సంభవామి యుగే యుగే

Entries categorized as ‘నేను’

A tête-à-tête with GOD

మే 15, 2007 · అభిప్రాయములు

ఈ పోస్టు నేను last year నా ఇంగ్లీష్ బ్లాగ్ 19 revolutions లో రాసింది !!

దాని లింకు

http://19revolutions.wordpress.com/2006/05/06/a-tete-a-tete-with-god/

నా పాత Blogger సైట్ లో కూడా ఇది ఉంది

దీని గురించి ఇక్కడెందుకంటే … ఇవ్వాల ఒక బ్లాగ్ దీని కొత్త version choosaa అక్కడ సోర్స్ ఇవ్వలేదు …. అందుకే ఇక్కడ ….

బై ద వే …. నేను నా ఇంగ్లీష్ బ్లాగ్ ని Blogger నుంచి WordPress కి migrate చేసానోచ్ …. దాదాపు ఆరు నెళ్ళైయ్యింది ఇంగ్లీష్ లో పోస్ట్ రాసి …. ఇప్పటినుంచైనా వారానికొక పోస్ట్ అయినా రాయాలని డిసైడ్ అయ్యా ….

తెలుగు ని కూడా మారుద్దామనుకున్నా కానీ ఎందుకో Blogger ని వదల బుద్ధి కావట్లేదు …still Blogger Rocks . ఎందుకో నాకు WordPress లో కొత్త Template upload చేద్దామంటే రావట్లేదు …. ఎన్ని tutorials చదివినా బుర్రకెక్కట్లేదు …
I royally suck at coding !! :) ఎనీ suggestions ?? సపరేట్ Doamin ఉంటే తప్ప WordPress అవసరం లేదనిపిస్తోంది , look n’ feel మాత్రం WordPress లో బావుంది !!

ఇంకో నెల తో నా మొదటి బ్లాగ్ బ్లాగర్ లో స్టార్ట్ చేసి నాలుగేళ్ళు పూర్తవుతుంది (started it in 2003) … కొన్ని కారణాల వల్ల అది డిలీట్ చెయ్యాల్సి వచ్చింది !!

వర్గాలు నేను

ఇంజనీరింగ్ అయిపోయింది

మే 6, 2007 · అభిప్రాయములు

హ హ … హి హి …. హు హూ … హే హే ….

అయిపోయింది .. మొత్తానికి పూర్తి అయ్యింది ….
ఎన్ని సబ్జెక్ట్లూ … ఎన్ని క్రెడిట్లూ … ఎన్ని అసైన్ మెంట్లూ ….
అబ్బబ్బబ్బా … వీటికి తోడూ అటెండెంసూ …
ఎంత కష్టం .. ఎంత నష్టం …. ఏదైతేనే … మొత్తానికి అయ్యింది !!
ఖేల్ ఖతం దుక్నం బంద్ !! డిన్ చిక్ …. డిన్ చిక్ … డిన్ చిక్ …. అంటూ ఇక లైఫ్ అంతా డాన్సింగే ….

అంతారాత్మ —- చస్స్ … నోర్ముయ్యి.. బే … ఇంజనీరింగ్ కష్టమా … ఎవడికి చెబుతున్నావు బే … నిజం చెప్పు అంత ఆనందంగా ఉందా ??

….. లేదు ….. లేదు … అస్సలు బాధ గా లేదు …..

అంతారాత్మ — లాగి ఒకటి పీకి ఇప్పుడు నిజంచెప్పు బే …

….. అవును బాధ గా ఉంది … ఏడుపొస్తోంది ….
రేపట్నుంచి … కాలేజ్ ఉండదు …
చుట్టూ ఫ్రెండ్స్ ఉండరూ …. బీట్ కొట్టడానికి రేఖ ఉండదు … కుళ్ళు జోకు లు వేసి నవ్వించే భరత్ ఉండడు …
బంక్ కొట్టడానికి … బాలాజీ సార్ క్లాస్ ఉండదు … ఆటపట్టించడానికి … జూనియర్లుండరు …
ఇక వర్షం లో ఫుట్ బాల ఆడలేం , క్లాస్ మధ్య లో sms లుండవ్ ….
క్లాస్ కారీడార్ ఖాలీ …. కాంటీన్ ఖాలీ …. బాస్కెట్ బాల్ కోర్టు ఖాలీ … మా మనస్సులే ఖాలీ …
నైట్ ఔట్ కొట్టడానికి రేపు ఎగ్జాం ఉండదు … యెస్స్ సర్ చెప్పడానికి అటెండెంస్ పిలవరు …. చిల్కూర్ లో 100 రౌండ్స్ కొట్టినా రెజల్స్ట్స్ రావు ..
ఇప్పుడన్నీ … ఫ్యూచర్ గురించే పాట్లు … మావా.. రామూ గాడు IBM అంట … అంటే … నా బిందూ US దొబ్బేస్తోంది అని ఇంకోడి ఏడుపు …
పే పాకేజీ లు … వీసా డేట్లు … వీటి గురించే ఇప్పుడు … అలోచన .. తిరిగి చూసుకుంటే …. అబ్బ ఎంత బావుంది ఇంజనీరింగ్ లైఫ్ … దేవుడా … ఇంకొక్క సం వ ఉంటే బావుండు …. కుదరదా ?? పోనీ ఓ రెండేళ్ళు వెనక్కి తిప్ప గలవా … అది కూడా చేయ లేవా ?? వింటున్నవా ??
దేవుడా …. నీ కేం కావాలన్నా ఇస్తా … పాతిక కొబ్బరి కాయలా ?? పాకెట్ మనీ మొత్తమా ?? పోనీ నా సంతోషం లో సగం ?? …


వర్గాలు నేను

మార్నింగ్ రాగా …

ఏప్రియల్ 28, 2007 · అభిప్రాయములు

ఈ పోస్టు మార్నింగ్ రాగా సినిమా గురించి కాదు , నన్ను ఏడిపించిన మార్నింగ్ రాగం గురించి ;) !!

రెండేళ్ళ కిందట నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో (ఇప్పుడు నేను 4th year) మా ఇంటి ముందున్న అపార్ట్మెంట్ లో ఒక ఇంజనీరింగ్ చదివే అమ్మయిల గుంపు ఉండేది … 5 గురు ఉండేవారు ఫ్లాట్ లో …. కొండముచ్చు జాతికి చెందిన రకాలు ….

మామూలుగా 8 కే లేచి కాలేజ్ వెళ్ళే నా స్కెడ్యూలు కాస్తా హాలిడేస్ రావడం తో రెగులర్ స్కెడ్యూల్ కి వచ్చేసింది … రాత్రి పొద్దుపోయేవరకు ఇంటర్నెట్ మీద ఉండి ..పొద్దున లేచే సరికి మధ్యాహనం ఒకటో … రెండో .. అయ్యేది .. మా ఇల్లు డుప్లెక్స్ కావడం తో నా రూం 1st ఫ్లోర్ లో ఉండేది … అదీ నా ఖర్మ కొద్ది … ఆ కోతుల రూం కి ఎదురుగా …
మొదటి రోజు … నేను లేచి బ్రష్ చేసుకోవడానికి బయట బాల్కానీ లోకి రాగానే … MS SUBBALAKSHMI వెంకటేశ్వర సుప్రభాతం వినిపించింది .. కోతుల ఫ్లాట్ లోంచి … హ ..హ .. వీళ్ళు కూడా మన బాపతే అనుకుకొని నవ్వుకున్నాను …. కానీ ఇలా రోజూ అవుతుండడం తో డౌటొచ్చి గమని0చడం మొదలెడితే అసలు విశయం తెలిసింది … వాళ్ళు సుప్రభాతం పెట్టేది నన్ను ఏడిపించడానికి .. తెల్లారింది … మన హీరో గారు లేచారు సుప్రభాతం వినిపించండి సారుకు అన్నట్లు అలా పెట్టేవారు … మొదట్లో ఎంబారసింగ్ గా కూసింత సిగ్గు గా అనిపించింది …. కానీ వాళ్ళకు భయపడేదేంటి … చెంఢాలంగా … అలా చేస్తే ఆ.భా.ని.స (అఖిల భారత నిద్రపోతుల సంఘం ) కి అన్యాయం చేసిన వాడిని అవుతానని , వాళ్ళ గోల పట్టించుకోకుండా నా స్కెడ్యూల్ కంటిన్యూ అయ్యాను …. కానీ వాళ్ళ గోల ఆగ లేదు … పైగా ఎంత వరకూ వెళ్ళారంటే ….” త్వరగా నిద్ర లేవడం వల్ల లాభాలు ” అంటూ నా నిద్ర ను దేశ ఆర్ధిక పరి స్థితి కి లింకు పెడుతూ ఒక 2 పేజీల ఆకాశ రామన్న లెటర్ రాసారు నాకు …దీనికి తోడు మా అమ్మ ‘చూడు సెలవులైనా ఆ అమ్మాయిలు ఎంత చక్కగా పొద్దున్నే లేచి ఎంత చక్కగా చదువుకుంటున్నారో .. ‘ అంటూ విశేశ్కారాలు మొదలెట్టేది …చిర్రెత్తిపోయింది … కానీ ఏం చేయలేని స్థితి … వెళ్ళి నా నిద్ర నా ఇష్టం మీకేంటి బాధ అని లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దామంటే … కనీస పరిచయం కూడా లేదు … పైగా ఐదుగురు ఆడ రౌడీలు … లాగి ఒకటి ఇచ్చారంటే … వా… అనుకుంటూ ఇంటికి వెళ్ళాల్సిందే … చివరకు ఇలా అయితే కాదని బస్స్ స్టాప్ దగ్గర మాటేసి … వాళ్ళల్లో
ఇద్దరు కనిపించ గానే వెళ్ళి అసలేంటి మీ బాధ …. అని అడిగి కడిగి పారేసాను . ఏంమాట్లాడకుండా కిస .. కిస నవ్వుకుంటూ వెళ్ళిపోయారు … అందరూ కలిసి ఏంఅనుకున్నారో ఏమో మొత్తానికి గోల ఆపేసారు , సారీ కూడా చెప్పారు …. మెళ్ళగా మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారనుకోండి .

ఇంతకీ ఈ సుత్తంతా ఎందుకంటే .. ఈ మధ్య CAT exam కి సంభంధించి బెంగళూరు లో IIM ఇంటర్వ్యూలు అట్టెండ్ అయ్యాను .. అక్కడ ఇంటర్వూ లో ” నీకు జీవితం లో ఎదురైన మోస్ట్ ఎంబారసింగ్ సంఘటన ఏది ? అందులోంచి ఎలా బయట పడ్దావ్ ” అని ఓ అడిగారు .. ఈ కధ పూర్తి గా చెప్పేసరికి నా సెలక్షన్ సంగతి దేవుడెరుగు .. జ్యూరీ మొత్తం నవ్వుతూనే ఉన్నారు … ఇప్పుడు మాత్రం మార్నింగ్ రాగా కంటే జ్యూరీ నవ్వులే మరింత ఎంబారసింగ్ గా అనిపిస్తుంది … , ఈ పోస్ట్ చదివి మీరు కూడా అలా ఫీల్ అయితే నేనేమీ చెయ్యలేను … :( , అయితే నాదో ఎదవ కొచ్చనీ మీకు జీవితం లో ఎదురైన అత్యంత ఎంబారసింగ్ సీన్ ఏది ??

వర్గాలు నేను