
Good Bye Lenin! / గుడ్ బై లెనిన్ (2003)
అసలీ సినిమా గురించి మొన్న (13th may) మదర్స్ డే రోజు రాసుండాల్సింది , కూసింత లేట్ అయ్యింది …
ఇది కూడా జర్మన్ సినిమా నే … techinical గా మూవీ క్రిటిక్స్ దీనికి ఫుల్ల్ మార్కులు వెయ్యక పోవచ్చు గానీ ..
ఒక ఆవరేజ్ ఫిలిం బఫ్ గా అంతకు మించి ఒక మనిషి గా నేను మాత్రం దీన్ని absolute stellar అంటాను …
ఒక కొడుకు తన తల్లి గురించి పడే తపనే గుడ్ బై లెనిన్!
ఈ సినిమా unification of germany నేపధ్యం లో సాగుతుంది , Christiane …east germany కి చెందిన కమ్మ్యూనిస్ట్ పార్టీ S.P.D కి గట్టి మద్దతుదారు ..
ఓ సారి తన కొడుకు గవర్నమెంట్ వ్యతిరేక రాలీ కొడుకు దెబ్బలు తినడం చూసి 8 నెలల పాటు కోమా లోకి వెల్లి పోతుంది … ఈ 8 నెలల కాలం లో జర్మనీ యూనిఫికేషన్ జరిగి పోతుంది ,
8 నెల తరువాత Christiane కోమా నుంచి తేరుకుంటుంది , కానీ డాక్టర్ ఆమెకు ఎలాంటి షాక్ కలిగించే న్యూస్ చెప్పొద్దని ఆమె కుటుంబానికి సలహా ఇస్తాడు …
తన తల్లి east germany సపోర్టర్ కావడం తో అది ఇక లేదని తెలిస్తే ఎక్కడ షాక్ కి గురౌతుందో నని ,
ఆమె కొడుకు Alex తనకా విషయం తెలియకుండా …
తన కుటుంబం .. స్నేహితుల తో కలిసి ఆమెకు east germany ఇంకా ఉందని నమ్మించడానికి .. చిన్న చిన్న నాటకాలు / అబద్ధాలు చెబుతూ పోతాడు … అవి కాస్తా పోను పోనూ చాలా కాంప్లెక్స్ గా తయ్యారయ్యి కూర్చుంటాయి ,
ఇంతలో Christiane భర్త గురించి కూడా ఆ కుటుంబానికి కొన్ని నిజాలు తెలుస్తాయి …. ఇలా కధ సాగి పోతుంది .
తన తల్లి ని నమ్మించడానికి Alex పడే కష్టాలు మనకు ఒక క్షణం నవ్వు తెప్పించినా … మరు నిమిషం అరె … మనం అతని కస్టాలు చూసి నవ్వామా ?? అని కాస్త సిగ్గు పడతాం !!
ఈ సినిమా ఏమీ పొలిటికల్ సెటైర్ కాదు …. itz all bout human emotions n’ relations.
వర్గాలు జర్మన్ సినిమా · సినిమాలు
Run Lola Run / రన్ లోలా రన్ (1998)

ఇది భాష గా చూస్తే జర్మన్ సినిమా , genre కోణం లో చూస్తే థ్రిల్లర్ , స్క్రీన్ ప్లే ప్రకారం చూస్తే నాన్-లీనియర్ , సినిమా గా చూస్తే మాత్రం గొప్ప సినిమాల్లో ఒకటి !!
ఒక పనిని ఎన్ని రకాలు గా చేయొచ్చో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది …. మన జీవితం లో అతి చిన్న
సంఘటనలు కూడా మన జీవితం లో ఎన్ని మార్పులు తేగలవో (Butterfly effect ) అలోచించి సినిమా తీస్తే ఎలా ఉంటుంది ?? రన్ లోలా రన్ లా ఉంటుంది !!
లోలా …. తన బాయి ఫ్రెండ్ మానీ తో కలిసి స్మగ్లింగ్ / మనీ ట్రాన్స్ ఫర్ బిజినెస్ లో ఉంటుంది , మానీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ని లోలా రీసీవ్ చేసుకునే సీన్ తో స్టార్ట్ అవుతుంది … ఫోన్ లో మానీ తను “ఈ రోజు .. స్మగ్లింగ్ డీలర్ కి ఇవ్వాల్సిన డబ్బు పొరపాటున Train లో పోగొట్టుకున్నాని …. ఎవరో బిచ్చగాడు ఎత్తుకెళ్ళాడని అనుమానంగా ఉందని చెప్తాడు … ఇంకో 20 ని మి ల్లో తను డీలర్ కి డబ్బు ఇవ్వక పోతే అతను నన్ను చంపేస్తాడు …. ఎదో ఒకటి చేయి … నువ్వు 20 ని మి ల్లో Em చేయలేక పోతే నేను పక్కనున్న ,
సూపర్ మార్కెట్ ను దోచేస్తాను నాకు మార్గం లేదు” అని పెట్టేస్తాడు …..
ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండీ బాబూ సినిమా …. పరుగే పరుగు హీరోయిణ్ … సినిమా మొత్తం లోలా పరిగెడుతూనే ఉంటుంది …. సినిమా మూడు పారలల్ Time frames లో సాగుతుంది … అసలు సినిమా ఇలా కూడా తీయవచ్చా అనిపిస్తుంది …. అల్టిమేట్ అసలా … క్లైమాక్స్ ఐతే Mind blowing …
ఈ రకమైన ధీం తో మరి కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి … Krzysztof Kieślowski తీసిన త్రీ కలర్స్ లోని RED లో ఈ
రకమైన పారలల్ time frame ధీం sequence కనిపిస్తయి …. అలాంటిదే మరో సినిమా The Butterfly Effect , Ashton kutcher ది ..
కాక్ పోతే దీని కాంసెప్ట్ కాస్త డిఫరెంట్ .
సినిమా లో లోలా కి తప్ప ఎవరూ పైవోటల్ roles లేవు … lola గా Franka Potente బాగా చేసింది … Bourne Identity , supremacy
చూసిన వారికి తిను పరిచయమే …

ఈ సినిమా డైరెక్టర్ Tom Tykwer పోయిన సం వ తీసిన Perfume కూడా బాగుంటుంది …
ఇతను Nataie Portman తో తీసిన షార్ట్ ఫిలిం The Truth కూడా బాగుంటుంది … కేవలం 7 ని మి ల్లలోనే మంచి కాంసెప్ట్ ప్రెసెంట్ చేసాడు !!
ఆ షార్ట్ ఫిలిం వీడియో లింకు …
వర్గాలు జర్మన్ సినిమా · డైరెక్టర్లు · నా ఫేవరెట్ · సినిమాలు