సంభవామి యుగే యుగే

Entries categorized as ‘డైరెక్టర్లు’

2006 లో వచ్చిన మంచి films

జులై 10, 2007 · వ్యాఖ్యానించండి

టైటిల్ చూసే అర్ధం అయ్యుంటుంది ఈ పాటికి … చాలా రోజుల్నుంచి రాయాలంకుంటున్న పోస్టు … దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగాయాని … ఎప్పుడొ రిలీస్ అయినా వాటి గురించి ఇప్పుడు ఈ నస !! కొన్ని ఈ లిస్ట్ లో లేవు అంటే బాలేవు అని కాదు ….. వాటి గురించి సపరేటు గా పేద్ద పేద్ద పోస్టులు రాసుకొస్తానని అర్ధం :) .

Paprika :

ఇదో జపనీస్ animated ఫిలిం (not animes) , ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఎదో కల లా అనిపించింది , ఇది సినిమానే అని నిర్ధారించుకోవడానికి చాలా సార్లు తల ష్రగ్ చేస్తూనే ఉన్నాను … amazing piece of animation. ఈ సినిమా డిరెక్టర్ Satoshi Kon కి ఇలాంటి సినిమాలు తీయడం కొత్తేమీ కాదు , ఇంతకు మునుపు నేను చూసిన ఈయన సినిమా Millennium Actress అది కూడా బ్రిల్లియంట్ సినిమా అనుకోండి. ఇక Paprika కధ కొస్తే … ఇది పూర్తిగా కలలకు (dreams) సంభంధించిన స్టోరీ … ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది , ఎవరైనా మీ కల లోకి చొరబడితే ఎలా ఉంటుంది ?? Paprika సినిమా లా ఉంటుంది.

ఈ మధ్యే ఈ బ్లాగ్ లో రాసిన Waking Life లా ఇది టూ complexive కాక పోయినా దీనిలో ఉండే surreal , stream of conscience, dream symbolism మెధడ్స్ మన మెదళ్ళని కట్టి పడేస్తుంది.

ఇలాంటి సినిమాలు మరికొన్ని : Waking life , Abre los Ojos / Open your eyes

Knocked Up :

బాచిలర్ హూడ్ …. బిందాస్ లైఫ్ …. వన్ నైట్ స్టాండ్ … ప్రెగ్నెంట్ … షాక్ … పేరెంట్ హుడ్ …. ఇది స్థూలంగా కధ …. అట్టర్లీ ఫన్నీ సర్కాసం (sarcasm) … కొంత మంది దీన్ని క్రాప్ అన్నారు … కానీ నాకు మాత్రం భలే నచ్చ్హేసింది … చాలా సింపుల్ స్టొరీ లైన్ …. పెర్ఫార్మెంసెస్ కూడా అవరేజే …. కానీ మస్త్ మూవీ …. హోల్ సం టైం పాస్ గారెంటీడ్ ….

The Fountain :

ఈ సినిమా చూసి నాలుగు నెలలు అవుతున్నా … దీని గురించి ఇంకా నేనో అభిప్రాయానికి రాలేక పోయా … ఇప్పటి వరకు ఓ మూడు సార్లు చూసా … చూసిన ప్రతీ సారీ ఓపీనీయన్ మారి పోతోంది , కొత్త కొత్త doubts పుడుతున్నాయి …. అన్ని సార్లు చూసినా … ఇంకా చాలా qwestions unanswered.

Xtential , philosophy , time travel , parallel stories ఈ genres అన్నిటి నీ పునికి పుచ్చుకున్న కధ ఈ సినిమాది …ఇలాంటి వాటిని interpret చేయడం కొంచం కష్టం …. ఈ రకం సినిమా ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్ధం / అవగాహన చేసుకుంటారు కాబట్టి ఒక్క పద్ధతి లో interpret చేయడం కష్టం …. ఏదేమైనా ఇంకా బాగా అరగాలి సినిమా నాకు …

కధ విషయానికి వస్తే … వేల సం. వ . రాల టైం స్పాన్ లో సాగుతుంది కధ … అటు మాయన్ సామ్రాజ్యం నుంచి ఈ నాటి టైం లైన్ ని టచ్ చేస్తూ … రేపటి భవిష్యత్తు లోనూ సాగే … లవ్ స్టోరీ … ఈ మూడు కధలు పారలల్ గా సాగుతాయి …. సినిమా కొన్ని చోట్ల ‘Vanilla sky ‘ లాగే మన Consciousness loci ని దాటి వెళ్ళి పోతుంది అనిపించింది … అందుకే చాలా మందికి ఇది మొదట చూడ గానే నచ్చక పోయి ఉండొచ్చు.

అసలు ఈ సినిమా 2002 లోనే రావల్సింది … అప్పట్లో బ్రాడ్ పిట్ట్ , కేట్ బ్లాంకెట్ తో కలిసి ఈ సినిమా నిర్మించాల్సి ఉండగా … మధ్య లో నే రద్దై పోయింది , మళ్ళీ ఇన్నాల్టికి Hugh Jackman , Rachel Weisz తో నిర్మించారు.

అన్నిటి కంటే ముఖ్యంగా Darren Aronofsky is back అదే ఆనందంగా ఉంది …. pi , Requiem for a Dream లాంటి సినిమాలు తీసిన దర్షకుడు … ఇన్ని రోజులు గాప్ తీసుకుంటే ఇంకేమైనా ఉందా ….

Little Miss Sunshine :

ఈ సినిమా నాకు విపరీతంగా నచ్చేసింది !! దీని గురించి ఇక్కడ రాసే కంటే , సెపరేట్ పోస్ట్ రాయడం న్యాయం !!

this-film-is-not-abt-winning-itz-just-all-about-being-yourselves-n’-being-together !!

Children Of Men :

ప్రావీణ్ గారనట్టు ఈ సినిమా తో చాలా మందికి లింకు కుదర లేదు …. దీని కోసం కూడా సపరేటు పోస్ట్ రాయాలి.

Departed :

ఒక్కటి చెప్పొచ్చు Martin Scorsese is bak … ఆయన ఎటర్నల్ wait ఫర్ ఆస్కార్ ఈ సినిమా తో ముగిసింది …. కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే డిపార్టెడ్ కంటే దాని మూలం infernal affairs కొన్ని చోట్ల బాగా అనిపించింది !! అయినా Scorsese లాంటి వారి పై వెలెత్తే ధైర్యం ఎవరికుంది ?? ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ రోలింగ్ స్టోన్స్ రాక్ బాండ్ పై తీయ బోయే రాక్యుమెంటరీ (rocumentary= rock + documentary) కోసం వైటింగ్.
Leonardo DiCaprio కి ఈ 2006 బాగా కలిసొచ్చినట్టుంది , దీంతో పాటు బ్లడ్ డైమెండ్ సినిమాలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపాడు , DiCaprio కూడా ఆక్టింగ్ చేయగలడని ఈ రెండు సినిమాలు చూసాకే తెలిసింది ;) !!

Jack nicholsan ఎప్పటి లాగే అమేజింగ్ … Mark Wahlberg , Matt Damon కి కూడా బాగా చేసారు … వారికి కూడా పోయినేడు ఏడు Invincible , The Good Shepherd లాంటి హిట్స్ కొట్టారు !!

Bobby :

Robert F. Kennedy హత్య నేపధ్యం లో సాగే హిస్టారికల్ డ్రామా … ఆవరేజ్ సినిమా కానీ ఇక్కడ ఎందుకు దీని గురించి రాయాల్సి వచ్చిందంటే దీని కాస్ట్ గురించి …. ఈ సినిమాలో కాస్ట్ చాలా భారీ గా ఉంది మీరే చూడండి Anthony Hopkins , Laurence Fishburne,Ashton Kutcher, Lindsay Lohan,Demi Moore,Martin Sheen, Sharon Stone n’ Elijah Wood.

గదీ లిస్టు … అందరి ఆక్టింగ్స్ సొ సొ నే (xcluding Anthony Hopkins, Marin sheen ) , మొత్తమ్మీద బోరింగ్ సినిమా అయినా ఈ స్టార్ కాస్ట్ కోఅం ఒక సారి చూడొచ్చు !!

The Queen :

2006 లో వచ్చిన మంచి బయోగ్రాఫికల్ సినిమాల్లో ఇది బెస్ట్ !! ప్రిన్సెస్ డైయానా మ్రుతి నేపధ్యం లో సాగుతుంది కధ … తన సాంప్రదాయ , ఉన్నతమైన అంత:పుర కట్టుబాట్లు … ఈ నాటి పాపారాజీ , సెలెబ్రీటీ కల్చర్ గా మారుతున్న క్రమానికి సాక్షిగా నిలిచిన Elizabeth II మాహా రాణి కధే ఇది. ఈ quasi comedy లో Elizabeth II మాహా రాణి గా హెలెన్ మిర్రెన్

(Helen Mirren) మంచి expressive faces తో నటించారు. Tony Blair గా నటించిన Micheal Sheen పెర్ఫార్మెన్స్ సినిమా కి మరో అసెట్. ఓవరాల్ గా 2006 లో వచ్చిన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లొ ఇదోటి.

Black Book (Zwartboek) :

ఇదో నార్వేఇయన్ (norwegian) వార్ సినిమా ….. దీనీ కధ రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యం లో ఉంటుంది. పేరుకే వార్ సినిమా అయినా ఇందులో లవ్ స్టోరీ నే ఎక్కువ.
ఓకే డోకే మూవీ ….. మరీ అంత సూపర్భ్ ఏమీ కాదు Carice van Houten ఆక్టింగ్ బావుంది. Paul Verhoeven (Basic instinct , robo cop fame) దీని డైరెక్టర్ .

The Prestige :

ఈ సినిమా లో నికోలా టెస్లా కి రోల్ ఉంది అని తెలిసనపట్టినుంచి …. దీని రిలీస్ కోసం కళ్ళు కాయాలు కాసే లా వేచి చూశా. ఇద్దరు మెజీషియన్స్ తమ రహస్యాలు కాపాడుకో్వడానికి ఎంత దూరం వెళ్ళారు అనేది కధ ….. అదమ్మా వర్క్ డెడికేషన్ అంటే … ఊరికే తిని తొగుంట్టే సరిపోదు. ;)

Memento చూసినప్పట్టి నుంచి నాకెందుకో Christopher Nolan అంటే కొంత సాప్ట్ కార్నర్ …. సినిమా లో ట్విస్టులే ట్విస్టులే …..

నేను అన్నిటికన్నా ఆనందించే విశయం …. ప్రపంచం మరచి పోయిన అపర మేధావి …. మా దేవుడూ అయినా నికోలా టెస్లా గురించి ఈ సినిమా ద్వారా మరింత మందికి తెలియడం.

టెస్లా రాక్స్ …. ఏడిసన్ సక్స్ …….

మెజీషియన్ కధ నేపధ్యం లో 2006 వచ్చిన మరో సినిమా Edward Norton starrer THE ILLUSIONIST. సినిమా సో సో అయినా ఎడ్వ్రర్డ్ నార్టన్ నటన కోసం కచ్చితంగా చూడాలి.

The Pursuit of Happyness :

ఇది కూడా బయోగ్ర్రాఫికల్ సినిమా నే …. కాక పోతే రాగ్స్ టు రిచెస్ స్టోరీ అన్న మాట …. Will Smith ఇంత బాగా ఆక్ట్ చేస్తాడనుకోలేదు …. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ….

Live Of Others :

ఇదో జర్మన్ సినిమా , absolute stunner ఫారిన్ లాంగ్వేజ్ కాటగిరీ లో ఆస్కార్ విజేత ….. దీని గురించి రెండు ముక్కల్లో చెప్పడం సాధయం కాదు …. ఒక సపరేట్ పోస్ట్ రాసుకొస్తా …

Stranger than fiction :

మీరు జీవిస్తున్న జీవితం మీది కాదు ….. ఎవరో అజ్ణాత రచయిత రాస్తున్న కధలో పాత్ర అని ….. ఆ పాత్ర ని ఆ రచయిత తొందర్లో చంపేసి (అంటే మీరు చచ్చి పోతారని ) మీకు తెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ?? Harold Crick పరిస్థితి లా ఉంటుంది. మంచి కామెడీ సినిమా ఇది …. visuals కూడా చాలా ప్లీసింగా (pleasing)ఉంటాయి. Will Ferrell నటన బావుంది. సినిమా లో Harold Crick కి Ana Pascal కి మధ్య రోమాన్స్ ని ఇగ్నైట్ చేసే పాట చేసే నాకు విపరీతంగా నచ్చేసింది …. ఈ పాట పాడింది రాసింది Wreckless Eric.
సినిమా లో ఈ పాట సీన్ యూట్యూబ్ లో క్లిప్.

http://www.youtube.com/watch?v=aXAKEeYmUus.

Wreckless version :

http://www.youtube.com/watch?v=DSjwl8lHEVE

మీకు గిటార్ వస్తే ఈ పాట ప్లే చేయడం చాలా వీజీ ….. నేను రెండు రోజుల్లో నేర్చేసుకున్నా ….. :)

2006 లో వచ్చిన మరికొన్ని సినిమాలు ,వార్ సినిమాలు , షార్ట్ సినిమాలు , డాక్యూమెంటరీల కోసం మరో పోస్టు ….

వర్గాలు 2006 · డైరెక్టర్లు · సినిమాలు

Animes , Rotoscoping … et al …

జూన్ 15, 2007 · 1 వ్యాఖ్య

Waking Life (2001)

Waking Life (వేకింగ్ లైఫ్ ) —- నాకు ఫిలసాఫికల్ / ఫాంటసీ / xtential సినిమాలు చాలా ఇంట్రెస్ట్ ….. ఈ సినిమా కూడా పూర్తిగా వాటి తో నిండినదే …. అందుకే నచ్చేసింది ..

ఇది రోటోస్కోపింగ్ (Rotoscoping) అనే టెక్నిక్ తో తీసారు … ఈ మధ్యే వచ్చిన A Scanner Darkly తీసిన Richard Linklater దీని డైరెక్టర్ కూడా … A Scanner Darkly కి కూడా ఇదే టెక్నిక్ వాడారు.

ఇలాంటి కధ లకు Rotoscoping లాంటి ఆనిమేషన్ టెక్నిక్స్ వాడితే తప్ప తెరకెక్కించలేమనిపిస్తుంది. ఒక డ్రీం (కల ) నుంచి మరో డ్రీం కి మారుతూ … extentialism … Post modernism …. quantum theory …. ఇలా రక రకాల ఫిలాసఫిల లోకి మన మదడు ని దూరిస్తూ … ఒక మైండ్ మాజిక్ క్రియేట్ చేస్తుంది …. దీంతో మన మెదడు లో ఎక్కడో … నిద్రించుకుపోతున్న heterogeneous views ని తట్టి లేపుతుంది. ఈ సినిమా చూస్తే హ్యూమన్ సైకాలజీ , extential science , ఫిలాసఫీ మీద వంద బుక్కులు చదివిన ఫీలింగ్ కలిగింది. ఇలాంటి ఫీలింగే కొంత I Heart Huckabees లాంటివి చూసినప్పుడు కూడా కలిగినా , ఇది కొంత డిఫరెంట్ … ఒక స్టాటిక్ స్పేస్ ( static space) నుంచి డైనమిక్ ప్లేన్స్ (dynamic planes)కి సాగే కధ ఒక రకమైన hallucinatory effect ని కలిగిస్తుంది. ఈ సినిమా కు Philip K. Dick రాసిన ఒక షార్ట్ స్టోరీ మూలం , నాకు Philip K. Dick కధలు పెద్దగా పరిచయం లేవు కానీ ఈ సినిమా ఇచ్చిన కిక్కుకు , ఆయన వర్క్శ్ కచ్చితంగా చదవాలని డిసైడ్ అయ్యా …. వీకెండ్ లో చాలా ప్రశాంతంగా ఉన్నఫ్ఫుడు ఈ సినిమా చూడండి … ఒక ఇంక్రెడిబిల్ ఫీలింగ్ కలుగుతుంది .

Animes —-

నేను Animes … Manga కామిక్స్ / సినిమాలకు పిచ్చా ఫాన్ ని , Animes అంటే అనీమేషనే కానీ … కొంచం డిఫరెంట్ …. Pokemon , Animax చూసే వారికి ఇప్పటికి అర్ధం అయ్యుంటుంది …. ఎన్నో కల్ట్ (cult ) films కి Animes కామిక్స్ నుంచే ఇంస్పిరేషన్ … అదర గొట్టే ఫైట్స్ తో జనాలని ఉదరగొట్టేసిని Matrix triology లో ఫైట్స్ కి , కొంత వరకూ కధ కి కి Ghost in the shell అనే Animes inspiration. Full metal alchemist , naruto , shaman king Animes / Manga సీరీస్ / కామిక్స్ ని ఫాలో అవుతుంటే కలిగే ఆనందమే వేరు …. ఇప్పుడీ నసంతా ఎందుకంటే …. మా కేబుల్ వాడు వారం నుంచి Animax … చానెల్ ఆపేసాడు …. ఇవ్వారా బాబూ అంటే ఎంతకీ నా మొర ఆలకించడే …

( Full metal alchemist పోస్టర్ )

Random notes …

బాల చందర్ సినిమా ఇది కధ కాదు —- ఈ సినిమా ఎప్పుడూ పూర్తిగా చూడలేక పోయాను అది కొంచం బాధ పడే వాడిని … నిన్న ఈ – టీవి వల్ల అది కాస్త తగ్గింది.
నిన్న ఈ – టీవి వాడు ఈ సినిమా మిని మూవీ పేరు తో వేసారు , అంటే 2 1/2 గంటల సినిమా ని అక్కడక్కడ కట్ చేసి 1 గంట లో చూపించేసాడు.
సినిమా లో స్టోరీ భలే ట్విస్టులు తిరిగింది …. అంత మంచి డిరెక్టర్ కాబట్టి … అన్ని ట్విస్టులు ఉన్నా కధ లో పట్టు ఉంచ గలిగారు బాల …. పాత్రల కారెక్టరిజేషన్ కూడా బావుంది.
ముఖ్యంగా …. సినిమా మొత్తం మనసు ఊగిసలాడుతూ సాగే జయ సుధ పాత్ర బావుంది , శరత్ బాబు అంత పంచీ గా అనిపించక పోయినా … కమల్ హాసన్ …. చిరంజీవి … సూపర్ …
మళ్ళీ చెప్పాలంటే … చిరంజీవి సూపరో సూపర్ …… ఈ సినిమా కూడా అంతు లేని కధ లాగే దేని నుంచి అయినా ఇంస్పిరేషనో కాదో తెలియదు.

వర్గాలు Animes · డైరెక్టర్లు · సినిమాలు

Ritwik ghatak ,Andrei Tarkovsky సినిమాలు

జూన్ 10, 2007 · అభిప్రాయములు

మొత్తానికి ఎలా అయితే నే … రిత్విక్ ఘటక్ సినిమా చూసేసా. ఈయన గురించి ఎన్నో రోజులనుంచి వినడం, చదవడమే కానే సినిమా ఏదీ చూళ్ళేదు అప్పుడప్పుడు … యూ ట్యూబ్ గూగుల్ వీడియోస్ లో కిన్ని క్లిప్స్ తప్ప.

ఆయన సినిమాలు చూడాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నాను …. ఎక్కడా దొరికి చావలేదు … నా కష్టాలు ఆ దేవుడికి సినిమా స్కోప్ లో కనిపించాయేమో మొత్తానికి చూపించేసాడు …..

మొన్న మా కజిన్ తో కలిసి తో కలిసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం , మాటల్లో తెలిసింది ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య బెంగాళి సినిమాల ఫాన్ అని దాంతో తో ప్ర్రణం లేచొచ్చినట్టయ్యింది … వెంటనే రిత్విక్ ఘటక్ సినిమాలేవయినా ఉన్నాయా అనడిగా. YUP అని రూం లో కి వెళ్ళొచ్చి “Meghe Dhaka Tara” , “Nagarik” సినిమాలు తెచ్చి నా వొళ్ళో పడేసింది ……

Meghe Dhaka Tara గురించి చాలా విన్నాను చదివాను రిత్విక్ ఘటక్ సినిమాల్లోకెల్లా ఇది బెస్ట్ అని చాలా చోట్ల విన్నాను.

ముఖ్యంగా ఆయన సినిమాలన్నీ బెంగాల్ పార్టీషన్ , దాని తర్వాత పరిస్థితుల బేస్డ్ గానే సాగుతాయి. Meghe Dhaka Tara , Nagarik రెండిటిలోనూ ఇది కనిపిస్తుంది, పాత్రల్లో కూడా ముఖ్యంగా ప్రోటోగానిస్ట్స్ పై ఆ సీక్వెంసెస్ ప్రభావం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ రెండు సినిమాలూ చూసాకా రిత్విక్ కధా, కధనాల శైలి ఆయన ఎంచుకున్న దీంస్ జపనీస్ డైరెక్టర్ Yasujiro Ozu (Tokyo Story ) వర్క్స్ కి చాలా దగ్గరి పోలికలు కనిపించాయి , నాకెందుకో ఇద్దరూ గొప్ప మినిమల్ ఆర్టిస్ట్స్ అనిపిస్తుంది.

Meghe Dhaka Tara

ఒక శరణు శిబిరం నేపధ్యం గా సాగే నీతూ అనే అమ్మాయి కధ. తన కుటుంబం కోసం కష్టపడుతూ తను కర్పూరం లా కరిగి పోయినా ఫర్లేదు తన వాళ్ళు మాత్రం బాగుండాలి అనేది నీతూ.

ఇలాంటి కధలు మనకు కొత్త కాక పోయినా దీన్ని రిత్విక్ తీసిన తీరు కి అయనకి కుడోస్. బయట నుంచే కాక ఇంట్లోనుంచి కూడా తనకు ఏమోషనల్ సపోర్ట్ లేక పోవడం తో నీతూ కారెక్టర్ పడే సైకలాజికల్ స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. తను కుటుంబం కోసం అంత కష్ట పడ్దా వాల్లు మాత్రం సెటిల్లయ్యాక ఒక్కొక్కరు గా తనను వదిలేస్తారు.

బాల చందర్ సినిమా ” అంతు లేని కధ ” కు ఈ సినిమా నే మూలం కావొచ్చు. ఇందులో ని చాలా సీన్స్ అంతు లేని కధ లో మక్కికి మక్కి దించినట్టు అనిపించింది.

మొత్తానికి హార్ట్ బ్రేకింగ్ మెలో డ్రమాటిక్ సినిమా … రిత్విక్ ఘటక్ కి ఎందుకంత పేరో సినిమా చూసాక అర్ధం అయ్యింది. prime సీన్ నరేషన్ లో ఉండగానే subime గా మరో సెకండరీ ప్లాట్ ని నడిపిస్తూ తరువత దాన్నే ప్రైమరీ నరేషన్ లో కి తెచ్చే ishtyle భలే గా ఉంది.

Nagarik —-

రాము అనే నిరుద్యోగి జీవితం లో అతనికి అతని కుటుంబానికి ఎదురయ్యే కష్టాల కడలి ఈ సినిమా. పూర్తి గా రిత్విక్ స్టైల్ మెలో డ్రామా , హ్యుమానిటీ , xplotiataion తో నిండిన కధ.

తమ కుటుబం గడవడానికి కష్టంగా ఉండడం తో ఆధారం కోసం రాము కుటుంబం సాగర్ ని అద్దెకు ఉండమంటారు , ఇతనిది అంటాగానిస్ట్ కారెక్టెర్ , వాళ్ళ కష్టలు తీర్చక పోగా మరిన్న వచ్చి పడతాయి ఇతని వల్ల … ఆఖరికి తను కూడా దిక్కు లేని వాడు అవుతాడు. కానీ రామూ అతన్ని ఒక మంచి పౌరుడిగా అతన్ని త్రిగి చేరదీయడqm తో సినిమా ముగుస్తుంది.

మొత్తానికి రిత్విక్ ఘటక్ సినిమాలు రెండు చూసానోచ్ !! :)

Andrei Rublev —-

ఈ మధ్య చూసిన మరో సినిమా Andrei Tarkovsky తీసిన Andrei Rublev. ఆయన సినిమా ఇంతకు ముంపు రెండు చూసాను The Sacrifice , Solyaris చూసి ఉన్నా కాబట్టి ఆయన సినిమా ల పై కూసింత అవగాహన ఉంది. కానీ Andrei Rublev పూర్తిగా డిఫరెంట్ టేకింగ్ అనిపించింది. సింక్ కావడానికి కొంత టైం పట్టింది, ఇంకా పూర్తిగా interpret చేయలేక పోయాననే చెప్పాలి.

కానీ సినిమా ఎందుకో అంత మైండ్ బ్లోయింగ్ అనిపించలేదు . మే బీ అర్ధం చేసుకొని అవగాహన పెంచుకోవడానికి ఇంకో సారి చూడాలేమో…. కానీ దాన్ని ఇంకో సారి చూడ్డానికి ఎందుకో మంసొప్పుకోవట్లేదు. విసూవల్ గా మాత్రం సినిమా మంచి ట్రీట్ అని చెప్పొచ్చు.

వర్గాలు డైరెక్టర్లు · బెంగాళీ సినిమా · సినిమాలు

Zidane: A 21st Century Portrait

జూన్ 1, 2007 · వ్యాఖ్యానించండి

Zidane: A 21st Century Portrait

ఈ సినిమా గురించి పోయిన సం. వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరిగినప్పటి నుంచి వింటున్నా …. ఇప్పటికి దొరికింది !!

లాస్ట్ వీకే చూసా …. హ్యూజ్ రెలీఫ్ …. నేనేమీ హార్డ్ కోర్ ఫుట్ బాల్ ఫాన్ ని కాదు కానీ ఎందుకో జిదాన్ లాంటి వారు ఆడుతుంటే మాత్రం అత్తుక్కుపోవల్సిందే ….

దీన్ని xperimental సినిమా / డాక్యుమెంటరీ అనొచ్చేమో … అసలు దీని సంగతేంటంటే … 17 హై డెఫినెషన్ కెమరాలతో ఒక real ఫుట్ బాల్ మాచ్ లో కేవలం జిదాన్ ని live గా ట్రాక్ చెయ్యడం !!

అవును 90 నిమిషాల సినిమా మొత్తం కేవలం జిదానే జిదాన్. మాచ్ లో అతని హావ భావలు , కదలికలను …. కెమరాలతో బంధించిన తీరు అద్భుతం !! … అసలు నిజంగా అమేజింగ్ ఎడిటింగ్ వర్క్ అని చెప్పొచ్చు … దీనికి సినిమాటోగ్రఫీ అదించింది ఫేమస్ సినిమాటోగ్రాఫర్ Darius Khondji.

ఈయన David Fincher సినిమాలు (se7en , panic room) చూసిన వారికి కొంత పరిచయమే … వాటికి ఈయనే సినిమాటోగ్రాఫర్ !! అసలు ఈ సినిమా లో Darius ఉపయోగించిన deep focus షాట్స్ తీరు నిజంగా అమేజింగ్ … బాల్ ని తన కాళ్ళ తొ నాట్యం చేయిస్తూ … తన క్లాసిక్ డ్రిబిల్ తో జిదాన్ బాల్ పాస్ చేయగానే … వెనకే అతన్ని ఆరాధించే కేరింతలు కొడుతున్న వేలాది జనాన్ని fore ground లోకి తెచ్చి జిదాన్ ని గ్లేర్ గా చూపించే కెమెరా వర్క్ నిజంగా మాస్టర్ ఫుల్ల్ !!

ఇక బాల్ ని దొరక పుచ్చుకునేందుకు రొప్పుతూ కదిలే జిదాన్ ఊపిరి శబ్దాన్ని….. జనాల కేరింతలని కలగలిపి తమ మ్యూజిక్ తో Mogwai రాక్ బాండ్ అందించిన బాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది !!

సినిమా సాగుతున్నంత సేపూ ఒక ఆటగాడి ఆలోచనలూ అతని భావాలు … opposite team పై చేయి సాధి్స్తుంటే ఆ క్షణం లో అతను పడే ఆవేదననూ … అతనికి గేం పై ఉన్న concentration ను మన కళ్ళకు కడుతుంది !!

అసలు ఈ సినిమా కాంసెప్ట్ చాలా ఎక్క్ష్పరిమెంటల్ … దీని దర్షకుల లో ఒకరైన Douglas Gordon కి ఇలాంటి experiments కొత్తేమీ కాదు … ఇతను ఇంతకు మునుపు Alfred Hitchcock సినిమా pyscho ని
కేవలం 2 ఫ్రేం రేట్స్ పర్ సెకండ్ (2 frames per second actual frame rate for a film is 24 frames per second) తో స్క్రీన్ చేసాడు …. అలా చెయ్యడం ఆ సినిమా కాస్తా తో ఏకంగా 24 గంటల సేపు సాగింది !!

అందుకే తన ప్రాజెక్ట్ కి 24 hours psycho అని పేరు పెట్టుకున్నాడు !! ఒక రకంగా అది వీడియో లా కాకుండా … బొమ్మలు గా చూసినట్టే .

ఆ psycho వర్క ని కాస్త పక్కన పెట్టి మన జిదాన్ విషయానికి వద్దాం …. మొత్తానికి నే చెప్పేదేంటంటే … ఇది నిజంగా సూపర్ xperimenట్ .

మీరు ఫుట్ బాల్ ఫాన్ కాక పోయినా అసలు మూవీ Editing , camera works కోసమైనా కచ్చితంగా చూడొచ్చు !! సినిమా లో అక్క్డక్కడా ronaldo , beckham కూడా తలుక్కు మంటారు ….

అసలు నన్ను కూడా బాస్కెట్ బాల్ మాచ్ లో ఇలాగే హై డెఫినెషన్ కెమరా ల తో ట్రాక్ చేసి చూడండి నేను ఎంత గొప్ప ప్లేయరో తెలుస్తుంది ;) !!

కొసమెరుపు : రెగులర్ సినిమాల్లో ట్విస్టు లాగానే … ఈ మాచ్ లో నిజంగా నే జిదాన్ కు ఆఖరి నిమిషం లో రెడ్ కార్డ్ ఇచ్చారు !!

ఈ సినిమా అఫీషియల్ వెబ్ సైట్

www.zidane-themovie.com/

యూ ట్యూబ్ (నువ్వొక గొట్టం ) లో ఒక క్లిప్

వర్గాలు డాక్యుమెంటరీ · డైరెక్టర్లు · సినిమాలు

Run Lola Run / రన్ లోలా రన్ / Lola Rennt (1998)

మే 17, 2007 · అభిప్రాయములు

Run Lola Run / రన్ లోలా రన్ (1998)

ఇది భాష గా చూస్తే జర్మన్ సినిమా , genre కోణం లో చూస్తే థ్రిల్లర్ , స్క్రీన్ ప్లే ప్రకారం చూస్తే నాన్-లీనియర్ , సినిమా గా చూస్తే మాత్రం గొప్ప సినిమాల్లో ఒకటి !!

ఒక పనిని ఎన్ని రకాలు గా చేయొచ్చో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది …. మన జీవితం లో అతి చిన్న
సంఘటనలు కూడా మన జీవితం లో ఎన్ని మార్పులు తేగలవో (Butterfly effect ) అలోచించి సినిమా తీస్తే ఎలా ఉంటుంది ?? రన్ లోలా రన్ లా ఉంటుంది !!

లోలా …. తన బాయి ఫ్రెండ్ మానీ తో కలిసి స్మగ్లింగ్ / మనీ ట్రాన్స్ ఫర్ బిజినెస్ లో ఉంటుంది , మానీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ని లోలా రీసీవ్ చేసుకునే సీన్ తో స్టార్ట్ అవుతుంది … ఫోన్ లో మానీ తను “ఈ రోజు .. స్మగ్లింగ్ డీలర్ కి ఇవ్వాల్సిన డబ్బు పొరపాటున Train లో పోగొట్టుకున్నాని …. ఎవరో బిచ్చగాడు ఎత్తుకెళ్ళాడని అనుమానంగా ఉందని చెప్తాడు … ఇంకో 20 ని మి ల్లో తను డీలర్ కి డబ్బు ఇవ్వక పోతే అతను నన్ను చంపేస్తాడు …. ఎదో ఒకటి చేయి … నువ్వు 20 ని మి ల్లో Em చేయలేక పోతే నేను పక్కనున్న ,
సూపర్ మార్కెట్ ను దోచేస్తాను నాకు మార్గం లేదు” అని పెట్టేస్తాడు …..

ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండీ బాబూ సినిమా …. పరుగే పరుగు హీరోయిణ్ … సినిమా మొత్తం లోలా పరిగెడుతూనే ఉంటుంది …. సినిమా మూడు పారలల్ Time frames లో సాగుతుంది … అసలు సినిమా ఇలా కూడా తీయవచ్చా అనిపిస్తుంది …. అల్టిమేట్ అసలా … క్లైమాక్స్ ఐతే Mind blowing …

ఈ రకమైన ధీం తో మరి కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి … Krzysztof Kieślowski తీసిన త్రీ కలర్స్ లోని RED లో ఈ

రకమైన పారలల్ time frame ధీం sequence కనిపిస్తయి …. అలాంటిదే మరో సినిమా The Butterfly Effect , Ashton kutcher ది ..
కాక్ పోతే దీని కాంసెప్ట్ కాస్త డిఫరెంట్ .

సినిమా లో లోలా కి తప్ప ఎవరూ పైవోటల్ roles లేవు … lola గా Franka Potente బాగా చేసింది … Bourne Identity , supremacy

చూసిన వారికి తిను పరిచయమే …

ఈ సినిమా డైరెక్టర్ Tom Tykwer పోయిన సం వ తీసిన Perfume కూడా బాగుంటుంది …

ఇతను Nataie Portman తో తీసిన షార్ట్ ఫిలిం The Truth కూడా బాగుంటుంది … కేవలం 7 ని మి ల్లలోనే మంచి కాంసెప్ట్ ప్రెసెంట్ చేసాడు !!

ఆ షార్ట్ ఫిలిం వీడియో లింకు …

వర్గాలు జర్మన్ సినిమా · డైరెక్టర్లు · నా ఫేవరెట్ · సినిమాలు

Krzysztof Kieślowski’s THREE COLORS / త్రీ కలర్స్ – I

మే 11, 2007 · వ్యాఖ్యానించండి

Krzysztof Kieślowski తీసిన The Decalogue. గురించి ఇంతకు ముందే ఇక్కడ రాసా.

ఇదివరకు పోస్ట్ లో చెప్పినట్టు ఇది ఫ్రెంచ్ జెండా లో ఉన్న మూడు రంగుల (BLUE / WHITE / RED ) ,

ఫ్రెంచ్ దేశపు మూడు ప్రధాన విధానా ల(ideals liberty, equality , fraternity) పై

ace director Krzysztof Kieślowski, తీసిన మూడు ఫిలింస్ ,

కాక పోతే వీటిని పొలిటికల్ కధలకు అడాప్ట్ చెయ్యకుండా … పర్సనల్ ఎమోషన్స్ కి అడాప్ట్ చేసి తీసారు !!

Blue (1993) :

ఇందులో Juliette Binoche (Chocolat / English patient fame) ప్రధాన పాత్ర ధారి గా తీసారు.

Julie (Juliette Binoche) ఒక ప్రమాదం లో గొప్ప ఫ్రెంచి కంపోసర్ అయిన తన భర్త ని తన కూతిరిని

కోల్పోవడం తో కధ మొదలువుతుంది , ఆ ప్రమాదం కూడా మనకు స్క్రీన్ మీద చూపించకుండా …

.. బ్రేక్ ఆయిల్ లీక్ అవుతూ చూపిస్తారు , ఇలాంటి మెటాఫర్ సీన్స్ సినిమా మొత్తం అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి !!

సినిమా సాగుతున్నంత సేపూ director Krzysztof Kieślowski Blue కలర్ ని ధీం గా visuals లో ఉపయోగించిన

తీరు నిఝంగా అద్భుతం , హాస్పిటల్ లో Julie ని చూపిస్తూ తన కను పాప్పల్లో doctor ని లీల గా చూపిస్తూ

తీసిన సీన్ సినిమా ధీం మొత్తాన్ని మన కళ్ళకు కడుతుంది , ఇలాంటి సీన్ క్లైమాక్స్ లో కూడా ఉంది !!

హాస్పిటల్ నుంచి బయటపడిన తరువాత Julie తన గత స్మ్రుతులను మరచిపోవడానికి ఇల్లు మార్చేసి ,

పారిస్ వెళ్ళీ పోతుంది , అక్కడ తన భర్త మధ్యలో వదిలేసిన ఒక కంపోసిసన్ ని పూర్తి చేసే క్రమం లో

భర్త స్నేహితుడి తో ప్రేమ లో పడుతుంది , ఇంతలో తన భర్త కి మరో అమ్మయి తో సంభంధం ఉందని తెలుస్తుంది …

ఇలా Julie తన పాత జీవితం లోంచి కొద్ది కొద్దిగా బయటపడుతుంది !!

సినిమా లో పాత్రల్లోని intense psychic emotions ని ప్రేక్షకుడు తట్టుకునేందుకు అక్కడక్కడా blackouts ని

వాడిన తీరు సూపర్ . జూలీ తన భర్త , విధి పై కోపాన్ని ని లాలీ పాప్ పై చూపించే సీన్ , అక్కడక్కడా జూలీ మనస్సు ని

తెలియజేస్తూ సాగే stream of images ఇలాంటి సీన్ల తో సినిమా మొత్తం ఒక visual poesy లా ఉంటుంది.

(Blue లో Juliette Binoche)

ఈ ట్రైలాజీ లో మిగతా సినిమాలు White & Red గురించి next post లో …….

వర్గాలు క్రిటిక్స్ · డైరెక్టర్లు · ఫ్రెంచి సినిమా · షార్ట్ ఫిలంస్ · సినిమాలు

సర్రియల్ సినిమా / Luis Buñuel / Surreal cinema

మే 8, 2007 · వ్యాఖ్యానించండి

చాలా రోజుల తరువాత తీరిక దొరకడం తో డౌన్ లోడ్ చేసి చూడకుండా వదిలేసిన సినిమాల లో కొన్ని

వరుసపెట్టి నాలుగైదు చూసేసా అందులో Los olvidados ఒకటి

దీన్ని Luis Buñuel డైరెక్ట్ చేసారు , ఆయన ఇంకో సినిమా Un chien andalou / An Andalusian Dog

గురించి ఇంతకు ముందు ఇక్కడ ఓ చిన్న పోస్టు రాసాను , కాక పోతే అది షార్ట్ సినిమా ఇది ఫుల్ల్ లెంత్ సినిమా …

Los olvidados .. కచ్చితంగా one of the best flicks I did ever watch , మెక్సికో లో వీధి బాలల నేపధ్యం లో సాగుతుంది కధ …

Italian neorealism స్పూర్తి తో తీసారు ఈ సినిమా , ఇందులో మరీ andalou లో ఉన్నంత సర్రియలిసం లేక

పోయినా అక్కడక్కడా ఆ చాయలు కనిపిస్తాయి.

అసలు సర్రియల్ సినిమా కి Luis Buñuel గాడ్ ఫాధర్ లాంటి వారని పేరు , నేను ఇప్పటి వరకూ చూసిన ఆయన

సినిమాలు andalou , Los olvidados మాత్రమే . ఆయన తర్వాత ఈ genre అంత ఖ్యాతి సంపాదించిన

వారు ఎవరూ లేరంకుంటా , ఇప్పటికీ కేవలం సర్రియల్ genre కే కట్టుబడి సినిమాలు తీసే వారు అక్కడక్కడా

కనిపిస్తారు , అందులో నాకు తెలిసీ ముఖ్యమైన వారు David Lynch ఈయన సినిమాల్లో సర్రియల్ చాయలు

విపరీతంగా కనిపిస్తాయి ముఖ్యంగా Blue Velvet , Mulholland Dr … ఈయనవన్నీ ఫుల్ల్ లెంత్ సినిమాలే …

కాక పోతే సర్రియల్ genre లో చాలా వరకూ కనిపించేవి ఇండిపెండెంట్ షార్ట్ films ఏ .. ఈ కోవ కు చెందిన వారి లో

Guy Maddin ఒకరు .. ఈయన సినిమా The saddest music in the world మాత్రమే చూసా ..బావుంది …

ఇక bruce willis, bradpitt తో Twelve Monkeys , robert de niro తో Brazil సినిమాలు తీసి sci-fi , ఫాంటసీ

సినిమాల డైరెక్టర్ Terry gillam కూడా ఈ కోవకు చెందిన వాడే.

ఆ రెండు సినిమాల్లో కూసింత సర్రియల్ చాయలు కనపడతాయి.

David Lynch సినిమా Blue Velvet పోస్టర్

వర్గాలు డైరెక్టర్లు · షార్ట్ ఫిలంస్ · సర్రియల్ సినిమా · సినిమాలు

మణి రత్నం

ఏప్రియల్ 30, 2007 · అభిప్రాయములు

ఈ పోస్ట్ రాయడానికి కారణం వెంకట్ గారి 24ఫ్రేములు, 64కళలు లో మణి రత్నం పై రాసిన ఆర్టికల్ , ఆయన దాన్ని పూర్తి చేయక ముందే నేను రాయడం తప్పనుకోండి కానీ ఎందుకో మనసాగలేదు , కారణం నేను మణి రత్నం గారిని మరీ అంత గొప్ప డైరెక్టర్ గా చూడక పోవడం , ఆయన కాస్త overhyped, overrated అనిపిస్తుంది , ఆయన కచ్చితంగా మంచి డైరెక్టరే ,కానీ నాకెందుకో ఆయన సినిమాలు కొన్ని మరీ గొప్పగా అనిపించలేదు !! కబట్టి అందరూ మొదట ఆ మంచి ఆర్టికల్ చదివి ఈ సుత్తి కి రండి !!

మణి రత్నం మొదటి నాలుగు సినిమాలు నేను చూళ్ళేదు (పల్లవి అనుపల్లవి , ఉన్నారు , పాగల్ నిలవు , ఇదయ కోవిల్ ) కాబట్టి వాటి మీద నో కామెంట్స్ .

మౌన రాగం — చాలా డీసెంట్ సినిమా , ఇలాంటి సినిమాలు తెలుగు లో కూడా అప్పటికీ చాలా వచ్చినా , స్క్రీన్ ప్లే పరంగా .. ఇది కాస్త ఎడ్జ్ ఓవర్ విన్నర్ .. వెంకట్ గారనట్టు అప్పట్లో వచ్చిన మరో తమిళ సినిమా కు ఇది కొంత కాపీ అని విన్నాను , దీని తరువాత ఆయన చాలా సినిమాలు ఇతరుల సినిమాలనుంచి inspire అయినవే , కొంత వరకూ కాపీ కూడా అనొచ్చు !! నన్ను అడిగితే అదే అంటాను !! రేవతి గారి ఆక్టింగ్ ఇందులో నిజంగా సూపర్ !! shez one of my fav actors in indina cinema.

నాయకన్ — ఎవరెన్ని చెప్పినా .. నేను మాత్రం ఇది కచ్చితంగా గాడ్ ఫాధర్ కాపీ అనే అంటాను, అందులో ఒక ఇటాలియన్ అమెరికా లో మాఫియా డాన్ గా ఎదిగితే .. ఇందులో ఒక మదరాసి .. బాంబే లో డాన్ గా ఎదుగుతాడు , ఇక ఇందులో సీన్లు చాలా వరకు మక్కీ కి మక్కీ దించక పోయినా …స్క్రీన్ ప్లే … టేకింగ్ … ఇలా చాలా వరకు కాపీ యే … కాపీ అయినా ఇండియన్ నేటివిటీ కి ఈ సబ్జెక్ట్ ఆపాదించి తీసి హిట్ చెయ్యడం గొప్ప కాదా అనవచ్చు …. కచ్చితంగా కాదు … గాడ్ ఫాథర్ లాంటి సబ్జెక్ట్ , విభిన్న జాతూల తో ఒక మిని ప్రపంచం గా అలలారుతున్న మన భారతదేశానికి అతికినట్టు సరిపోతుంది .. కాబట్టి అందులో గొప్ప దనేమీ లేదు … ఆ మాటకొస్తే మణి రత్నం కంటే రాం గోపాల్ వర్మా నే కొంత వరకూ బెటరూ … ఆయన కనీసం సర్కార్ , నన్ను inspire చేసిన గాడ్ ఫాథర్ కి ఫ్రాంసిస్ ఫోర్డ్ కొప్పోలా కి నేను అర్పిస్తున్న గురు దక్షిణ అని ప్రకటించుకున్నారు … మణి మాత్రం అది కాపీ కానే కాదు అని మంకు పట్టు పడుతున్నాడు .
పైగా నాయకన్ TIME ప్రకటించిన 100 గ్రేటెస్ట్ ఫిలంస్ ఎవర్ మేడ్ లిస్ట్ లో … ఉంది దీనికి కచ్చితంగా ఆ అర్హత లేదు … అందులో డౌట్ లేదు .

ఘర్షణ / అగ్ని నక్షత్రం —– అసలు ఈ సినిమా ఎందుకు తీసాడో మణి రత్నానికే తెలియాలి , బేకార్ సినిమా నన్ను అడిగితే … ఇందులో హాస్పిటల్ సీన్ లో ప్రభు , కార్తీక్ వాళ్ళ నాన్న ని రూం మార్చి , మెట్ల దగ్గర కాపు కాసే సీన్ .. గాడ్ ఫాథర్ నుంచి మక్కి కి మక్కి దించేసారు మణి ‘రతనం’ గారు …..

అంజలి —- ఈ సినిమా కు ఒక ఇంగ్లీష్ నవల ఆధారం , కొన్ని సీన్లు స్పీల్ బర్గ్ E.T నుంచి inspire అయ్యాయి , ఇందులో చిన్నారి షామిలీ అక్టింగ్ నిజంగా సూపర్ , రేవతి సినిమా కి మరో అసెట్.

దళ పతి —- ఈ సినిమా లో ని రజనీ , మమ్ముటి , అరవింద్ స్వామీ పాత్రలు మహా భారతం లో కర్ణుడు , ధుర్యోధనుడు , అర్జునుడి పాత్రలను తలపిస్తాయి , కధ కూడా కొంత వరకూ అలానే ఉంటుంది , ఇందులో మమ్ముటి పాత్ర మధ్యలో వీక్ అయినట్టు అనిపిస్తుంది , కొంత సైకోటెరిక్ గా కూడా అనిపిస్తుంది . దీని పై 1960’s లో వచ్చిన హాలీవుడ్ గాంగ్ స్టా సినిమాల ప్రభావం చాలా వరకూ ఉందనిపిస్తుంది .

గీతంజలి —- ఒప్పుకుంటా … ఈ సినిమా నిఝాంగా చాలా బావుంటుంది … పైగా ఇందులో నాగార్జునా ఉన్నాడు అందుకే నో కామెంట్స్ . ;)

రోజా — దళ పతి మహా భారతం నుంచి inspire అయినట్టే ఇది మైధలాజికల్ కారెక్టర్ సావిత్రి కధ నుంచి inspire అయ్యింది , కాక పోతే అక్కడ యముడు , ఇక్కడ టెర్రరిస్టు , అందులో సావిత్రి పట్టు దల చూసి యముడు కరిగి పోతే … ఇక్కడ అరవింద్ స్వామి మాటలకి టెర్రరిస్టు
ice అయి పోయాడు … కానీ ఇందులో జెండా తగుల బెట్టే సీన్ చూస్తే మాత్రం … రక్తం ఉడికి పోతుంది .

దొంగా దొంగా — రాం గోపాల్ వర్మా , మణి రత్నం కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నరంటే … అది ఏ రేంజి లో ఉందో అనుకుంటాం , నిజం చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా సూపర్ గ ఉంది అనిపించింది , కానీ ఇప్పుడు చూస్తే … యా….క్ ….

బాంబే —- హమ్ ..మ్…..మ్..మ్ ఈ సినిమా కి ఏం వంకలు పెట్టొచ్చబ్బా ?? ;) , రియల్ ఇంసిడెంట్ నుంచి inspire అయ్యింది … పైగా చాలా మంచి వర్క్ … కాబట్టి నో కామెంట్స్ .

ఇద్దరు — తమిళ నాడు రాజకీయల ఆధారంగా తీసిన సినిమా ఇది !! పర్లేదు బానే ఉంటుంది !!
చాలా చోట్ల కధ మరీ పర్సనలైజ్ చేసినట్టు అనిపించింది , కధనం కూడా స్లో …. ముఖ్య పాత్రల మధ్య వైరం కూడా సినిమాలో వేగం తేలేక పోయింది !!

దిల్ సే — చూళ్ళేదు , నో కామెంట్స్ !! :)

సఖి — పర్లేదు మంచి సినిమా … కాక పోతే .. ఇలాంటి వి బోల్డొచ్చాయి కాబట్టి లైట్ .. :)

అమ్రుతా — తమిళ టైగర్ల పోరాట నేపధ్యం లో సాగుతుంది … మొదటి అర్ధ గంట తరువాత సినిమాలో వేగం పెరిగింది కానీ , ప్లాట్ లో ని కాంప్లెక్సిటీ సరిగ్గా హండిల్ చెయ్య క పోవడం వల్ల నేమో మధ్యలో డైల్యూట్ అయినట్టు అనిపించింది !!
కానీ ఇందులో మాధవన్ , సిమ్రాన్ పాత్రలు చాలా బాగున్నాయి , సిమ్రాన్ ఒక తల్లి గా తన అమ్రుతకు సహాయ పడుతుంటే …. మాధవన్ మాత్రం తన రీసెర్చి కి కూడా పనికివస్తుంది అన్న రీతిలో ఉంటాడు , ఒక డెడికేటెడ్ రచయిత , తన లోని తండ్రి పాత్రను అధిగమించి అమ్రుత కు సహాయ పడుతుంది !!

యువ — ఈ సినిమా లో హీరోల ఇంట్రడక్షన్ సీన్ చూసి అందరూ … మాకి కిరి కిరి ఏం తీసాడు మావా అన్నారు .. తీరా చూస్తే మెక్సికన్ సినిమా అమెరోస్ పెరురోస్ నుంచి కాపీ పేస్ట్ చేసారు … సరే ఆ సీన్ వదిలేసి సినిమా అన్నా గొప్పగా ఉందా అంటే అదీ లేదు …. పాలిట్రిక్స్ లో యువత అనే మంచి కాచీ సబ్జెక్ట్ తీసుకొని ఊదేసారు , సినిమా లో బేసిక్ ఎలిమెంట్స్ చాలా మిస్స్ అయినట్టు అనిపించాయి .

గురు — Orson Welles తీసిన సిటిజన్ కేన్ చూసొచ్చి ఈ సినిమా చూడండి , కధా కధనాలు వేరైనా … కారెక్టర్ పరంగా … విజువల్స్ పరంగా .. స్క్రీన్ ప్లే పరంగా ఎన్ని సారూప్యతలు ఉన్నాయో మీరే గడ గడా చెబుతారు , ఇక అభిషేక్ అయితే Orson లాగా ఆక్ట్ చేడానికి తెగ కష్టపడ్డాడు పాపం , ఇందులో లైటింగ్ టెక్నిక్స్ అంతకు ముందే వచ్చిన స్పీల్ బర్గ్ సినిమా మ్యూనిక్ లైటింగ్ ఎఫెక్ట్స్ ని గుర్తుకు తెస్తాయి . దీన్ని ధీరూ భాయి అంబానీ జీవితం ఆధారంగా తీసారు. ఎందుకో నాకు పెద్దగా నచ్చలేదు !! ఒక రకంగా చెప్పాలంటే మన వాళ్ళు బయోగ్రఫీ సినిమాలు తీయలంటే ఇంకా చాలా ఎదగాలి !! ఈ సినిమా ఈ సం వ మన దేశం తరుఫున ఆస్కార్ కి పంపిస్తారట , చూద్దాం ఏ చేస్తాడో మన గురూ గారు !!

మొత్తానికి నే చెప్పేదేంటంటే మణి రత్నం కచ్చితంగా ఇండియా లో ఉన్న గొప్ప ఫిలిం మేకర్స్ లో ఒకరు కానీ ఆయన కున్న పేరు చాల వరకు Hype మాత్రమే , మరీ అంత ఒరిజినాలిటీ క్రియేటివిటీ ఏం లేవు , అలా అంటే గొప్ప గొప్ప దర్శకులు చాల మంది నిజ జీవితం లోని సంఘటణల నుంచే స్పూర్తి చెంది సినిమాలు తీసారనుకోండి , కానీ ఎందుకో మణి ని అందులో చేర్చ బుద్దికావట్లేదు .. పైగా ఆయన సినిమాల్లో ఇళయరాజా , బాలూ మహేంద్రన్ , పీ సీ శ్రీ రాం , శ్రీకర్ ప్రసాద్ లాంటి వారి పాత్రలు మరువలేనివి. నన్ను అడిగితే ఆయన మంచి డైరెక్టర్ కంటే మంచి మార్కెటింగ్ నిపుణుడు అంటాను నేను … దాని కి గురూ మార్కెటింగే సాక్ష్యం , 12 కోట్ల తో తీసిన సినిమాకి రిలీజ్ కాక మునుపే పాతికోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టున్నాడు మరి … మణి రత్నమా మజాకా ….

PS : ప్రతీ విశయాన్ని వంకర బుద్ది తో చూసే వారు ఉంటారు , కొంత వరకూ అయితే క్రిటిక్ అంటారు , మరీ శ్రుతి మించితే సినిక్ అంటారు , కాబట్టి నా లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉండనే ఉంటారు , కాబట్టి వళ్ళని లైట్ తీసుకొని ఆమిర్ తో మణి గారి నెక్స్ట్ సినిమా లజ్జో కి రెడీ అవ్వండి !!

PS 2 : This post is not inteneded to hurt any ones feelings , every thing above quoted and said are strictly my personal opinions not intended to hurt any one , or degrade any one , but if any one still feels hurted .. I DON’T CARE ;)

వర్గాలు క్రిటిక్స్ · డైరెక్టర్లు · సినిమాలు