ఇవ్వాల చానెల్స్ మారుస్తూ ఉంటే సడన్ గా TIMES NOW లో పాత బజాజ్ ఆడ్ వస్తుడడం తో ఆగిపోయాను చూస్తే హమారా బజాజ్ ఆడ్ ఇంకా గుర్తు రాలేదా అదే నండి
“బులంద్ భారత్ కి బులంద్ తస్వీర్ …..హమారా బజాజ్ …. హమారా బజాజ్ …హమారా బజాజ్ … “
అంటూ చిన్నప్పుడు ఎప్పుడూ పాడుతూ ఉండేవారు … అప్పుడే మర్చి పోయారా ఎలా మర్చి పోతారు లెండి … మొత్తం దేశం నోట్లో ఎన్నో సం. వా ల పాటు నానిన జింగల్ అది . ఇప్పుడు బజాజ్ కున్న బ్రాండ్ ఇమేజ్ కి ఆ ఆడ్ ఎంత తోడ్పడిందో ఊహించవచ్చు .
ఆ ప్రోగ్రాం లో ఇంకొన్ని మరచిపోలేని పాత ఆడ్స్ గురించి ఇచ్చాడు , చాలా బావుంది ప్రోగ్రాం కాక పోతే సగం నుంచే చూసాను , ప్రోగ్రాం పూర్తి అయినా మనసెందుకో ఊరుకో లేదు , పెన్నూ పేపరూ ముందేసుకుని నాకు గుర్తున్న పాత ఆడ్స్ అన్ని లిస్ట్ రాసుకుంటూ వెళ్ళాను అదే ఈ లిస్టు , ఇంటెర్నెట్ లో వెతికితే కొన్నిటి వీడియోలు కూడా దొరికాయి
YOU TUBE లో హమారా బజాజ్ వీడియో —- http://www.youtube.com/watch?v=oWFSG0YL_mM
ఇక నాకు గుర్తున్న ఆడ్స్ కొన్ని
బజాజ్ బల్బ్స్ —- ” జబ్ మే చోటా బచ్చా తా బహుత్ శారారత్ కర్తా తా …“అనే ఆడ్ గుర్తుందా ?? ఈ ఆడ్ నేను పెద్ద గా చూసింది లేదు , దీని జింగిల్ మాత్రం ఇప్పటికీ హం చేస్తూ ఉంటాను . ఒక వ్యక్తి తన చిన్నపటి నుంచి ముదుసలి అయ్యే వరకూ తన జీవితం లో బజాజ్ బల్బ్స్ గురించి చూపిస్తూ పాడుతుంటాడు , భలే గా ఉంటుంది పాట …. దీని లిరిక్స్ దొరికాయి కాని వీడియో దొరక లేదు … స్చ్ …
ఏక్ అనేక్ ఏక్తా — టైటిల్ చూస్తే ఈ పాటికి గుర్తొచ్చేసి ఉంటుంది .. సూరజ్ ఏక్ చందా ఏక్ తారే అనేక్ హై … అంటూ ఒక అక్క తన తమ్ముడికి మన దేశం వివిధ జాతుల ,మతాల ఐకమత్యం గురించి కల్చర్ గురించి చెప్పే ఈ ఆనిమేటెడ్ ఆడ్ ని ఎవరు మర్చి పోగలరు , ఇది 1978 లోనే 80 వేల బడ్జెట్ తో తీసరంటే ఆశ్చర్యం వేస్తుంది .
ఈ ఆడ్ ఆడియో లింకు — http://as01.coolgoose.com/music/song.php?id=96973
వీడియో లింకు — http://www.youtube.com/watch?v=JukuUNk_cRs
మిలే సుర్ మేరా తుమారా —
మన దూర దర్శన్ (రెండు రెండ్ల ఆరు గారి ప్రకారం దూల దర్శన్
) ఈ ఆడ్ తీసింది అంటే చాలా మంది నమ్మరేమో . మొత్తం భారత దేశం లోని సంగీత , నటనా కళాకారులను ఒక చోట చేర్చారు ఈ పాట కోసం … ఈ పాటకి ట్యూన్ కట్టింది ఎవరో ఖాన్ అని గుర్తు , బిస్మిల్లా ఖాన్ గారు అని అనుకుంటున్నాను ..సరిగ్గా గురు లేదు .. దీనికి లిరిక్స్ రాసింది మాత్రం చల్ మేరీ లూనా … భారత ఆడ్ ఇండస్ట్రీ ని మరో మలుపు తిప్పిన ద గ్రేట్ పియూష్ పాండే.
దీని వీడియో లింకు — http://www.youtube.com/watch?v=k7OkWpfTz1U
ఇందులో మంగళం పల్లి బాల మురళీ క్రిష్ణ గారి –
” నీ స్వరమూ నా స్వరమూ సంగమమై ….
మన స్వరంగా అవతరించే .. ” అనే తెలుగు లైన్ నాకు ఇప్పటికీ గుర్తే .
నిర్మా — నేను ఇప్పటికీ పాడుకునే మరో ఆడ్ జింగిల్ నిర్మా వాషింగ్ పౌడర్ ది .. వాషింగ్ పౌడర్ నిర్మా … శంకర్ దయాల్ శర్మా … నాకు స్కూల్ లో ఇలా పాడడమే గుర్తు అసలు పాట ఎప్పూడో మర్చి పోయా.
అమూల్ – వీళ్ళవి చాలా వరకూ ప్రింట్ ఆడ్స్ అయినా నాకెందుకో విపరీతంగా ఇష్టం ,ఆడ్ల ల లో వీళ్ళ సటైర్లు అల్టిమేట్ అసలా … ఇక ఆ బుజ్జి పాప బొమ్మ అయితే ఎంత ముద్దుగా ఉంటుందో … వీళ్ళ ప్రింట్ ఆడ్స అన్నీ www.amul.com లో చూడొచ్చు.
వుడ్ వర్డ్స్ గ్రేప్ వాటర్ — ఏంటీ పాప ఏడుస్తుందా …. అయితే వుడ్ వర్డ్స్ గ్రేప్ వాటర్ పట్టు
ఇది కూడా మరో మంచి ఆడ్ .
రస్నా — ఐ లవ్ యూ రస్నా ….. అంటూ బుజ్జి అంకిత చెబుతుంటే ఇప్పటికీ గుర్తే … కాక పోతే పాపం సినిమాల్లో ఇప్పుడు అదే సైజు డ్రెస్సులు వేస్తుంటే బాధేస్తుంది . కాక పోతే సూపర్ ఆడ్ .
ఓనిడా దయ్యం —- చిన్నప్పుడు అన్నం తినక మారాం చేస్తే … ఓనిడా దయానికి పట్టిస్తా నంటూ
అమ్మ బెదిరించేది
, ఎందుకో మధ్య లో ఆపేసి మళ్ళీ ఈ మధ్య మొదలెట్టారు ఈ దయ్యాన్ని .
ఓనిడా దయ్యం అంటే వెంట నే గుర్తొచ్చేది ముగ్గురు గుండూ రావుల మిరిండా ఆడ్ ఇది కూడా సూపర్ గ ఉంటుంది , యూ ట్యూబ్ లో ఇప్పటికీ కనిపిస్తుంది .
లిరిల్ —– లా .. ల ల ల లా … ల ల ల లా … ల్ల ల్ల ల్ల .. ల్ల ల్లా ల్లా…. అంటూ అప్పటి కేరెన్ లూనెల్ నుంచీ మొన్నటి దీపికా పదుకొనే వరకూ … వాటర్ ఫాల్స్ కింద పాడేసి … మన చేత సబ్బును కొనిపించేసారు … ఈ ఆడ్ ని డిజైన్ చేసింది ద వన్ అండ్ ఓన్లీ అలెక్ పద్మసీ .
సొట్ట బుగ్గల ప్రీతీ జింటా కూడా ఒకప్పుడు లిరిల్ గర్లే ..
ఇక ఫెవికాల్ ఆడ్స్ ని ఎలా మర్చి పోతాం నవ్విస్తూనే చెప్పల్సింది చెప్పేస్తారు ఈ ఫోటో చాలు అది ప్రూవ్ చెయ్య డానికి
మరిన్ని ఫెవికాల్ ఆడ్స్ www.pidilite.com లో చూడొచ్చు !!
మర్చి పోయాను ఆ ప్రోగ్రాం చూస్తుంటే మరో కొత్త విశయం తెలిసింది … నిన్న మొన్నటి వరకూ I am a COMPLAN boy , I am a COMPLAN girl అంటూ మనతో కాంప్లాన్ తాగించింది ఎవరో కాదు ఆయేశా టాకియా , షాహిద్ కాపూర్లే ..
ఇలాంటివే బోల్డు ….. సూపర్ ఆడ్స్ అప్పటికీ ఇప్పటికీ గుర్తుండి పోతాయి ….
వెళ్ళే ముందు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ … వీడియో లేకుండా ..కేవలం మాటలతో నే … అజరామరమైన చార్మినార్ రేకుల ఆడ్
ఏంటి రామయ్యా ధీర్ఘాంగా అలోచిస్తున్నావ్ ??
ఏం లేదు , మా ఇంటికి ..గొడ్ల సావిడి కి ఏ రేకులు వెయ్యాలా అని …
ఇందులో అలోచించడానికి ఏవుంది … నాణ్యమైన వీ మన్నికైన చార్మినార్ రేకులనే వాడు ….
చార్మినార్ ….. చార్మినార్ …..