
ఈ సినిమా నాకు విపరీతంగా నచ్చేసింది !! దీని గురించి ఇక్కడ రాసే కంటే , సెపరేట్ పోస్ట్ రాయడం న్యాయం !!
this-film-is-not-abt-winning-itz-just-all-about-being-yourselves-n’-being-together !!
Children Of Men :
ప్రావీణ్ గారనట్టు ఈ సినిమా తో చాలా మందికి లింకు కుదర లేదు …. దీని కోసం కూడా సపరేటు పోస్ట్ రాయాలి.
Departed :
ఒక్కటి చెప్పొచ్చు Martin Scorsese is bak … ఆయన ఎటర్నల్ wait ఫర్ ఆస్కార్ ఈ సినిమా తో ముగిసింది …. కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే డిపార్టెడ్ కంటే దాని మూలం infernal affairs కొన్ని చోట్ల బాగా అనిపించింది !! అయినా Scorsese లాంటి వారి పై వెలెత్తే ధైర్యం ఎవరికుంది ?? ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ రోలింగ్ స్టోన్స్ రాక్ బాండ్ పై తీయ బోయే రాక్యుమెంటరీ (rocumentary= rock + documentary) కోసం వైటింగ్.
Leonardo DiCaprio కి ఈ 2006 బాగా కలిసొచ్చినట్టుంది , దీంతో పాటు బ్లడ్ డైమెండ్ సినిమాలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపాడు , DiCaprio కూడా ఆక్టింగ్ చేయగలడని ఈ రెండు సినిమాలు చూసాకే తెలిసింది
!!
Jack nicholsan ఎప్పటి లాగే అమేజింగ్ … Mark Wahlberg , Matt Damon కి కూడా బాగా చేసారు … వారికి కూడా పోయినేడు ఏడు Invincible , The Good Shepherd లాంటి హిట్స్ కొట్టారు !!
Bobby :
Robert F. Kennedy హత్య నేపధ్యం లో సాగే హిస్టారికల్ డ్రామా … ఆవరేజ్ సినిమా కానీ ఇక్కడ ఎందుకు దీని గురించి రాయాల్సి వచ్చిందంటే దీని కాస్ట్ గురించి …. ఈ సినిమాలో కాస్ట్ చాలా భారీ గా ఉంది మీరే చూడండి Anthony Hopkins , Laurence Fishburne,Ashton Kutcher, Lindsay Lohan,Demi Moore,Martin Sheen, Sharon Stone n’ Elijah Wood.
గదీ లిస్టు … అందరి ఆక్టింగ్స్ సొ సొ నే (xcluding Anthony Hopkins, Marin sheen ) , మొత్తమ్మీద బోరింగ్ సినిమా అయినా ఈ స్టార్ కాస్ట్ కోఅం ఒక సారి చూడొచ్చు !!
The Queen :
2006 లో వచ్చిన మంచి బయోగ్రాఫికల్ సినిమాల్లో ఇది బెస్ట్ !! ప్రిన్సెస్ డైయానా మ్రుతి నేపధ్యం లో సాగుతుంది కధ … తన సాంప్రదాయ , ఉన్నతమైన అంత:పుర కట్టుబాట్లు … ఈ నాటి పాపారాజీ , సెలెబ్రీటీ కల్చర్ గా మారుతున్న క్రమానికి సాక్షిగా నిలిచిన Elizabeth II మాహా రాణి కధే ఇది. ఈ quasi comedy లో Elizabeth II మాహా రాణి గా హెలెన్ మిర్రెన్
(Helen Mirren) మంచి expressive faces తో నటించారు. Tony Blair గా నటించిన Micheal Sheen పెర్ఫార్మెన్స్ సినిమా కి మరో అసెట్. ఓవరాల్ గా 2006 లో వచ్చిన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లొ ఇదోటి.
Black Book (Zwartboek) :
ఇదో నార్వేఇయన్ (norwegian) వార్ సినిమా ….. దీనీ కధ రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యం లో ఉంటుంది. పేరుకే వార్ సినిమా అయినా ఇందులో లవ్ స్టోరీ నే ఎక్కువ.
ఓకే డోకే మూవీ ….. మరీ అంత సూపర్భ్ ఏమీ కాదు Carice van Houten ఆక్టింగ్ బావుంది. Paul Verhoeven (Basic instinct , robo cop fame) దీని డైరెక్టర్ .
The Prestige :
ఈ సినిమా లో నికోలా టెస్లా కి రోల్ ఉంది అని తెలిసనపట్టినుంచి …. దీని రిలీస్ కోసం కళ్ళు కాయాలు కాసే లా వేచి చూశా. ఇద్దరు మెజీషియన్స్ తమ రహస్యాలు కాపాడుకో్వడానికి ఎంత దూరం వెళ్ళారు అనేది కధ ….. అదమ్మా వర్క్ డెడికేషన్ అంటే … ఊరికే తిని తొగుంట్టే సరిపోదు.
Memento చూసినప్పట్టి నుంచి నాకెందుకో Christopher Nolan అంటే కొంత సాప్ట్ కార్నర్ …. సినిమా లో ట్విస్టులే ట్విస్టులే …..
నేను అన్నిటికన్నా ఆనందించే విశయం …. ప్రపంచం మరచి పోయిన అపర మేధావి …. మా దేవుడూ అయినా నికోలా టెస్లా గురించి ఈ సినిమా ద్వారా మరింత మందికి తెలియడం.
టెస్లా రాక్స్ …. ఏడిసన్ సక్స్ …….
మెజీషియన్ కధ నేపధ్యం లో 2006 వచ్చిన మరో సినిమా Edward Norton starrer THE ILLUSIONIST. సినిమా సో సో అయినా ఎడ్వ్రర్డ్ నార్టన్ నటన కోసం కచ్చితంగా చూడాలి.
The Pursuit of Happyness :
ఇది కూడా బయోగ్ర్రాఫికల్ సినిమా నే …. కాక పోతే రాగ్స్ టు రిచెస్ స్టోరీ అన్న మాట …. Will Smith ఇంత బాగా ఆక్ట్ చేస్తాడనుకోలేదు …. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ….
Live Of Others :
ఇదో జర్మన్ సినిమా , absolute stunner ఫారిన్ లాంగ్వేజ్ కాటగిరీ లో ఆస్కార్ విజేత ….. దీని గురించి రెండు ముక్కల్లో చెప్పడం సాధయం కాదు …. ఒక సపరేట్ పోస్ట్ రాసుకొస్తా …
Stranger than fiction :
మీరు జీవిస్తున్న జీవితం మీది కాదు ….. ఎవరో అజ్ణాత రచయిత రాస్తున్న కధలో పాత్ర అని ….. ఆ పాత్ర ని ఆ రచయిత తొందర్లో చంపేసి (అంటే మీరు చచ్చి పోతారని ) మీకు తెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ?? Harold Crick పరిస్థితి లా ఉంటుంది. మంచి కామెడీ సినిమా ఇది …. visuals కూడా చాలా ప్లీసింగా (pleasing)ఉంటాయి. Will Ferrell నటన బావుంది. సినిమా లో Harold Crick కి Ana Pascal కి మధ్య రోమాన్స్ ని ఇగ్నైట్ చేసే పాట చేసే నాకు విపరీతంగా నచ్చేసింది …. ఈ పాట పాడింది రాసింది Wreckless Eric.
సినిమా లో ఈ పాట సీన్ యూట్యూబ్ లో క్లిప్.
http://www.youtube.com/watch?v=aXAKEeYmUus.
Wreckless version :
http://www.youtube.com/watch?v=DSjwl8lHEVE
మీకు గిటార్ వస్తే ఈ పాట ప్లే చేయడం చాలా వీజీ ….. నేను రెండు రోజుల్లో నేర్చేసుకున్నా …..
2006 లో వచ్చిన మరికొన్ని సినిమాలు ,వార్ సినిమాలు , షార్ట్ సినిమాలు , డాక్యూమెంటరీల కోసం మరో పోస్టు ….
